Mobile Side effects: నిద్రపోతున్నప్పుడు మొబైల్ తలగడ పక్కనే పెట్టుకొని నిద్రపోతున్నారా? మీలో ఈ మార్పులు వచ్చే అవకాశం
Mobile Side effects: జీవితంలో ఇప్పుడు మొబైల్ చాలా ముఖ్యమైనది అయిపోయింది. అయితే రాత్రి నిద్ర పోయేటప్పుడు మొబైల్‌ను తలగడ పక్కనే పెట్టుకుంటే ఎన్నో సమస్యలు రావచ్చు.
Mobile Side effects: ఎంతోమందికి చేతిలో మొబైల్ లేకపోతే ఏమీ తోచదు. రాత్రి పడుకునే ముందు కూడా తమ తలగడ పక్కనే దాన్ని పెట్టుకుంటారు. మెలకువ వచ్చినప్పుడల్లా ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఇలా తలగడ పక్కనే పెట్టుకొని మొబైల్‌ను పెట్టుకొని నిద్రపోవడం వల్ల మీకు తెలియకుండానే మీలో ఎన్నో సమస్యలు మొదలైపోతాయి. సెల్ ఫోన్ వాడడం వల్లనే మానసిక సమస్యలు, ఎన్నో శారీరక సమస్యలు వస్తున్నాయి. ఇలా మొబైల్ పక్కన పెట్టుకొని పడుకోవడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు పడతాయో వైద్యులు వివరిస్తున్నారు.
మొబైల్‌తో సమస్యలు
రాత్రిపూట ఫోను చూడకూడదు. మొబైల్ నుంచి వచ్చే నీలి కాంతి నిద్ర రాకుండా అడ్డుకుంటుంది. అలాగే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. మొబైల్ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ... రేడియేషన్ విడుదల చేస్తూ ఉంటుంది. ఆ రేడియేషన్ క్యాన్సర్ కారకమని ప్రపంచానికి ఆరోగ్య సంస్థ కూడా చెబుతోంది. కాబట్టి మీకు దగ్గరలో ఫోను పెట్టుకోకండి. ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు తలకు దగ్గరలో ఫోన్ ఉంచకండి.
నిత్యం మొబైల్ ను తల పక్కనే పెట్టుకోవడం వల్ల నిద్రా నాణ్యత తగ్గిపోతుంది. మీలో మీరే పరధ్యానంగా మారతారు. ఇతరుల విషయాలు, సాధారణ విషయాలు కూడా సరిగా అర్థం కావు.
మొబైల్ పేలుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇలా మొబైల్ ను తల పక్కనే పెట్టుకోవడం వల్ల అది పేలితే పెద్ద ప్రమాదమే జరుగుతుంది. కాబట్టి వీలైనంతవరకు రాత్రిపూట మొబైల్ ను దూరంగా పెట్టుకోవాలి.
మొబైల్ వల్ల కళ్ళ సమస్యలు చాలా వస్తున్నాయి. దృష్టి మసకబారతుంది. సెల్ ఫోన్ నుంచి వచ్చే లైటింగ్ వల్ల కంటి చూపు దెబ్బతింటుంది. సరిగా నిద్ర పట్టక కంటి వెనక నరాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. మెడ నొప్పులు రావడం, నడుము నొప్పులు రావడం వంటివి జరుగుతున్నాయి. కాబట్టి వీలైనంతవరకు మొబైల్ ను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రాత్రిపూట పూర్తిగా మొబైల్‌ను దూరంగా పెట్టడమే ఉత్తమం.