ప్రొటీన్ పౌడర్, నీటితో కలిపి చేసే చాక్లెట్ ప్రొటీన్ షేక్ దక్షిణాది శాఖాహార భోజనంలో చక్కని పోషకాలను అందిస్తుందని, పైగా ఎంతో తేలికగా ఉంటుందని మీకు తెలుసా? ఫిట్‌నెస్ కోచ్ రాజ్ గణపతి మాటల్లో చెప్పాలంటే, సరైన ప్రణాళికతో కూడిన దక్షిణాది శాఖాహార భోజనం చాలా ఆరోగ్యకరమైనది.
సౌత్ ఇండియన్ వంటకాల్లో ఫైబర్ ఎక్కువగా ఉండే పప్పుధాన్యాలు తరచుగా కనిపిస్తాయి. ఇవి తగిన మొత్తంలో ప్రొటీన్‌తో పాటు ఇతర పోషకాలను అందిస్తాయి. అంతేకాదు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరలు, కూరగాయలను విరివిగా వాడతారు. కొబ్బరి, గింజ ధాన్యాలు శరీరానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులను అందించి సంపూర్ణంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
దక్షిణాది శాఖాహార వంటకాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు సమతుల్యమైన, పోషకాలతో కూడిన భోజనాన్ని ఆస్వాదించవచ్చని రాజ్ వివరించారు. ప్రొటీన్ పౌడర్, నీటితో చేసిన చాక్లెట్ ప్రొటీన్ షేక్ శాఖాహార డైట్‌కి సులువుగా, పోషకాలను అందించే అదనపు ఎంపిక.
జూన్ 16న ఇన్‌స్టాగ్రామ్‌లో రాజ్ కొన్ని చిత్రాలను పంచుకున్నారు. అందులో ప్రొటీన్, కూరగాయలు, పిండి పదార్థాలు కలిసిన ఒక భోజనం చూపించారు. ఆ భోజనంలో చింతపండు, కొబ్బరితో చేసిన కూర, దొండకాయ కూర, పాలకూర, నెయ్యితో పప్పు అన్నం, చాక్లెట్ ప్రొటీన్ షేక్ ఉన్నాయి. ఈ వంటకాల్లో వాడిన పదార్థాలను, వాటి పోషక విలువలను రాజ్ వివరించారు.
దొండకాయ కూర (ఫ్రై): దొండకాయ, మసాలాలు, నూనె (80 కేలరీలు, 2 గ్రాముల ప్రొటీన్, 8 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 5 గ్రాముల ఫ్యాట్)
పాలకూర ఫ్రై: పాలకూర, కొబ్బరి, ఉల్లిపాయ, నూనె (70 కేలరీలు, 3 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 5 గ్రాముల ఫ్యాట్)
చింతపండు కొబ్బరి కూర: చింతపండు, కొబ్బరి, చిన్న ఉల్లిపాయలు, మసాలాలు, నూనె (150 కేలరీలు, 2 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 10 గ్రాముల కొవ్వు)
నెయ్యితో పప్పు అన్నం: తెల్ల అన్నం, పప్పులు, నెయ్యి (300 కేలరీలు, 6 గ్రాముల ప్రొటీన్, 45 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 10 గ్రాముల కొవ్వు)
చాక్లెట్ ప్రొటీన్ షేక్: ప్రొటీన్ పౌడర్, నీరు (125 కేలరీలు, 25 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు)
ఈ మొత్తం భోజనంలో సుమారు 700-750 కేలరీలు, 40 గ్రాముల ప్రొటీన్, 75 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 30 గ్రాముల కొవ్వు ఉంటాయని రాజ్ తెలిపారు. అంతకుముందు ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, "సాధారణ, శాఖాహార దక్షిణాది ఆహారం" తింటూ కూడా బరువు తగ్గడం ఎలా సాధ్యమో రాజ్ వివరించారు. మీ ఆహారంలో నాలుగు మార్పులు చేసుకుంటే ఇది సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
టాపిక్