సొరకాయతో చేసే వంటకాలు రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడ మేము గుమ్మడికాయ కబాబ్ రెసిపీ ఇచ్చాము. దీన్ని చేయడం చాలా సులువు. పైగా ఎంతో రుచిగా ఉంటుంది. సాయంత్రం పూట వేడి వేడి సొరకాయ కబాబ్ తింటే ఆ మజానే వేరు. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే స్నాక్ రెసిపీ ఇది. ఎలా చేయాలో చూడండి.
సొరకాయ - ఒకటి
ఉల్లిపాయలు - ఒకటి
పచ్చిమిర్చి తరుగు -
అల్లం తరుగు - ఒక టీ స్పూను
ఉప్పు - రుచికి తగినంత
నిమ్మరసం - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
పుదీనా తరుగు - రెండు స్పూన్లు
పనీర్ తరుగు - నాలుగు స్పూన్లు
బ్రెడ్ ముక్కలు - రెండు
కారం - అర స్పూను
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
చాట్ మసాలా - ఒక స్పూను
మిరియాల పొడి - అర స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
నిమ్మరసం - ఒక స్పూను
1. సొరకాయను తురిమి ఒక గిన్నెలో వేయాలి. అందులో ఉప్పు వేసి బాగా కలపాలి.
2. కాసేపటికి నీరు దిగుతుంది. ఆ నీటిని పిండి మిగతా సొరకాయ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
2. ఒక మిక్సింగ్ బౌల్ లో సొరకాయ తరుగు, ఉల్లిపాయ తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి.
3. తర్వాత కారం, కొత్తిమీర తరుగు, చాట్ మసాలా, మిరియాలపొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
4. బ్రెడ్ ముక్కలను అందులో వేసి మెత్తగా నలుపుకోవాలి.
5. తర్వాత బాణలిలో నూనె వేడి చేసి చేత్తోనే కట్ లెట్ ఆకారంలో ఉన్న సొరకాయ కబాబ్స్ వేసి బాగా వేయించాలి.
6. ఓవెన్ ఉంటే 180 డిగ్రీల వద్ద 15-20 నిమిషాలు బేక్ చేయాలి.
7. పుదీనా చట్నీ లేదా పెరుగుతో ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇవి తింటే స్పైసీగా అనిపిస్తాయి కాబట్టి ఈ చట్నీల కాంబినేషన్ అదిరిపోతుంది.
ఇక్కడ చెప్పిన విధంగా సొరకాయ కబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. ఇవి చేయడం చాలా సులువు. ఇవి కారంగా ఉంటాయి కాబట్టి పెరుగుతో పిల్లలకు తినిపించాలి. సాయంత్రం పూట పిల్లలకు, పెద్దలకు ఇది మంచి స్నాక్స్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి వీటిని రుచి చూశారంటే జీవితం మర్చిపోలేరు. ఇంకెందుకాలస్యం సొరకాయ కబాబ్స్ వండేందుకు ప్రయత్నించండి.
సంబంధిత కథనం