Sorakaya Rice: ఆరోగ్యాన్ని సొరకాయ రైస్, పిల్లలకు పెడితే ఎంతో ఆరోగ్యం
Sorakaya Rice: సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని పిల్లలకు చేసి పెడితే టేస్టీగా ఉంటుంది. దీని రెసిపీ చాలా సులువు. దీని వల్ల ఎన్నో పోషకాల శరీరానికి అందుతాయి.
సొరకాయ పేరు వింటేనే ఎంతో మంది తినేందుకు ఇష్టపడరు. ఇక పిల్లలైతే దూరంగా పారిపోతారు. సొరకాయను సాంబార్ లో వేసేందుకు మాత్రమే ఎంతో మంది ఉపయోగిస్తారు. నిజానికి సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించాలనుకుంటే సొరకాయ రైస్ ప్రయత్నించండి. ఇది చేయడం చాలా ఈజీ. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. కాబట్టి పిల్లల కోసం రుచికరమైన సొరకాయ అన్నం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
సొరకాయ రైస్ కావలసిన పదార్థాలు
సొరకాయ ముక్కలు - ఒకటిన్నర కప్పు
బియ్యం - ఒక కప్పు
పెరుగు - ఒక కప్పు
నెయ్యి - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
ఎండుమిర్చి - మూడు
వెల్లుల్లి - నాలుగు
ఉప్పు - రుచికి సరిపడా
సొరకాయ రైస్ రెసిపీ
- సొరకాయ తొక్కను తీసి చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నెయ్యి వేయాలి.
- నెయ్యి వేడెక్కాక జీలకర్ర వేసి వేయించాలి. అందులో సొరకాయ ముక్కలను కూడా వేసి వేయించాలి.
- పచ్చి మిర్చిని, కొత్తిమీర తరుగును కూడా వేసి వేయించాలి.
- పసుపు, గరం మసాలా, పెరుగు కూడా వేయించుకోవాలి.
- అందులోనే బియ్యం కడిగి వేసి ఆ మొత్తం మిశ్రమం ఉడకడానికి సరిపడా నీటిని వేయాలి.
- ఈ మొత్తం ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఇఫ్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అందులో వెల్లుల్లి తరుగు, ఆవాలు, కరివేపాకులు, ఎండు మిర్చి వేసి వేయించాలి.
- ఈ మొత్తం మిశ్రమాన్ని ఉడికిన అన్నంపై వేయాలి.
- అన్నం ముద్ద కాకుండా గరిటెతోనే పొడి పొడిగా వచ్చేలా కలుపుకోవాలి.
11. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి వండుకుని పిల్లలకు పెట్టి చూడండి ఎంతో నచ్చుతుంది.
ఇందులో మనం సొరకాయను అధికంగా వాడాము ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయ. సొరకాయను తినడం వల్ల హైపర్ టెన్షన్ అంటే బీపీ అదుపులో ఉంటుంది. శరీరం నుంచి టాక్సిన్లను బయటికి పంపుతుంది. బరువు తగ్గడం సులువుగా మారుతుంది. శ్వాసకోశ సమస్యలు దీని వల్ల దూరం అవుతాయి. శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది సొరకాయ.