Super Foods: దీర్ఘాయుష్షును పొందాలనుకుంటే ఈరోజు నుంచే ఈ సూపర్ ఫుడ్స్‌ను తినడం ప్రారంభించండి, ఎక్కువ కాలం బతుకుతారు-start eating these super foods today if you want to live longer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Super Foods: దీర్ఘాయుష్షును పొందాలనుకుంటే ఈరోజు నుంచే ఈ సూపర్ ఫుడ్స్‌ను తినడం ప్రారంభించండి, ఎక్కువ కాలం బతుకుతారు

Super Foods: దీర్ఘాయుష్షును పొందాలనుకుంటే ఈరోజు నుంచే ఈ సూపర్ ఫుడ్స్‌ను తినడం ప్రారంభించండి, ఎక్కువ కాలం బతుకుతారు

Haritha Chappa HT Telugu
Sep 25, 2024 11:00 AM IST

Super Foods: ఎక్కువకాలం జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ నేటి కాలంలో ఎప్పుడు ఏ వ్యాధి వచ్చి పడుతుందో తెలియదు. ఈ సూపర్ ఫుడ్స్ తినడం ద్వారా మీ ఆయుష్షును పెంచుకోవచ్చు.

ఆయుష్షును పెంచే ఆహారాలు
ఆయుష్షును పెంచే ఆహారాలు (Pixabay)

Super Foods: మారుతున్న కాలంలో వృద్ధాప్యం త్వరగానే వచ్చేస్తుంది. అవయవాలు పనితీరే మారిపోతుంది. అంటువ్యాధుల వల్ల ఆయుష్షు తరిగిపోతోంది. దీనంతటికీ కారణం చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం. ఈ రెండింటి వల్లే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారి అనేక రకాల రోగాల బారిన పడేలా చేస్తుంది. మీరు ఎక్కువకాలం జీవించాలనుకుంటే ఇక్కడ మేము చెప్పిన సూపర్ ఫుడ్స్‌ను మీ ఆహారంలో భాగం చేసుకోండి. రేపు తిందాం, ఎల్లుండి తిందాం అనుకోకండి. నేటి నుంచే ఈ సూపర్ ఫుడ్స్ తినడం మొదలుపెట్టండి.

బాదం పప్పులు

బాదం పప్పులు రోజూ ఎక్కువ తినక్కర్లేదు. నీటిలో నానబెట్టినవి ప్రతిరోజూ ఉదయం అయిదు తినండి చాలు. మీ రోగ నిరోధక శక్తి చాలా పెరుగుతుంది. విటమిన్ ఈ, ఫోలేట్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు బాదంలో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పసుపు

మీరు వండే ప్రతి కూరలో పసుపు కచ్చితంగా వేయండి. దీనిలో కర్కుమిన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంది. పసుపును ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి త్వరగా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. గోరువెచ్చని నీరు లేదా పాలల్లో పసుపు కలుపుకొని తాగడం అలవాటు చేసుకోండి. పులుసులు, కూరల్లో కూడా పసుపును కచ్చితంగా వాడండి.

అల్లం

ఇది రుచిగా ఉండదు. కానీ ఆరోగ్యాన్ని మాత్రం అందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుంది. అన్నం తినడం వల్ల రోగనిరోధక శక్తిని త్వరగా పెంచుకోవచ్చు. అల్లం టీ తాగుతూ ఉండండి. మీరు తాగే సూపుల్లో అల్లం తరుగును చల్లుకోండి. లేదా కూరల్లో అల్లం ముక్కలను వేసి వండుకోండి. ఎలాగైనా అల్లం శరీరంలో చేరడం చాలా ముఖ్యం.

పుల్లని పండ్లు

పుల్లని పండ్లు అనగానే అందరికీ కేవలం నిమ్మ, నారింజే గుర్తొస్తాయి. ఇవే కాదు కివీ, ద్రాక్షలు వంటివి కూడా కాస్త పుల్లగానే ఉంటాయి. వీటిని కూడా తినాలి. అలాగే సీజనల్‌గా దొరికే పండ్లను కూడా తింటూ ఉండాలి. నేరేడు పండ్లు సీజనల్‌గా దొరుకుతాయి. వాటిని కచ్చితంగా తినాలి. బొప్పాయి పండ్లను రెండు రోజులకు ఒకసారి తింటూ ఉండాలి. ఇవన్నీ కూడా మన రోగనిరోధక వ్యవస్థను బలపడేలా చేస్తాయి. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి శరీరానికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా రక్షణ వలయంలా ఇవి కాపాడతాయి.

నిమ్మకాయ

నిమ్మకాయకు సీజన్ తో పనిలేదు. ఏ కాలంలోనైనా అవి దొరుకుతాయి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి తో చేసే ఆహారాలు తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తి వస్తుంది. బలమైన రోగనిరోధక శక్తికి నిమ్మకాయ వాడడం చాలా ముఖ్యం. ప్రతి ఆహారంలోనూ వీలైనంత వరకు నిమ్మకాయను భాగం చేయండి. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకొని తాగుతూ ఉండండి.

వెల్లుల్లి

వెల్లుల్లి రుచి కూడా తినేందుకు కష్టంగానే ఉంటుంది. కానీ ఇది కూరలకు రుచిని మాత్రం పెంచుతుంది. వెల్లుల్లిని ప్రతి రోజు ఉదయం పరగడుపున రెండు రెబ్బలను తినడం ఎంతో ముఖ్యం. కానీ దీని రుచి తట్టుకోలేక చాలామంది తినరు. అలాంటివారు వెల్లుల్లిన కూరల్లో కలిపి వండుకోవాలి. సూపుల్లో వెల్లుల్లి వేసి బాగా మరగ కాచి తినాలి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తాయి.

పైన చెప్పిన ఆహారాలన్నీ తినటం వల్ల నెల రోజుల్లోనే మీలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. మీరు ఆరోగ్యంగా ఉంటారు. చురుగ్గా ఉంటారు. అలాగే మీ ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఎలాంటి అనారోగ్యాలు మీ దరి చేరవు. ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి ఆయుష్షు కూడా పెరగడం ఖాయం.

టాపిక్