Weightloss: అయిదు రోజుల్లో పది కిలోలు తగ్గిన స్టార్ సింగర్, ఆమె ఏం చేసిందో తెలుసుకోండి-star singer who lost ten kilos in five days know the weightloss tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weightloss: అయిదు రోజుల్లో పది కిలోలు తగ్గిన స్టార్ సింగర్, ఆమె ఏం చేసిందో తెలుసుకోండి

Weightloss: అయిదు రోజుల్లో పది కిలోలు తగ్గిన స్టార్ సింగర్, ఆమె ఏం చేసిందో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Dec 27, 2024 09:30 AM IST

weightloss tips: బాలీవుడ్ స్టార్ సింగర్ సునిధి చౌహాన్ అయిదు రోజుల్లోనే పది కిలోలు తగ్గింది. 41 ఏళ్ల వయసులో ఆమె ఉపవాసంతో బరువు తగ్గింది. ఆమె ఎలా బరువు తగ్గిందో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

సునిధి చౌహాన్
సునిధి చౌహాన్

బరువు తగ్గడం అనేది పెద్ద సమస్యగా మారింది. బరువు పెరిగినంత సులువుగా తగ్గలేరు. అందుకే బరువు పెరుగుతున్నట్టు అనిపించిన వెంటనే వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం వంటివి చేయాలి. 41 ఏళ్ల సునిధి చౌహాన్ కేవలం అయిదు రోజుల్లోనే పది కిలోలు తగ్గి మెరుపుతీగలా మారింది. ఆమె ఎలా బరువు తగ్గిందో కూడా చెబుతోంది. 

yearly horoscope entry point

బరువు తగ్గడానికి  మీ ఆహారం, వ్యాయామం పట్ల  తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని సునిధి చౌహాన్ చెబుతోంది. తాజాగా మిడ్ డేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 41 ఏళ్ల సునిధి తన డైట్, ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి చెప్పుకొచ్చింది.  వీటిని పాటిస్తే ప్రతి ఒక్కరూ సులువుగా బరువు తగ్గవచ్చు. 

సునిధి ఫిట్ నెస్ ట్రైనర్ విరాజ్ సర్మల్కర్  కూడా ఓ ఇంటర్వ్యూలో బరువు తగ్గడం గురించి సులువైన చిట్కాలు చెప్పారు. ఓ పాట కోసం సునిధి ఇలా బరువు తగ్గినట్టు ఆయన చెప్పారు.  సునిధి తన బరువును తగ్గించుకుని టోన్డ్ బాడీతో మారింది. ప్రతి రోజూ అయిదు కిలోమీటర్లు పరుగెత్తేది. 

ఆహారంలో మార్పులు

సునిధి ఆహారంలో ఎన్నో మార్పులు చేసుకుంది. సునిధి రోజుకు 1,200 కేలరీల కంటే తక్కువ ఆహారాన్నే తీసుకుంటుందని సునిధి డైట్ సీక్రెట్స్ విరాజ్ తెలిపారు. అడపాదడపా ఉపవాసం కూడా చేసేదని చెప్పారు. 'ఉపవాసం ఉండటానికి ప్రేరణ బరువు తగ్గడమే కాదు, పేగులకు విశ్రాంతి ఇవ్వడం' అని ఆమె తెలిపింది.

తాను రోజుకు 16 గంటలు ఉపవాసం ఉంటానని, మిగతా 8 గంటల సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని సునిధి వెల్లడించింది. ఆమె తన రోజును గుడ్లతో మొదలుపెడుతుంది. బ్రేక్ ఫాస్ట్ లో ప్రొటీన్ ఉండే ఆహారాన్ని తినడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు.

రాత్రి భోజనం చేశాక ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ముందు 16 గంటల గ్యాప్ ఉండేలా చూసుకుంది సునిధి. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినడంతో రోజును ప్రారంభించాలి. కార్బోహైడ్రేట్ల కంటే ఇవి చాలా ముఖ్యమైనవి. రాత్రి భోజనం సాయంత్రం 5 గంటలకు పూరి చేసేది. మధ్యలో ఆకలేస్తే నట్స్ వంటివి తింటూ ఉండేది. ఆ నట్స్ తినడం వల్ల మూడు గంటల పాటూ శక్తి అందుతూనే ఉంటుంది. వ్యాయామం చేసేటప్పుడు వారానికి రెండు లేదా మూడు సార్లు ప్రోటీన్ షేక్ వంటివి తీసుకునేది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner