Shah Rukh Khan Diet: ఈ వయసులోనూ షారుక్ అంత హ్యాండ్‍సమ్, ఫిట్‍గా ఉండేందుకు ఫుడ్ సీక్రెట్స్ ఇవే.. ఇష్టమైనది ఏది?
Shah Rukh Khan Diet: నేడు (నవంబర్ 2) బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు. వయసు పెరుగుతున్నా షారుఖ్ హ్యాండ్‍సమ్‍గా కనిపిస్తున్నారు. ఫిట్‍నెస్ కొనసాగిస్తున్నారు. అయితే, తాను ఏం తింటానో ఆయన వెల్లడించారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
బాలీవుడ్ బాద్‍షా, సీనియర్ హీరో షారుఖ్ ఖాన్ నేడు (నవంబర్ 2) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయన 59వ యేట అడుగుపెట్టారు. వయసు పెరుగుతున్నా షారుఖ్ ఖాన్ అందం చెక్కుచెదరడం లేదు. ఇప్పటికీ హ్యాండ్‍సమ్‌నెస్‍తో అదరగొడుతున్నారు. ఫుల్ ఫిట్‍గా ఉన్నారు. తన లైఫ్‍స్టైల్, తినే ఆహారం గురించి గతంలో కొన్ని సందర్భాల్లో షారుఖ్ వెల్లడించారు.
తాను డైలీ ఏం తింటానో 2016లో ఎక్స్‌ప్రెస్‍ఫుడీ.కామ్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ తెలిపారు. నేడు షారుఖ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అప్పుడు తన ఫుడ్ సీక్రెట్స్ ఏం చెప్పారో ఇక్కడ చూడండి.
ఫిట్‍నెస్ కోసం తినేవి ఇవే
ఎప్పుడు ఫిట్‍గా ఉండేందుకు ఏం తింటారనే ప్రశ్నకు షారుఖ్ ఖాన్ స్పందించారు. “నేను వైట్ రైస్ తినను. వైట్ బ్రెడ్, షుగర్, ఆల్కహాల్ కూడా తీసుకోను. ఒకవేళ ఏదైనా క్యారెక్టర్ కోసం సిద్ధమయ్యేందుకు అవసరమైతే అవి స్వల్పంగా తీసుకుంటా. నేను లీన్ మీట్ (ఫ్యాట్ తక్కువగా ఉండే మాంసం), పప్పు ధాన్యాలు, ఎగ్ వైట్స్, గ్రిల్డ్ చికెన్ తింటా” అని షారుఖ్ చెప్పారు.
షూటింగ్‍లో ఉన్నా ఇంటి ఫుడ్డే
సినిమా షూటింగ్‍లో ఉన్నా.. ఇంట్లో వండిన ఆహారాన్నే తాను తెప్పించుకుంటానని షారుఖ్ ఖాన్ తెలిపారు. తందూరి చికెన్ లేకపోతే ఫిష్, కొన్నిసార్లు కూరగాయల వంటలు, బీన్ స్ప్రౌట్స్ తెప్పించుకుంటానని అన్నారు. రాత్రివేళ డిన్నర్ కోసం ఏం తింటారని అడిగితే.. తందూరి రోటీతో తందూరి చికెన్ తింటానని, అప్పుడప్పుడూ మటన్ వంటలు తింటానని తెలిపారు.
ఇష్టమైన ఫుడ్ ఇదే
తనకు ఇష్టమైన కంఫర్ట్ ఫుడ్ ఏది అనే ప్రశ్నకు షారుఖ్ ఆన్సర్ ఇచ్చారు. తందూరి చికెన్ తనకు చాలా ఇష్టమని తెలిపారు. “తందూరి చికెన్. నేను దానికి అడిక్ట్ అయిపోయా. నేను సంవత్సరంలో 365 రోజులు తందూరి చికెటన్ తినగలను” అని షారుఖ్ చెప్పారు.
బిస్కెట్లతో ఐస్‍క్రీమ్
ఇండియన్ స్వీట్స్ తింటారా అనే ప్రశ్నకు షారుఖ్ స్పందించారు. తాను ఎక్కువగా జంక్ ఫుడ్స్, డెసర్ట్స్ తినని చెప్పారు. అప్పుడప్పుడూ ఐస్‍క్రీమ్, ఓ చాక్లెట్ తింటానని తెలిపారు. తన భార్య గౌరీ ఖాన్ చేసే ఓ ప్రత్యేకమైన రెసిపీ గురించి స్టార్ హీరో వెల్లడించారు. డైజెస్టివ్ బిస్కెట్లతో మంచి ఐస్‍క్రీమ్‍ను గౌరీ తయారు చేస్తారని షారుఖ్ చెప్పారు. తాను ఎక్కువగా పండ్లు తినని తెలిపారు.
సినిమాల విషయానికి వస్తే.. షారుఖ్ ఖాన్ తదుపరి దర్శకుడు సుజయ్ ఘోష్‍తో ఓ మూవీ చేయనున్నారని తెలుస్తోంది. షారుఖ్ పుట్టిన రోజు సందర్భంగా రేపు (నవంబర్ 2) ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీకి యాక్షన్ డ్రామా మూవీకి కింగ్ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.