Telugu Puzzles: మీకు చుట్టరికాల గురించి బాగా తెలుసా? ఈ మెలికల ప్రశ్నలకు జవాబులు చెప్పండి చూద్దాం-solve these telugu relationship puzzles questions ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Telugu Puzzles: మీకు చుట్టరికాల గురించి బాగా తెలుసా? ఈ మెలికల ప్రశ్నలకు జవాబులు చెప్పండి చూద్దాం

Telugu Puzzles: మీకు చుట్టరికాల గురించి బాగా తెలుసా? ఈ మెలికల ప్రశ్నలకు జవాబులు చెప్పండి చూద్దాం

Koutik Pranaya Sree HT Telugu
Aug 26, 2024 02:00 PM IST

Telugu Puzzles: చుట్టరికాలకు సంబంధించిన ప్రశ్నలు కొన్ని ఇక్కడ ఇచ్చాం. కాస్త మెలికలు పెడుతూ ఉంటాయి ఈ ప్రశ్నలు. వాటిని అర్థం చేసుకుని ఎవరికి ఎవరు ఏమవుతారో కనిపెడితే చాలు. వాటి సమాధానాలు వివరణతో సహా ఇచ్చేశాం.

తెలుగు పజిళ్లు
తెలుగు పజిళ్లు (freepik)

చుట్టరికాలు, బంధుత్వాలు మీకు బాగా తెలుసా? అంటే ఎవరికి ఏమవుతారో టకటకా చెప్పేస్తారా? అయితే ఈ చిక్కుముళ్ల లాగా ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఎవరికి ఎవరేమవుతారో చెప్పారంటే సంబంధాల పట్ల మీకు నిజంగా మంచి పట్టు ఉన్నట్లే. మీ మెదడుకు మంచి మేత ఈ ప్రశ్నలు. అవసరమైతే పెన్ను, పేపర్ కూడా వాడి సమాధానాలు రాబట్టండి చూద్దాం.

రక్తసంబంధాలకు సంబంధించిన ప్రశ్నలు:

1. “క్రికెట్ ఆడుతున్న ఆ అబ్బాయి మా నాన్నగారి భార్య కూతురి ఇద్దరు అన్నలలో చిన్నవాడు.” అని రాముతో చెప్పాడు రాజు.ఇంతకీ క్రికెట్ ఆడుతున్న అబ్బాయి రాజుకు ఏమవుతాడు?

జవాబు: సోదరుడు

(రాజు వాళ్ల నాన్న భార్య అంటే అతనికి అమ్మ. అమ్మకు కూతురంటే ఆయనకి సోదరి. ఆమెకు ఇద్దరు సోదరులు. ఒకరు రాజు. ఇంకొకరు రాజుకు సోదరుడు అవుతాడు)

2. రాజేష్ ఒక మహిళ వైపు చూపిస్తూ.."ఆమె మనుమరాలు నా సోదరుడికి ఏకైక కుమార్తె" అన్నాడు. రాజేష్‌కి ఆ మహిళ ఏమవుతుంది.

జవాబు: అమ్మ

(రాజేష్ తన సోదరుడి కుమార్తెను చూయిస్తూ ఆ మాట అన్నాడు. ఆమె రాజేష్ వాళ్లమ్మకే కదా మనుమరాలు)

3. ఒక కుటుంబంలో భార్య, భర్త, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ప్రతి కుమార్తెకు ఒక సోదరుడున్నాడు. ఆ కుటుంబంలో మొత్తం ఎంత మంది ఉన్నట్లు?

జవాబు: ఆరుగురు

(అంటే ఇద్దరు అమ్మనాన్నలు, వాళ్లకు ఒక కొడుకు, ముగ్గురు కూతుర్లు)

4. ఒకావిడ ఒక వ్యక్తి వైపు చూపిస్తూ.. “అతని తల్లి నా తల్లికి ఏకైక కుమార్తె”అని చెప్పింది. ఆమెకు ఆ వ్యక్తి ఏమవుతాడు.

జవాబు: కొడుకు

(అబ్బాయి వాళ్ల అమ్మమ్మకి ఒక్కతే కూతురు. ఆవిడే ఈ అబ్బాయికి తల్లి, ఆ అబ్బాయిని చూయించి చెప్పింది అతని తల్లే)

5. శివ ఒకాయనని చూపిస్తూ “ఆయన మా నాన్నగారి నాన్న కూతురికి భర్త”అన్నాడు. ఇంతకీ ఆయన శివకి ఏమవుతాడు?

జవాబు: మామయ్య

(శివ నాన్న వాళ్ల చెల్లెలు భర్త, శివకు మామయ్య అవుతాడు)

6. సుధ ఒక ఫోటో చూయిస్తూ అతను మా తాత గారి ఏకైక కొడుకుకి కొడుకు అని చెప్పింది. ఫోటోలో ఉన్న వ్యక్తి సుధకు ఏమవుతాడు.

జవాబు: సోదరుడు

7. ఒక కుటుంబంలో భార్య, భర్త. వాళ్లకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. ప్రతి కుమారుడికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. ప్రతి కుమార్తెకు ఇద్దరు ఒక కొడుకు, ఒక కూతురున్నారు. ఆ ఇంట్లో మొత్తం ఎంతమంది ఆడవాళ్లు ఉన్నట్లు?

జవాబు: 13

(భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కోడళ్లు, మొత్తం 7 గురు మనుమరాళ్లు)

8. ఒకామెని చూయిస్తూ రాజు “ఈమె మా మేనత్త గారి ఏకైక సోదరుడి ఏకైక కుమార్తెకు కుమార్తె” అన్నాడు. ఇంతకీ రాజు ఆమెకు ఏమవుతాడు.

జవాబు: మేనమామ

9. కీర్తి ఫోటోలో ఉన్న అబ్బాయిని చూయిస్తూ “మా తాతగారి ఒక్కగానొక్క కొడుక్కి కొడుకు” అంది. కీర్తికి ఆ అబ్బాయి ఏమవుతాడు.

జవాబు: సోదరుడు

(కీర్తి వాళ్ల నాన్న వాళ్లకు తాతకు ఒకే కొడుకు. వాళ్ల నాన్న వాళ్ల అబ్బాయంటే కీర్తికి సోదరుడు)

టాపిక్