Standing Benefits : నిలబడి కూడా బరువు తగ్గవచ్చు.. ఇది నిజమండి-standing also helps to weight loss believe it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Standing Also Helps To Weight Loss Believe It

Standing Benefits : నిలబడి కూడా బరువు తగ్గవచ్చు.. ఇది నిజమండి

Anand Sai HT Telugu
Mar 20, 2024 05:30 AM IST

Weight Loss With Standing : బరువు తగ్గేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే నిలబడినా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా?

నిలబడి బరువు తగ్గవచ్చు
నిలబడి బరువు తగ్గవచ్చు (Unsplash)

రోజూ గంటల తరబడి కూర్చునే వారికి బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. దీంతో చాలా మంది రకరకాల డైట్ ప్లాన్స్, ఫిజికల్ ఎక్సర్ సైజుల్లో మునిగిపోతారు. ఇలా మీరు కొన్ని రోజుల్లో బరువు తగ్గినప్పటికీ, అది పెద్దగా ఉపయోగపడదు. మీరు కోరుకున్న విధంగా బరువు తగ్గడం సాధ్యం కాదు.

నిపుణులు దీనికి మెరుగైన మార్గాన్ని సూచించారు. ఇది శాస్త్రీయంగా నిజం. నిలబడితేనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. చాలా కాలంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. నిలబడి ఉన్నప్పుడు బరువు తగ్గడం ఎలాగో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కుర్చీని వదిలేసి, నిలబడి చేయగలిగే పని చేస్తే శరీరం అదనపు బరువు తగ్గుతుంది. ఎలాగో కింద తెలుసుకోండి.

దాదాపు పది మందిలో ఏడుగురి జీవితాలు అల్లకల్లోంగానే ఉన్నాయి. సమయాభావం వల్ల వ్యాయామం చేసేందుకు సమయం దొరకడం లేదు. అయితే ఈలోపు నిలబడి చేయగలిగే పనులన్నీ చేస్తే శరీరం ఫిట్‌గా ఉంటుంది. ఎక్కువ సేపు కూర్చునే అలవాటు ఉంటే 100 శాతం లావు అయ్యే అవకాశం ఉంది. రోజంతా రెండున్నర గంటల కంటే ఎక్కువసేపు నిలబడి పని చేస్తే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

కేవలం నిలబడి ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది నిజానికి మెదడు శక్తిని పెంచుతుంది మరియు ఏకాగ్రతను పెంచుతుంది. గంటసేపు నిలబడితే దాదాపు 50 కేలరీలు ఖర్చవుతాయి. ఎంతసేపు నిలబడితే అంత ఫలం లభిస్తుంది.

రోజుకు మూడు గంటలు నిలబడితే గుండె వేగం బాగా పెరుగుతుంది. ఫలితంగా, శరీరం చాలా కేలరీలు వినియోగిస్తుంది. అంతే కాకుండా తిన్న తర్వాత కాసేపు నడిస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణ స్థితికి వస్తుంది. ఎక్కువ సేపు కూర్చునే వారికి గుండెపోటు వచ్చే అవకాశం 54 శాతం ఎక్కువ. నిలబడి ఉండటం వల్ల జీవక్రియ చాలా వరకు పెరుగుతుంది. ఫలితంగా ఆహారం జీర్ణం కావడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మన శక్తిని పెంచుతుంది. ఇది ఊబకాయాన్ని నివారిస్తుంది.

నిలబడి ఫోన్ మాట్లాడటం, గిన్నెలు కడగడం, మొక్కలకు నీళ్లు పోయడం, కూరగాయలు కోయడం, బట్టలు ఇస్త్రీ చేయడం, స్నేహితులతో కబుర్లు చెప్పుకోవడం వంటివి చేయవచ్చు. ఎక్కువసేపు కూర్చొని ఉంటే చాలా సమస్యలు వస్తాయి. అందుకే నిలబడి పనులు చేయడం అలవాటు చేసుకోండి. దీనితో మీకు చాలా రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. బరవు తగ్గే ప్రక్రియలో మన నిత్య జీవితంలో కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. బరువు తగ్గేయవచ్చు.

బరువు తగ్గే క్రమంలో సరైన ఆహారం తీసుకోవాలి. జీవనశైలి కూడా బాగుండాలి. చాలా మంది చేసే అతిపెద్ద తప్పు.. బరువు తగ్గే క్రమంలో ఇష్టం వచ్చినట్టుగా తినడం. సరైన వ్యాయామం చేయకపోవడం కూడా శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. బరువు తగ్గే సమయంలో మీ జీవనశైలి బాగుండాలి. మీరు తినే ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి. అప్పుడే ఈజీగా బరువు తగ్గుతారు.

WhatsApp channel