Podi Idli: చప్పటి ఇడ్లీలను ఎన్ని రోజులు తింటారు? స్పైసీగా ఉండే స్పెషల్ వంటకం 'పొడి ఇడ్లీ' ట్రై చేసేయండి!
Podi Idli: మసాలా ఇడ్లీ, తవ్వా ఇడ్లీ తిని ఉంటారు. కానీ, మిగిలిపోయిన లేదా ఎక్కువ అయిన ఇడ్లీలతో చేసే పొడి ఇడ్లీలను ఎప్పుడైనా తిన్నారా.. స్పైసీగా ఉండి రుచితో లాలాజలాన్ని పరుగులు పెట్టించే ఈ ఇడ్లీ రెసిపీ గురించి తెలుసుకోండిలా..
స్పైసీగా ఉండే స్పెషల్ వంటకం 'పొడి ఇడ్లీ'
సౌత్ ఇండియన్ వంటకాల్లో చాలా అరుదైన ప్రత్యేకమైన వంటకం పొడి ఇడ్లీ. స్పైసీ పౌడర్ అయిన పప్పుల పొడితో దీనిని రెడీ చేసుకోవచ్చు. మిగిలిపోయిన ఇడ్లీలతో మస్తుగా అనిపించే రుచికరమైన వంటకాన్ని సిద్ధం చేసుకోవాలంటే ఈ రెసిపీ చూసేయండి. దీనిని మీరు బ్రేక్‌ఫాస్ట్‌గానే కాదు స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా..

పొడి ఇడ్లీ రెసిపీ
కావాల్సినవి:
- మిగిలిపోయిన ఇడ్లీల చిన్న చిన్న ముక్కలు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాల గింజలు - 1 టీ స్పూన్
- మినపపపు - 1 టీ స్పూన్
- కరివేపాకు - పది ఆకులు
- పప్పుల పొడి - 2 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర - అవసరమైనంత
తయారు చేసే విధానం:
- ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి
- స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వేడి అయ్యాక అందులో నూనె పోయాలి. ఆ తర్వాత ఆవాల గింజలు, మినపప్పు, కరివేపాకులు వేయాలి.
- ఆ తర్వాత అందులో ఇడ్లీ ముక్కలు వేసి జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి.
- ఇప్పుడు దానిపై పప్పుల పొడిని వేసి బాగా తిప్పాలి.
- ఐదు నిమిషాల పాటు పొడి ఇడ్లీలకు పట్టేంత సేపు వేయించుకుంటూ తిప్పుకుంటూ ఉండండి.
- చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.
వండే సమయంలో సూచనలు:
- పప్పుల పొడిని అప్పటికప్పుడు తయారు చేయాల్సిన అవసరం లేదు. ముందుగా రెడీ చేసుకుని గాలి ఆడకుండా ఒక కంటైనర్లో ఉంచుకుని మూత పెట్టుకోవాలి.
- పొడిలో మీకు కావాల్సినంత స్పైసీ నెస్ యాడ్ చేసుకుని ఉంచుకోండి.
సర్వ్ చేసుకోవడం:
- పొడి ఇడ్లీని వేడివేడిగానే సర్వ్ చేసుకోవాలి.
- మిగిలిన పొడి ఇడ్లీలను గాలి చొరబడని కంటైనర్లో పెట్టి 2 రోజుల పాటు ఫ్రిజ్‌లో దాచి పెట్టుకోవచ్చు.
- సర్వ్ చేసుకునే ముందు మరోసారి వేడి చేసుకోవచ్చు.
సంబంధిత కథనం