DIY Natural Hair Oils। ఈ నూనె వాడితే, వారంలోనే మీ జుట్టు రాలడం ఆగుతుంది!
DIY Ayurvedic Natural Hair Oils: ఈ ఆయుర్వేద నూనెలు వాడితే, వారంలోపు మీ జుట్టు రాలడం ఆగిపోతుంది. ఆరోగ్యకరమైన, మెరిసే అందమైన జుట్టును, బలమైన జుట్టును పొందవచ్చు. ఆ నూనెలను ఈ కింద చూడండి.
Ayurvedic Natural Hair Oils: వర్షాకాలంలో జుట్టు రాలడం దాదాపు 30 శాతం పెరుగుతుంది. గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల జుట్టు అదనపు హైడ్రోజన్‌ను గ్రహిస్తుంది, ఇది జుట్టులోని సహజ నూనెలను హరిస్తుంది. దీంతో జుట్టు పొడిబారి, కుదుళ్ల నుంచి బలహీనంగా మారుతుంది. ఫలితంగా వెంట్రుకలు ఊడి వస్తాయి. దీనిని బట్టి ఈ వర్షాకాలంలో మీ జుట్టుకు నూనె అవసరం. నూనెతో జుట్టుకు సరైన పోషణ లభించి బలోపేతం అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మార్కెట్లో అనేక నూనెలు అందుబాటులో ఉన్నప్పటికీ, జుట్టును సరైన సంరక్షణ ఇంట్లో తయారుచేసిన సహజ నూనెతోనే లభిస్తుంది. జుట్టు పెరుగుదల లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఆయుర్వేద మూలికలు కలిగిన నూనెతో మీ జుట్టును మాయిశ్చరైజ్ చేయడం ముఖ్యం.
వెంట్రుకల కోసం ఇంట్లోనే సహజమైన నూనెను ఎలా తయారు చేయవచ్చో, ఇక్కడ మీకు రెండు DIY హెయిర్ ఆయిల్ రెసిపీలను తెలియజేస్తున్నాం. ఈ నూనెలు వాడటం ద్వారా వారంలోపు మీ జుట్టు రాలడం ఆగిపోతుంది. ఆరోగ్యకరమైన, మెరిసే అందమైన జుట్టును, బలమైన జుట్టును పొందవచ్చు. ఆ నూనెలను ఈ కింద చూడండి.
DIY Coconut Hibiscus Hair Oil
- కావలసినవి:
- 1 కప్పు కొబ్బరి నూనె
- 1 పిడికెడు కరివేపాకు
- 2 టీస్పూన్లు ఉసిరి పొడి
- 2 టీస్పూన్లు మెంతులు
- 2 మందార పువ్వులు
కొబ్బరి మందార హెయిర్ ఆయిల్ ఎలా వాడాలి
ఒక గాజు సీసాలో కొబ్బరి నూనెను కరివేపాకు, ఉసిరి పొడిని కలపండి. ఈ సీసాని సీల్ చేసి, ప్రతిరోజూ కనీసం 3 గంటలు సూర్యుని క్రింద ఉంచండి. ఒకటి నుండి రెండు వారాల తర్వాత, దాని రంగు ముదురు రంగులోకి మారినట్లు మీరు గమనించవచ్చు. అప్పుడు ఈ నూనెను ఫిల్టర్ చేయండి. మీ నేచురల్క్ హెయిర్ ఆయిల్ రెడీ. ఈ నూనెను ఉపయోగించే ముందు కొద్దిగా వేడి చేయండి, ఆపై గోరువెచ్చటి నూనెను మీ తలకు మసాజ్ చేస్తూ పెట్టుకోండి. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే, వారం తర్వాత తేడా మీకే తెలుస్తుంది.
DIY Bhringraj Neem Oil
కావలసినవి:
- 1 కప్పు కొబ్బరి నూనె
- 2 కప్పులు నువ్వుల నూనె
- 1/2 కప్పు ఆముదం
- 4 టీస్పూన్లు బ్రహ్మీ పొడి
- 3 టీస్పూన్లు భృంగరాజ్
- 1 టీస్పూన్ వేప ఆకులు చూర్ణం
- 1 టీస్పూన్ కరివేపాకు చూర్ణం
- 1 టీస్పూన్ మెంతుల చూర్ణం
- 2 టీస్పూన్లు ఉసిరి పొడి
- 4 మందార పువ్వులు
బృంగరాజ్ వేప నూనె ఎలా వాడాలి
పైన పేర్కొన్న నూనెలన్నింటినీ ఒక గిన్నెలో కలిపేయాలి, ఆపై అందులో పైన పేర్కొన్న మిగతా పదార్థాలన్నీ వేసి, ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు వేడిచేయాలి. ఆపై చల్లబరిచి, నూనెను ఫిల్టర్ చేసి ఒక గాజు సీసాలో భద్రపరచండి. ఈ నూనెను అవసరం మేరకు తీసుకొని తలకు పట్టించి మసాజ్ చేయండి, కనీసం 30 నిమిషాలు ఉంచుకొని ఆపై తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి.
సంబంధిత కథనం