Sobhita Saree: కంచి పట్టు చీరలో శోభిత ధూళిపాళ, శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి నేటి వరకు కాంచీపురం పట్టుదే హవా
Sobhita Saree: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లిలో... ప్రత్యేక ఆకర్షణగా నిలిచినది శోభితా కట్టిన కంచి పట్టు చీరే. దీని కోసం ఆమె కాంచీపురం వెళ్లి మరీ ఎంపిక చేసుకుంది. ఈ కంచి పట్టుచీర వెనుక చరిత్ర ఎంతో ఉంది.
చీర భారతీయతకు చిహ్నం. అందులో కంచిపట్టు చీరకు మరింత ప్రాముఖ్యత ఉంది. నాగచైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి ఫోటోల్లో అందరినీ ఆకర్షించినది శోభితా కట్టుకున్న కంచిపట్టు చీరే. ఈ చీర కోసం ఆమె తన బంధువులతో కలిసి కాంచీపురం వెళ్లి అక్కడ నుంచి కొనుగోలు చేసి తెచ్చుకుంది. స్వచ్ఛమైన, ప్రసిద్ధమైన పట్టుతో నేసిన చీర కావాలంటే కాంచీపురం వెళ్లాల్సిందే. అక్కడ తయారయ్యే కంచి పట్టు చీరలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి. దీనికి కొంతమంది కంచి పట్టుచీర అని పిలిస్తే, మరికొందరు కాంజీవరం చీర అంటారు. ఎలా పిలిచినా ఈ పట్టుచీర అందమే వేరు.
కంచిపట్టు చీర ప్రత్యేకత
పట్టుపురుగుల నుంచి తీసే సహజసిద్ధమైన పట్టు దారాలకు బంగారు జరీ కలిపి మగ్గంపై నేసే కంచి పట్టుచీరను చూస్తేనే కళ్ళు తిప్పలేము. కంచిలో తయారయ్యే పట్టు చీరలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఈ కంచి పట్టుచీరలు వెనుక శతాబ్దాల చరిత్ర కూడా ఉంది. పట్టు చీరలకు పుట్టిల్లుగా చెప్పుకునే కాంచీపురం ఎంతోమంది పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది.
తమిళనాడు రాజధాని చెన్నైకి 82 కిలోమీటర్లు దూరంలో ఉంది. కాంచీపురం అక్కడికి వెళ్తే చాలు... ప్రతి ఇంట్లోనూ పట్టుచీరలు ధగధగలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. నేతన్నలు పట్టు దారాలతో బంగారు జరీని కలిపి చీరలు నేస్తూ ఉంటారు. ఈ బంగారపు జరీని ప్రత్యేకంగా సూరత్ నుంచి తెప్పిస్తారు. కాంచీపురం నేతన్నల నేత కూడా ప్రత్యేకంగా ఉంటుంది. చీరను, పైటను, అంచులను విడివిడిగా నేసి చివరలో ఆ మూడింటిని కలిపి మళ్ళీ నేస్తారు. అందుకే కంచి పట్టు నేతన్నలు ఎంతో స్పెషల్.
ఆ నది నీళ్లతోనే...
ఈ కంచి పట్టుచీరలు చాలా తక్కువ బరువును కలిగి ఉంటాయి. అదే వీటి స్పెషాలిటీ. కంచి పట్టుచీరలో వాడే డిజైన్లు కూడా కనులకింపుగా ఉంటాయి. కాంచీపురానికి దగ్గరలోనే వేగావతి నది ఉంది. ఆ నది నుంచి తెచ్చిన నీళ్లతోనే రంగులను కలిపి అద్దుతారని అంటారు. అందుకే కంచి పట్టుచీరకు ఆ అందం వచ్చిందని కూడా చెప్పుకుంటారు.
కంచిపట్టు చీర చరిత్ర
కంచిపట్టు చీరలకు ప్రత్యేక పేరు వచ్చింది ఈ కాలంలోనే కాదు... కృష్ణదేవరాయల కాలంలోనే కాంచీపురం చీరలు ప్రఖ్యాతిగాంచాయి .అక్కడ ఈ చీరలు నేసేవారు రెండు కులాలుగా ఉండేవారు. వారిని దేవాంగలు, సాలెవాళ్లు అని పిలిచేవారు. ఈ రెండు కులాలకు చెందిన కుటుంబాలు వారు కంచి పట్టుచీరను నేయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అక్కడ ఇదే పనిని కొనసాగిస్తూ జీవిస్తున్నారు.
కంచి పట్టు చీర నేసే ఈ నేతకారులు మార్కాండ మహాముని సంతతికి చెందిన వారని అంటూ ఉంటారు. మార్కాండ మహాముని దేవతలకు వస్త్రాలను నేసి ఇచ్చేవారని చెబుతారు. మార్కండేయ మహాముని దేవతలకు వస్త్రాలను నేసేందుకు కమల పువ్వుల్లోని దారాలను సేకరించే వారిని చెబుతారు. ఈ వస్త్రాలు శివునికి, విష్ణువుకు ఎంతో ఇష్టమని అంటారు.
కంచి పట్టు చీరలకు ఇప్పటికే జియోగ్రాఫికల్ ఇండెక్స్ గుర్తింపు వచ్చింది. పేటెంట్ హక్కులు కూడా కాంచీపురానికే పూర్తిగా ఉన్నాయి. ఇవి గుర్తింపు వల్ల కంచి పట్టుచీరలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. కోటీశ్వరులు తమ పెళ్లిళ్లకు ప్రత్యేకంగా కాంచీపురం వచ్చి నిజమైన బంగారు దారాలతో కూడా చీరను నేయించుకుంటారు. కంచి పట్టుచీర ఎలా కట్టినా అందమే.
కంచి పట్టుచీరలు తొలిసారిగా నేయడం ఏడో శతాబ్దంలోని పల్లవ రాజవంశంలోనే మొదలైందని చెప్పుకుంటారు. అప్పటినుంచి అక్కడ పట్టుచీరలను నేస్తూనే ఉన్నారని అంటారు. ఈ కంచిపురం చీరల కోసం ప్రత్యేకంగా పట్టుపురుగులను పెంచే వ్యాపారం కూడా అక్కడ విస్తారంగా సాగుతోంది.త