Sleeping With Pillow Tips । దిండు సరిగ్గా లేకపోతే వెన్ను బెండవుతుంది, ఈ చిట్కాలు పాటించండి!-sleeping with pillow may cause you neck and back pains follow these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sleeping With Pillow May Cause You Neck And Back Pains , Follow These Tips

Sleeping With Pillow Tips । దిండు సరిగ్గా లేకపోతే వెన్ను బెండవుతుంది, ఈ చిట్కాలు పాటించండి!

HT Telugu Desk HT Telugu
Nov 01, 2022 10:07 PM IST

Sleeping With Pillow Tips: కొందరికి పడుకోటానికి మంచం లేకపోయినా గానీ, తలకింద దిండు లేకపోతే మాత్రం అస్సలు నిద్రపోలేరు. కానీ ఈ దిండు సరిగ్గా లేకపోతే సమస్యలు ఉన్నాయి, అందుకు పరిష్కార మార్గాలు ఇక్కడ చూడండి.

Sleeping With Pillow Tips:
Sleeping With Pillow Tips: (Unsplash)

మనిషి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. సాధారణంగా మనం మంచి నిద్ర గురించి ఆలోచించినప్పుడు, మెత్తని మంచం, వెచ్చని దుప్పటితో పాటు తలకింద దిండు లేదా తలగడను కూడా కోరుకుంటాము. అయితే ఆ తలగడ (Sleeping With Pillow) తోనే తలనొప్పులు మొదలవుతాయి. వివిధ రకాల నొప్పులకు ఈ దిండే ప్రధాన ముద్దాయి. దిండు సరిగ్గా ఉపయోగించకపోయినా, లేదా మీ దిండు సరిగ్గా లేకుంటే నిద్రలేమి మాత్రమే కాకుండా మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు కూడా కలుగుతాయి.

ఇప్పుడు మనలో చాలామంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. దానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా సరిగ్గా నిద్రపోవడం లేదు. ఇందుకు మీరు ఉపయోగించే దిండు కూడా ఒక కారణం. సరైన దిశలో తల పెట్టనపుడు మధ్యలోనే మెలకువ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం దిండు ఉపయోగించి పడుకున్నపుడు మన భంగిమ కొద్దిగా ఏటవాలు కోణంలో వంగి ఉంటుంది. ఫలితంగా ఇది మన వెన్నెముక నరంపై ప్రభావం కలిగించి, వెన్నునొప్పికి దారితీస్తుంది. ఇలాగే కొనసాగితే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

మనం నిద్రపోతున్నప్పుడు మన మెడ మంచానికి సమాంతరంగా ఉండాలి. మీరు తల కింద ఒక దిండు ఉంచినట్లయితే, మెడ ఎత్తులో లేదా లోతులో ఉంటుంది. దీని వల్ల మెడ నొప్పి, వెన్నునొప్పి వస్తుంది. ఇది స్పాండిలైటిస్ (Spondylitis) అనే దీర్ఘకాలిక సమస్యకు దారితీస్తుంది. దీనికి శాశ్వత పరిష్కారం లేదు.

మంచి నిద్ర పొందాలంటే నిద్రించే విధానం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకు సరైన దిండు ఎంచుకోవాలి. ఎలాంటి దిండు ప్రయోజనకరమో కొన్ని చిట్కాలు చూడండి.

Right Pillow Selection- ఎలాంటి దిండు ఉంటే ప్రయోజనకరం

  • మెడ లేదా వెన్నునొప్పి, గర్భాశయ నొప్పితో బాధపడేవారు వారి అవసరాలకు అనుగుణంగా దిండ్లు కొనుగోలు చేయాలి. వారికోసం ప్రత్యేకమైన దిండ్లు ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
  • సహజ రబ్బరుతో చేసిన ఫోమ్ దిండ్లను కొనుగోలు చేయడం మంచిది. ఇది మన మెడ, శరీరాన్ని సమాంతరంగా ఉంచుతుంది.
  • ఈకలతో చేసిన దిండ్లు చాలా అందంగా కనిపిస్తాయి. కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. కేవలం అలంకరణ కోసం మాత్రమే పనికివస్తాయి. ఇలాంటివి నిద్రకు సరిపోవు, నొప్పిని కలిగిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు వాటిని ఉపయోగించకపోవడమే మంచిది.
  • మీ తల కింద మాత్రమే కాకుండా మీ వీపు అలాగే మీ కాళ్ళ క్రింద కూడా దిండ్లు ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
  • ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా దిండ్లు మార్చడం మంచిది. ఎంత శుభ్రం చేసినా కాటన్‌లో ఎక్కడో కొద్దిపాటి బ్యాక్టీరియా దాగి ఉంటుంది. ఇది వాడినాకొద్దీ పెరుగుతుంది. అలర్జీ, ఆస్తమా సమస్యలను కలిగిస్తుంది.

కాబట్టి దిండు లేకుండా నిద్రించడం నేర్చుకోవాలి లేదా సరైన దిండును ఎంచుకోవాలి. శుభరాత్రి!

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్