Summer Veggies: వేసవి వచ్చేసింది, ఈ కూరగాయలు ఈరోజు నుంచే తినడం ప్రారంభించండి, ఇవి సమ్మర్ స్పెషల్స్-start eating these vegetables today these are summer specials ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Veggies: వేసవి వచ్చేసింది, ఈ కూరగాయలు ఈరోజు నుంచే తినడం ప్రారంభించండి, ఇవి సమ్మర్ స్పెషల్స్

Summer Veggies: వేసవి వచ్చేసింది, ఈ కూరగాయలు ఈరోజు నుంచే తినడం ప్రారంభించండి, ఇవి సమ్మర్ స్పెషల్స్

Haritha Chappa HT Telugu

Summer Veggies: సీజన్ కు తగ్గట్టు మనం ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. వేసవి వేడి పెరిగిపోయింది. కాబట్టి కొన్ని కూరగాయలను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

వేసవి కూరగాయలు (Pixabay)

మార్చి నెల నుంచి ఎండలు మండిపోతున్నాయి. వేసవి సెగలు తగిలేస్తున్నాయి. కాబట్టి మీరు భోజనంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాలానుగుణంగా కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం దక్కుతుంది. వేసవిలో దొరికే కూరగాయలు పోషకాలతో నిండి ఉంటాయి. అలాగే మన శరీరాన్ని హైడ్రేటింగ్ గా ఉంచుతాయి. సీజనల్ వ్యాధుల నుండి మనల్ని కాపాడతాయి. కాబట్టి మీరు ఈరోజు నుంచే తినడం ప్రారంభంచాల్సిన కూరగాయలు కొన్ని ఉన్నాయి.

సొరకాయలు

సొరకాయలను ఎంతోమంది ఇష్టపడరు. నిజానికి దీన్ని సరైన పద్ధతిలో వండితే చాలా రుచిగా కూరలు సిద్ధమవుతాయి. ఎండలు మండిపోతున్నప్పుడు ఉత్సాహంగా జీవించాలంటే సొరకాయ తినడం ఎంతో ముఖ్యం. నీటితో నిండిన ఈ కూరగాయ మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి త్వరగా జీర్ణం అయిపోతుంది. దీన్ని సాంబార్లో, పప్పులో జోడిగా వేసుకోవచ్చు. లేదా శనగపప్పు వేసి కూరలా వండుకోవచ్చు.

మునగాకులు

మునగ ఆకుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీనిలో ఉండే పోషకాలు ప్రపంచంలోనే వీటిని సూపర్ ఫుడ్ గా మార్చాయి. దీనిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లకు నిలయం ఇది. కాబట్టి మునక్కాయలతో పాటు మునగాకులను కూడా వేసవిలో తినాలి. ఈ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

గుమ్మడికాయ

గుమ్మడికాయ ఆరోగ్యకరమైనది. దీనిలో పోషకాలు నిండుగా ఉంటాయి. బీటా కెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ బీటా కెరటిన్ శరీరంలో చేరాక విటమిన్ ఏగా మారుతుంది. ఇది దృష్టి సంబంధాలు రాకుండా అడ్డుకుంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుమ్మడికాయలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి మలబద్ధకం అంటే సమస్యలు రావు. పైగా తిన్నది చక్కగా అరుగుతుంది.

దోసకాయ

కీర దోసకాయ ఎంతో మంది ఫేవరెట్. దీన్ని వండుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా తినేయొచ్చు. దోసకాయ మిమ్మల్ని కూల్ గా ఉంచడానికి ఉత్తమమైన ఎంపిక. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ కే దీనిలో అధికంగా ఉంటుంది. అలాగే చర్మాన్ని మెరిపించే శక్తి కూడా దీనికి ఉంది. కాబట్టి కీరా దోసకాయ కచ్చితంగా తినాల్సిందే.

ఆకుపచ్చ బీన్స్

బయట బీన్స్ వేసవిలో అధికంగానే దొరుకుతాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీలు మాత్రం తక్కువగా ఉంటాయి. వీటిని ఎంత తిన్నా కూడా శరీరం బరువు పెరగదు. పైగా ఇవి చర్మ ఆరోగ్యానికి, శక్తిని పెంచడానికి ఇవి ఎంత సహకరిస్తాయి.

పొటల్స్

పొటల్స్‌ను పర్వాల్ అని కూడా పిలుస్తారు. ఇవి దొండకాయ లాగా ఉంటాయి. కాకపోతే వాటికన్నా పెద్దవిగా ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పోషకాలు నిండుగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకి ఎంతో సహాయపడుతుంది. పొటల్స్ ను వండుకొని తరచూ తినడం వల్ల ఎన్నో రకాల రోగాలు వేసవిలో రాకుండా ఉంటాయి. కాబట్టి పొటల్స్ ను తక్కువ అంచనా వేయకుండా తినడం అలవాటు చేసుకోండి.

సరైన పద్ధతిలో వండితే అన్నీ రుచిగానే ఉంటాయి. కొన్ని వండాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి వేసవిలో వీటిని మాత్రం తినడం మర్చిపోవద్దు.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం