Sleeping Tips : నిద్రపోతున్నప్పుడు కాళ్లు దుప్పటిలో పెడుతున్నారా? నో.. నో.. వద్దు
Sleeping Tips : ఒళ్లంతా దుప్పటి కప్పుకొని పడుకోవడం చాలా మందికి అలవాటు. కనీసం కాలి వేలు కూడా బయటకు పోనివ్వరు. చలికాలంలో ఇలాచేస్తేనే హాయిగా నిద్రపడుతుంది అనుకుంటారు. కానీ అలా పడుకోవడం మంచిది కాదు.
నిద్రపోతున్నప్పుడు మీ కాళ్లతో సహా మీ శరీరమంతా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా? లేదా రెండు కాళ్లను దుప్పటి నుండి బయట పెట్టి నిద్రిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు కొందరు వేస్తారు. ఎలా పడుకుంటే మంచిదని అడుగుతారు. ఒళ్లంతా దుప్పటి కప్పుకుని పడుకోవడం ఆహ్లాదకరంగా, వెచ్చటి అనుభూతిని కలిగిస్తుంది.
కానీ కొంతమందికి దుప్పటి నుండి ఒక కాలు బయటపెట్టి పడుకునే అలవాటు ఉంటుంది. దుప్పటి మొత్తం కప్పుకుని పడుకోవడం కంటే కాళ్లకు దుప్పటి పెట్టుకోకుండా ఉండే అలవాటు చాలా మంచిది. కాళ్లకు దుప్పటి కప్పుకుని పడుకునే అలవాటు ఆరోగ్యం దృష్ట్యా మంచిది కాదు. దుప్పటి లేదా శరీరమంతా కప్పి పడుకునే అలవాటు ఉంటే వదిలేయండి. ఇలా పడుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుందని అనుకుంటాం. కానీ అలా పడుకోవడం వల్ల తక్కువ నిద్ర వస్తుంది.
దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది. దీనిని శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. పాదాలను దుప్పటితో కప్పుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. దీనివల్ల మనం చాలా అప్రమత్తంగా ఉంటాం. అదే పాదాలకు దుప్పటి వేయకపోతే పాదాలు చాలా త్వరగా చల్లబడతాయి, ఇది మనకు చాలా మంచి నిద్రను ఇస్తుంది.
నిద్ర, ఉష్ణోగ్రత మధ్య సంబంధం ఉంది. దుప్పటి వెలుపల మీ కాళ్లు పెట్టి పడుకోవడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత త్వరగా తగ్గుతుంది. కాబట్టి మీరు బాగా నిద్రపోతారు. నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటే, మీరు బాగా నిద్రపోవడానికి ఈ చిట్కాను ప్రయత్నించండి. దుప్పటిలోంచి కాళ్లు బయటపెట్టి పడుకుంటే జలుబు చేస్తుందని అనుకుంటే పొరపాటే. ఇలా పడుకోవడం వల్ల జలుబు రాదు, నిద్ర మాత్రం చాలా బాగుంటుంది. అతి చలిలో కూడా ఇలా పడుకుంటే చలి రాదు, బాగా నిద్ర పడుతుంది.
ఇక మరో విషయం ఏంటంటే.. నిద్రపోతున్నప్పుడు సాక్స్ వేసుకోకండి. కొందరికి పడుకునేటప్పుడు సాక్స్ వేసుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు కూడా మంచిది కాదు. సాక్స్ వేసుకోవడం వల్ల వెచ్చగా ఉంటారు కాబట్టి అలర్ట్ గా ఉంటారు. బిగుతుగా ఉండే సాక్స్ వేసుకుంటే.. సరైన నిద్రపట్టదు.
మంచి నిద్ర కోసం ఏం చేయాలంటే..
పడుకునే అరగంట ముందు మొబైల్ ఫోన్ వైపు చూడకండి. దీన్ని ఆచరించడం వల్ల నిద్ర పడుతుంది. వీలైతే, మీ మొబైల్‌ని బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లకండి. కొంతమందికి పడుకునే ముందు కూడా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అలా కాఫీ తాగడం వల్ల నిద్ర తగ్గుతుంది. కాబట్టి కెఫిన్‌తో కూడినది తీసుకోవద్దు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి. చాలా ఆలస్యంగా నిద్రపోవడం మంచిది కాదు. వీలైనంత వరకు రాత్రి 9-10 గంటలలోపు పడుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది.