Healthy Drink: ప్రతిరోజూ ఈ పానీయంతో మీ రోజును ప్రారంభించండి, డయాబెటిస్ నుంచి కిడ్నీ సమస్యల వరకు ఏవీ రావు-start your day with tulasi drink every day nothing from diabetes to kidney problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Drink: ప్రతిరోజూ ఈ పానీయంతో మీ రోజును ప్రారంభించండి, డయాబెటిస్ నుంచి కిడ్నీ సమస్యల వరకు ఏవీ రావు

Healthy Drink: ప్రతిరోజూ ఈ పానీయంతో మీ రోజును ప్రారంభించండి, డయాబెటిస్ నుంచి కిడ్నీ సమస్యల వరకు ఏవీ రావు

Haritha Chappa HT Telugu
Aug 27, 2024 07:00 AM IST

Healthy Drink: రాత్రంతా ఏమీ తినకుండా ఉదయం వరకు ఉపవాసం చేశాక... ఉదయాన్నే ఆరోగ్యకరమైన ఆహారంతోనే రోజును ప్రారంభించాలి. ప్రతిరోజూ తులసి ఆకుల నీటిని తాగడం ద్వారా మీరు ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు.

తులసి టీ
తులసి టీ

Healthy Drink: రాత్రి భోజనం చేశాక ఉదయం వరకు ఏమీ తినరు. ఆ సమయం అంతా పొట్ట ఉపవాసం చేస్తుంది. మరుసటి రోజు ఉదయం ఆ పొట్టను ఆరోగ్యకరమైన ఆహారంతోనే నింపాలి. ప్రతిరోజూ ఖాళీ పొట్టతో తులసి నీటినీ తాగడం అలవాటు చేసుకోండి. డయాబెటిస్ నుంచి కిడ్నీ సమస్యల వరకు ఎన్నో అదుపులో ఉంటాయి. వాటిని రాకుండా నిరోధించడంలో కూడా తులసి ఆకుల రసం ముందుంటుంది.

yearly horoscope entry point

తులసి ఆకుల నీరే ఔషధం

పవిత్ర తులసిని వేల సంవత్సరాలుగా ఔషధంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో తులసి ముఖ్యమైన మెడిసిన్. శతాబ్దాల నుండి అనేక రకాల రుగ్మతలకు చికిత్స చేసేందుకు తులసిని వాడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

తులసిలో ఆకులు, కాండం పువ్వు, వేర్లు, గింజల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇదే దాని ప్రత్యేకత. ప్రతిరోజూ తులసి ఆకుల నీటిని తాగడం ద్వారా రోజును ప్రారంభిస్తే నెల రోజుల్లోనే మీలో ఎన్నో మంచి మార్పులు చూస్తారు.

తులసి ఆకుల నీరు తయారీ

కొన్ని తులసి ఆకులను లేదా గింజలను తీసుకొని వేడి నీటిలో వేయండి. రెండు నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి ప్రతిరోజు ఖాళీ పొట్టతో తాగండి. ఇదే తులసి ఆకుల రసం. వీటిని ప్రతిరోజు ఖాళీ పొట్టతో తాగడం వల్ల మీరు ఊహించలేనని ప్రయోజనాలు ఉన్నాయి.

జలుబు, గొంతు నొప్పి

తులసి ఆకుల రసాన్ని ప్రతిరోజు తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి రాకుండా ఉంటాయి. అలాగే డెంగ్యూ, మలేరియా, సీజనల్ ఫ్లూ వంటి వాటిని నయం చేయడంలో కూడా తులసి ఆకుల నీరు ముందుంటుంది. తులసి ఆకులను ఆయుర్వేదంలో దగ్గుకు చికిత్స చేసేందుకు వాడుతారు. ప్రతిరోజూ రెండు తులసి ఆకులను నమిలినా మంచిదే. ఆ తులసి ఆకులకు కాస్త తేనె పూసుకొని నమిలేయండి. ఇది శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. శ్లేష్మ ఎక్కువగా విడుదలవకుండా అడ్డుకుంటుంది. గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది.

కిడ్నీ ఆరోగ్యానికీ..

కిడ్నీలు తెలియకుండానే పాడవుతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవారు ప్రతిరోజూ తులసి ఆకుల నీటిని తాగడం మంచిది. మూత్రనాళాల ద్వారా ఆ రాళ్ళను తొలగించడానికి తులసి ఆకుల నీరు సహాయపడుతుంది. కాకపోతే కనీసం 6 నెలల పాటు ఈ నీటిని తాగాల్సి ఉంటుంది.

డయాబెటిస్ ఉన్నవారికి

తులసి ఆకుల్లో డయాబెటిస్‌ను తగ్గించే గుణం ఉంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను, అలాగే రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి కూడా తులసి సహాయపడుతుంది. ఖాళీ పొట్టతో రెండు నుండి మూడు తులసి ఆకులను నమిలినా మంచిదే. లేదా ఒక టేబుల్ స్పూన్ తులసి ఆకుల రసాన్ని తాగినా మంచిదే. తులసి ఆకుల నీటిని తాగినా కూడా ఈ ప్రయోజనాలు కలుగుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

తులసిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు చర్మవ్యాధులను తగ్గించడానికి సహాయపడతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు తులసి రసాన్ని తీసి ఆ గాయాలకి అప్లై చేసినా ఎంతో మేలు జరుగుతుంది.

ఒత్తిడిని తగ్గించేందుకు

తులసి ఆకుల నీరు లేదా టీనే ప్రతిరోజు తాగితే మీకు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.

గుండె ఆరోగ్యానికి

పవిత్ర తులసిలో విటమిన్ సి ఉంటుంది. అలాగే యూజెనాల్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హానికర ఫ్రీ రాడికల్స్ నుంచి గుండెకు రక్షణ కల్పిస్తాయి. తులసిని తినడం వల్ల అల్లం, వెల్లుల్లి, ఎర్ర ద్రాక్ష, రేగుపండ్లు తినడంతో సమానం.

అధిక రక్తపోటును తగ్గిస్తుంది

తులసి ఆకుల్లో పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ తులసి ఆకులన్నిటిని పరగడుపున తాగడం వల్ల హై బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఉదయాన్నే పరగడుపున ఖాళీ పొట్టతో తులసి ఆకుల నీటిని తాగి చూడండి. కనీసం నెల రోజుల్లో హైబీపీ సహజంగానే అదుపులోకి వచ్చేస్తుంది.

Whats_app_banner