కొన్ని సంస్కృతులలో మంచం మీద కాకుండా నేలపై పడుకోవడం సర్వసాధారణం. నేల మీద పడుకుంటే.. చాలా రకాలుగా హెల్తీగా ఉంటారని నమ్ముతారు. నేలపై పడుకోవడం(Sleeping On The Floor) వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని చాలా మంది వాదిస్తున్నారు. అయితే అలా చేయడం వల్ల ఉపయోగం ఉంటుందని చాలా తక్కువ పరిశోధనలు సూచిస్తున్నాయి. ఫ్లోర్ స్లీపింగ్(Floor Sleeping) కోసం వాదించే వారు ఇది వెన్నునొప్పి(Back Pain)ని తగ్గించి, మరింత ప్రశాంతమైన రాత్రి నిద్రకు దారితీస్తుందని పేర్కొన్నారు. కైఫోసిస్ వంటి వెన్నెముక రుగ్మతలు నేలపై పడుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.,ఇంట్లోని ఇతర ఉపరితలాల కంటే ఫ్లోర్‌ల మీజ తరచుగా ఎక్కువ దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. ప్రత్యేకించి మీరు కార్పెట్‌లను కలిగి ఉంటే, తుమ్ములు, ముక్కు కారటం, దురద, కళ్ళు ఎర్రబడటం, గురక, దగ్గు వంటి అలర్జీ(Allergy)లు వస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం, నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుంది. మరోవైపు, హార్డ్ ఉపరితలం దాని సహజ వక్రతను నిర్వహించడానికి వెన్నెముకకు కష్టతరం చేస్తుంది.,వేసవి(Summer)లో చల్లని నేలపై పడుకోవడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. కానీ శీతాకాలంలో చల్లని నేల మీద పడుకుంటే.. మీ శరీరంలోని వేడిని వేగంగా తగ్గిస్తుంది. దీని వలన మీరు సాధారణంగా ఉండే దానికంటే చల్లగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో నేలపై పడుకోవడం అనేది ఒక వ్యక్తికి సురక్షితంగా ఉండకపోవచ్చు.,గర్భధారణ సమయంలో నేలపై పడుకోవడం సాధారణంగా సురక్షితంగా పరిగణించబడుతుంది. చాలా మంది గర్భిణీ స్త్రీలు నేలపై పడుకున్నప్పుడు చాలా సుఖంగా ఉంటారు. అయితే, గర్భవతి(Pregnant)గా ఉన్నప్పుడు నేలపై పడుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం,అలెర్జీతో బాధపడేవారు.. నేల మీద పటుకుంటే.. దురద, తమ్ములు, దగ్గు, ముక్కు కారడం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. నేలపై ఉపయోగించే దుప్పట్లు, పరుపులలో నల్లులు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఈ ప్రమాదం తగ్గించేందుకు.. కాస్త మందపాటి చాపలను వాడితే మంచిది. నేలపై చాప వేసుకుని పడుకుంటే గాలి సరిగా అందకపోవడం వల్ల చెమట పట్టి అది వాసన వచ్చేలా కూడా అవుతుంది. రక్తహీనత, డయాబెటిస్ వంటి రక్త ప్రసరణను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యలు(Health Problems) ఉన్నవారు.., నేలపై పడుకుంటే సమస్యలు ఎదురవుతాయి .,నేల మీద పడుకుంటే.. బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రెడీమేడ్ గా దొరికే.. పరుపుల మీద పడుకుంటే.. శరీరం దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ కావాలి. అదే నేల మీద పడుకుంటే.. శరీరమంతా.. చాలా విశ్రాంతి పొందినట్టుగా ఉంటుంది. ఒత్తిడి(Stress) కూడా పోతుంది. నేల మీద దిండు లేకుండా.. వెల్లకిలా నిద్రపోతే.. తల, మెడ, వెన్నెముక, హిప్స్, శరీరం మెుత్తానికి ఉపశమనం ఉంటుంది.