Slap Day 2025: ప్రేమ పేరుతో మోసం చేశారా? చెంప మీద ఒక్కటి పీకండి, స్లాప్ డేను ఇలా సెలబ్రేట్ చేసుకోండి!-slap day 2025 have you cheated in the name of love slap one on the cheek and complete the slap day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Slap Day 2025: ప్రేమ పేరుతో మోసం చేశారా? చెంప మీద ఒక్కటి పీకండి, స్లాప్ డేను ఇలా సెలబ్రేట్ చేసుకోండి!

Slap Day 2025: ప్రేమ పేరుతో మోసం చేశారా? చెంప మీద ఒక్కటి పీకండి, స్లాప్ డేను ఇలా సెలబ్రేట్ చేసుకోండి!

Ramya Sri Marka HT Telugu
Published Feb 15, 2025 07:30 AM IST

Slap Day 2025: ప్రేమికుల వారమైపోయింది, ప్రేమ వ్యతిరేకుల వారం ప్రారంభమైంది. దీనినే యాంటీ వాలెంటైన్స్ వీక్ అంటారు. ఈ వీక్ స్లాప్ డేతో మొదలవుతుంది. స్లాప్ డే ఎలా జరుపుకుంటారో, ఆ రోజు ఏం చేస్తారో తెలుసుకుందాం.

 ప్రేమ పేరుతో మోసం చేశారా.. చెంప మీద ఒక్కటి పీకండి, స్లాప్ డేను పూర్తి చేసేయండి!
ప్రేమ పేరుతో మోసం చేశారా.. చెంప మీద ఒక్కటి పీకండి, స్లాప్ డేను పూర్తి చేసేయండి!

ప్రేమను రకరకాల పద్ధతిలో వ్యక్తపరచడానికి, ప్రేమను గెలవడానికి జరుపుకునే వాలెంటైన్ వీక్ అందరికీ తెలుసు. కానీ, ప్రేమ వ్యతిరేకులు జరుపుకునే యాంటీ వాలంటైన్ వీక్ గురించి మీకు తెలుసా? యువతకు వాలెంటైన్ వీక్ ఎంత ముఖ్యమో.. యాంటీ వాలెంటైన్ వీక్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రేమలో గెలవాలనేం లేదు కదా. అలా ప్రేమలో ఓడిపోయిన వారు జరుపుకునేదే ఈ యాంటీ వాలెంటైన్ వీక్.

యాంటీ వాలెంటైన్ వీక్ అంటే ఏంటి?

ఫిబ్రవరి 14న జరిగే వాలెంటైన్ డే తర్వాత ఫిబ్రవరి 15 నుంచి యాంటీ వాలెంటైన్ వీక్ మొదలవుతుంది. స్లాప్ డే, కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెష్షన్ డే, మిస్సింగ్ డే అంటూ వారం రోజుల పాటు అంటే ఫిబ్రవరి 21వ తేదీ వరకూ దీనిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రేమలో మోసపోయిన వారు, ప్రేమ బంధంలో ఇబ్బంది పడుతున్న వారు, రిలేషన్‌షిప్ మీద నమ్మకం కోల్పోయిన వారు జరుపుకునేదే ఈ యాంటీ వాలెంటైన్ వీక్. ఈ వారంలో మొదటి రోజును స్లాప్ డే గా జరుపుకుంటారు. స్లాప్ డే రోజున ఏం చేయాలి? దీని ప్రత్యేకత ఏంటి వంటి విషయాలు తెలుసుకుందాం రండి.

స్లాప్ డే ముఖ్య ఉద్దేశ్యం..

ప్రేమలో మోసపోయిన వారు తమ మాజీ ప్రియులను చెంప మీద కొట్టి తమ కోపాన్ని తీర్చుకోవడం. ఒక్క దెబ్బతో మనసులోని బాధని, కోపాన్ని, ద్వేషాన్ని తీర్చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టడమే స్లాప్ డే ముఖ్యమైన ఉద్దేశ్యం. పాతవి, బాధాకరమైన తమ భావాలను, చెడు మెమొరీలను ఈ చెంప దెబ్బ ద్వారా తుడిచేయడం. తిరిగి సాధారణంగా తమ జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టడం ఈ స్లాప్ డే ఉద్దేశం.ఇలా చేయడం వల్ల ప్రేమలో మోసపోయిన వారు తమ మనసులోని భారాన్ని దించేసుకుని స్వాతంత్రంగా, స్వేచ్ఛగా, మానసికంగా ప్రశాంతంగా జీవించగలుగుతారని నమ్ముతారు.

స్లాప్ డే ను ఎలా జరుపుకోవాలి?

ఇలా చెంప దెబ్బ కొట్టడం అంటే మోసం చేసిన వారిని తమ మాజీ ప్రియుల దగ్గరకు వెళ్లి నిజంగానే చెప్ప దెబ్బ కొట్టడం మాత్రమే కాదు. ఇలా చేయడం అందరికీ వీలు కాదు. నేరుగా చెంప మీద కొట్టడం కాదు. వారి విషయంలో మీకున్న ప్రేమ, కోపం, ద్వేషం వంటి భావాలపై చెంప పెట్టు వేయడం. ప్రాణంగా ప్రేమించిన మనల్ని, ఊహించని రీతిలో మోసం చేసినప్పుడు వారిని మనసారా తిట్టాలని, పగ తీరేంత వరకూ కొట్టాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. కానీ, అలా చేయడం అందరికీ వీలు కాదు. సరైనది కూడా కాదు. అలాంటి లవ్ ఫెయిల్యూర్స్ తమ మససులోని భావాలను తుడిచివేయడం, కొత్తగా తమతో తాము తిరిగి ప్రేమలో పడటం కోసమే స్లాప్ డే జరుపుకుంటారు. అదేదో సినిమాలో చెప్పినట్లు, "మనల్ని కాదనుకున్న వాళ్లకు మనం విధించే శిక్ష ఎలా ఉండాలంటే, వాళ్లు అనుకున్న దాని కన్నా బెటర్ గా బతికి చూపించడమే" మీలో ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ ఉంటే ఈ విషయం మర్చిపోకండి. స్లాప్ డేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం