Sorakaaya Curry: సొరకాయ అంటేనే తినడానికి నో చెప్తున్నారా.. ఈ టేస్టీ రెసిపీని ట్రై చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుందట!-sorakaya curry if you dont like bottle gourd try this tasty recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sorakaaya Curry: సొరకాయ అంటేనే తినడానికి నో చెప్తున్నారా.. ఈ టేస్టీ రెసిపీని ట్రై చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుందట!

Sorakaaya Curry: సొరకాయ అంటేనే తినడానికి నో చెప్తున్నారా.. ఈ టేస్టీ రెసిపీని ట్రై చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుందట!

Ramya Sri Marka HT Telugu
Jan 05, 2025 01:00 PM IST

Sorakaya Curry: సొరకాయ కూరను తినడానికి ఇబ్బంది పడకండి. టేస్టీ రెసిపీతో వండేందుకు ట్రై చేయండి. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ అందరూ వదలకుండా తింటారు. పుల్లగా, టేస్టీగా ఉండే సొరకాయ కూర రెసిపీని చూసేద్దామా!

సొరకాయ అంటేనే తినడానికి నో చెప్తున్నారా..
సొరకాయ అంటేనే తినడానికి నో చెప్తున్నారా.. (shutterstock)

సొరకాయ పేరు వింటేనే పిల్లల నుంచి పెద్దల దాకా నోటి నుంచి వచ్చే మాట “నో” మాకొద్దు అని. సొరకాయలో పోషక విలువలు ఉన్నప్పటికీ రుచికి అంతగా నచ్చకపోవచ్చు. కానీ, సొరకాయ వండే తీరును బట్టి దాని రుచి మారుతుంది. కూరను కాస్త కొత్తగా తయారుచేసి ఆహారాన్ని రుచికరంగా మార్చుకోవచ్చు. మధ్యాహ్న భోజనానికి కాస్త మసాలా జోడించిన సొరకాయ కూర తినడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరింకెందుకు లేటూ.. సొరకాయ కూర తయారుచేసే రెసిపీని తెలుసుకుందాం రండి.

yearly horoscope entry point

సొరకాయ కూర తయారీకి కావలసిన పదార్థాలు

  • ఒక సొరకాయ
  • రెండు కప్పుల పెరుగు
  • రుచికి తగినంత ఉప్పు
  • ఒక టీస్పూన్ పసుపు
  • ఉప్పు జీలకర్ర
  • ఆవాలు
  • కరివేపాకు
  • వెల్లుల్లి అల్లం
  • పేస్ట్
  • టొమాటో
  • పంచదార అర టీస్పూన్

సొరకాయ కూర రెసిపీ

  • ముందుగా సొరకాయ తొక్క తీసి కుక్కర్ లో ఉప్పు, పసుపు వేసి స్టవ్ మీద పెట్టండి.
  • సొరకాయ రెండు మూడు విజిల్స్ లో పూర్తిగా ఉడికిపోతుంది.
  • చల్లారిన తర్వాత అందులో 2 కప్పుల పెరుగు వేసి బాగా కలపాలి. బ్లెండర్ లేకపోతే జార్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు గిన్నెలో ఆవనూనె వేసి వేడి చేయాలి.
  • నూనె వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు వేయాలి.
  • 8 నుండి 10 కరివేపాకు ఆకులు వేసి వేయించాలి.
  • తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయండి.
  • ఇప్పుడు టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో కలపాలి.
  • టమోటాలను తక్కువ మంట మీద ఉడికించి పసుపు, ఎండుమిర్చి, ధనియాల పొడి వేయాలి.
  • టమాటోలు బాగా ఉడికిన తర్వాత మసాలా దినుసులన్నీ వేయించి నూనె పోసి కాగిన తర్వాత ఉడికించిన సొరకాయ, పెరుగు వేసి కలపాలి.
  • పేస్ట్ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి మరిగే వరకు ఉడికించాలి.
  • చివర్లో అర టీస్పూన్ పంచదార వేసి కూరలోని పులుపును సమతుల్యం అయ్యేలా చూసుకోవాలి.
  • టేస్టీ కర్రీ రెడీ, అన్నం లేదా రోటీతో సర్వ్ చేసి లంచ్ ఎంజాయ్ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం