Sony Bravia Google TV | రిమోట్ అవసరం లేదు, వోల్టేజ్ ఎక్కువైనా పర్లేదు.. -sony bravia 32w830k google tv launched in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Sony Bravia 32w830k Google Tv Launched In India

Sony Bravia Google TV | రిమోట్ అవసరం లేదు, వోల్టేజ్ ఎక్కువైనా పర్లేదు..

Sony Bravia 32W830K Google TV
Sony Bravia 32W830K Google TV

సోనీ కంపెనీ నుంచి 32 అంగుళాల గూగుల్ టీవీ- Sony Bravia 32W830K Google TV భారత మార్కెట్లోకి విడుదలయింది. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత మొదలగు వివరాలను తెలుసుకోండి.

సోనీ గ్రూప్ కంపెనీ సరికొత్త స్మార్ట్ టీవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. Sony Bravia 32W830K Google TV పేరుతో ఇది అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ స్క్రీన్ పరిమాణం 32-అంగుళాలు ఉంటుంది. దీని డిస్‌ప్లే ఫుల్ HD కాకపోయినా HD పిక్చర్ ను అందిస్తుంది. ఈ టీవీలో వినియోగదారులు- అందుబాటులో ఉన్న అన్ని OTT యాప్‌లలోని కంటెంట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఇన్-బిల్ట్ గా క్రోమ్‌కాస్ట్‌ ఇచ్చారు. అలాగే ఇందులోని ఇంటర్నల్ వాయిస్ అసెస్టెంట్ ఫీచర్ తో టీవీ వీక్షకులకు ప్రతిసారి రిమోట్ నొక్కాల్సిన పని ఉండదు. దూరం నుంచే ఛానెల్ ట్యూన్ చేయమని వాయిస్ కమాండ్ ఇస్తే సరిపోతుంది. “OK Google” అని చెప్పడం ద్వారా సినిమా లేదా పాటను ప్లే చేయవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ఇందులోని Sony TV X-Protection PRO సాంకేతికత టీవీని దుమ్ము, తేమ నుంచి రక్షిస్తుంది. అలాగే పవర్ వోల్టేజ్ ఎక్కువైనపుడు, మెరుపులు మెరిసినపుడు, పిడుగుపాటు కలిగే పరిస్థితుల్లోనూ టీవీకి ఎలాంటి హాని కలగదు.

ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు

  • 32-అంగుళాల HD రెడీ డిస్‌ప్లే
  • బ్రౌజింగ్ కోసం ఇన్ బిల్ట్ క్రోమ్ కాస్ట్
  • Apple హోమ్ కిట్, AirPlay సపోర్ట్
  • ఇంటర్నల్ హ్యాండ్స్-ఫ్రీ వాయిస్‌ అసిస్టెన్స్
  • 20W స్పీకర్‌లతో డాల్బీ ఆడియో
  • క్లియర్ ఫేజ్ ఫీచర్‌తో నాణ్యమైన పిక్చర్ క్లారిటీ

సోని బ్రేవియా 32W830K గూగుల్ TV ధర, రూ. 28,999/-

మే 11 నుంచి దేశంలోని అన్ని Sony సెంటర్‌లు, ప్రధాన ఎలక్ట్రానిక్ దుకాణాలు అలాగే ఇ-కామర్స్ పోర్టల్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్