Potato Bites Recipe: పొటాటో బైట్స్ ఎప్పుడైనా తిన్నారా? స్పైసీగా తినాలనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి, ఇదిగో రెసిపీ-snacks recipes have you ever eaten potato bites try this recipe when you want to eat spicy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Bites Recipe: పొటాటో బైట్స్ ఎప్పుడైనా తిన్నారా? స్పైసీగా తినాలనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి, ఇదిగో రెసిపీ

Potato Bites Recipe: పొటాటో బైట్స్ ఎప్పుడైనా తిన్నారా? స్పైసీగా తినాలనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి, ఇదిగో రెసిపీ

Ramya Sri Marka HT Telugu

Potato Bites Recipe: సాయంత్రం సరదాగా స్పైసీగా ఏదైనా తినాలనిపించినప్పుడు పొటాటో బైట్స్ ట్రై చేయండి. ఇవి చాలా సింపుల్‌గా, తక్కువ పదార్థాలతో తయారు అవుతాయి. రుచిలో కూడా భలే ఉంటాయి. ఈ పొటాటో బైట్స్‌ను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ ఉంది.

బంగాళదుంపలతో ట్రై చేసిన పొటాటో బైట్స్

సాయంత్రం అయిందంటే సరదాాగా, కాస్త స్పైసీగా ఏదైనా తినాలని కోరుకునే వారు చాలా మంది ఉంటారు. రోజూ కాకపోయినా అప్పుడప్పుడూ అయినా ఆ కోరికను తీర్చాలి కదా. మీ ఇంట్లో కూడా ఇలా సాయంత్రం కాగానే స్పైసీ ఫుడ్ కోసం ఎదురుచూసే వాళ్లు ఉంటే.. వారి కోరిక మేరకు రకరకాల స్నాక్స్ తయారు చేసి పెట్టడం మీకు ఇష్టమైతే ఈ రెసిపీ మీకు చాలా బాగా సహాయపడుతుంది. బంగాళదుంపలతో తయారు చేసే ఈ పొటాటో బైట్స్ మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతాయి. వీటిని చాాలా తక్కువ పదార్థాలతో ఎక్కువ కష్టపడకుండా తయారు చేసేయచ్చు. క్రిస్పీగా, క్రంచీగా కనిపించే ఈ పొటాటో బైట్స్ రుచిలో కూడా ఇవే చాలా బాగుంటాయి. కావాలంటే ఈ రెసిపీతో మీరే ట్రై చేసి చూడండి. ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా ఉంది.

పొటాటో బైట్స్ తయారు చేయడానికి కావలసినవి

  • మూడు నుంచి నాలుగు మీడియం సైజు ఉడికించిన బంగాళాదుంపలు
  • ఒక కప్పు సాబుదానా(సగ్గు బియ్యం)
  • ముప్పావు కప్పు శనగలు
  • రుచికి సరిపడా ఉప్పు
  • కరివేపాకు
  • రెండు లేదా మూడు పచ్చిమిర్చి
  • కొత్తిమీర
  • డీప్ ఫ్రైకి సరిపడా నూనె

పొటాటో బైట్స్ ఎలా తయారు చేయాలి

  1. పొటాటో బైట్స్ తయారు చేయడానికి ముందుగా 3 లేదా 4 బంగాళాదుంపలను బాగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించాలి.
  2. 3 విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారే వరకూ వదిలేయండి.
  3. కుక్కర్ చల్లారిన తర్వాత చూసి బంగాళాదుంపలు ఉడికితే వాటిని నీటి నుండి తీసి, చల్లారనివ్వండి.
  4. ఈలోపు సాబుదానా(సగ్గు బియ్యం), శనగలను వేరువేరుగా వేయించి, రెండింటినీ వేరువేరుగా మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకోండి.
  5. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీరను చిన్నగా తరిగి పెట్టుకోండి.
  6. ఇప్పుడు చల్లారిన బంగాళాదుంపలను పొట్టు తీసి చేత్తో లేదా స్మాషర్ సహాయంతో మెత్తటి పేస్టులా తయారు చేసుకోండి.
  7. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో మెత్తగా చేసుకున్న బంగాళదుంపలను వేయండి.
  8. తర్వాత దీంట్లో సాబుదానా పొడి, శనగల పొడిని వేసి కలపండి.
  9. మూడు బాగా కలిసిపోయిన తర్వాత అందులో మీ రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలపండి.
  10. అన్నీ బాగా కలిసిపోయి పిండి మెత్తగా మారేంత వరకూ కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టండి.
  11. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయండి.
  12. నూనె వేడెక్కే లోపు ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా తీసుకుంటూ పొటాటో బైట్స్ తయారు చేసుకోండి.
  13. నూనె బాగా వేడెక్కిన తర్వాత పొటాటో బైట్స్ ను నూనె వేసి వేయించండి.
  14. స్టవ్‌ను మీడియం నుంచి హై ఫ్లేంలోకి మార్చుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ వేయించండి.
  15. రెండు వైపులా బంగారు రంగులోకి మారిన తర్వాత నూనెలో నుంచి తీసి బౌల్ లో టిష్యూ పేపర్ మీద వేసేయండి.

అంతే క్రిస్పీ అండ్ స్పైసీ పొటాటో బైట్స్ రెడీ అయినట్టే. వీటిని టామాటో సాస్, కెచప్ లేదా పెరుగులో నంచుకుని తిన్నారంటే అదిరిపోతుంది. మీకు కావాలంటే సాయంత్రం మీరు తాగే ఛాయ్ తో పాటు కూడా వీటిని ఆస్వాదించవచ్చు.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం