Skincare Tips: యవ్వనంగా కనిపించడం కోసం సీరం వాడుతున్నారా ? రెటినాల్ Vs విటమిన్ సీలలో మీకు ఏది సరిపోతుంది చెక్ చేసుకోండి?
Skincare Tips: చర్మ సంరక్షణ కోసం సీరం వాడాలనుకుంటున్నారా? రెటినాల్ 0.0సీరం వాడాలా? విటమిన్ సీ సీరం వాడాలా అనే సందిగ్ధంలో ఉంటే, ఇది మీ కోసే. నిపుణుల అభిప్రాయాలను సేకరించి ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీకు ఏది సరిపోతుందో మీరే ఎంచుకోండి.

అందం గురించి బ్యూటీ ఇండస్ట్రీలో తయారవుతున్న ఉత్పత్తులు కోకొల్లలు. చర్మం, అందం పరిరక్షణ కోసం లేటెస్ట్‌గా చాలా మంది నుంచి వినిపిస్తున్న టెక్నిక్ సీరం వాడకం. సీరం వాడి చర్మాన్ని రిపేర్ చేసుకోవడమే కాదు, యవ్వనవంతంగా కూడా మార్చుకోవచ్చట. ఇందులో మరో అనుమానం ఉంది. రెటినాల్ Vs విటమిన్ సీ సీరంలలో ఏది వాడితే బెటర్ అని? మీరు అదే సందేహంలో ఉంటే, ఇది మీ కోసమే.
1. రెటినాల్ సీరమ్:
రెటినాల్ సీరంలో విటమిన్ ఏ ఉండి చర్మానికి అందం తెప్పించడంలో సహాయపడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మంపై కలిగే ముడతలు, హైపర్ పిగ్మంటేషన్, మొటిమలు, మచ్చలు, గీతలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. మృత కణాలను తొలగించి, ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది.
రెటినాల్ సీరమ్ ప్రయోజనాలు:
గీతలు, ముడతలు తగ్గించే రెటినాల్ తగ్గిస్తుంది: రెటినాల్ సీరం యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా వృద్ధాప్య లక్షణాలకు దూరం చేస్తుంది.
మచ్చలు నివారణ:
చర్మపు గ్రంథుల్లోకి చొచ్చుకుని పోయి, మృత కణాలను తొలగించడంతో పాటు మెరుగైన స్కిన్ పెరిగేందుకు తోడ్పడుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు ఉండి ఎర్రమచ్చలు, మొటిమలు రాకుండా కాపాడుతుంది.
డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది:
ఇది హైపర్ పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. బ్లూ స్పాట్‌లు, సన్ డ్యామేజ్, లేదా మధుమేహం వంటి కారకాల వల్ల కలిగే దుష్ప్రభావాన్ని తగ్గిస్తుంది.
లోపాలు:
సున్నితమైన చర్మం ఉన్నవారికి చర్మం పొడిగా మారడం, ఎర్రగా లేదా పగిలినట్లుగా మారి ఇబ్బంది కలిగించవచ్చు.
సూర్యరశ్మి సున్నితత్వం: రెటినాల్ చర్మాన్ని UV కిరణాలు నుంచి కాపాడలేదు. కాబట్టి ఇది రాత్రిపూట మాత్రమే ఉపయోగించాలి.
2. విటమిన్ C సీరమ్:
విటమిన్ C, ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, చర్మాన్ని పర్యావరణంలో మార్పులైన కాలుష్యం, UV కిరణాల నుంచి రక్షించేందుకు ఉపయోగించుకోవచ్చు. చర్మానికి సాగే గుణం అందించడంలో సహాయపడుతుంది. హైపర్ పిగ్మంటేషన్ తగ్గించి షైనింగ్‌తో పాటు, చర్మ రంగును సమానంగా చేస్తుంది.
విటమిన్ C సీరమ్ ప్రయోజనాలు:
యాంటీఆక్సిడెంట్ రక్షణ:
విటమిన్ C, ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రలైజ్ చేసి చర్మం నుండి వృద్ధాప్య లక్షణాలు నివారించడంలో సహాయపడుతుంది.
కొలాజెన్ ఉత్పత్తి:
విటమిన్ C చర్మ నిర్మాణం కోసం అవసరమైన కొలాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది.
సమానమైన చర్మ రంగు:
ఇది మెలనిన్ ఉత్పత్తిని నిరోధించి, చర్మ రంగు సమానీకరించడంలో సహాయపడుతుంది.
లోపాలు:
స్థిరత్వం సమస్యలు: విటమిన్ C సీరమ్ అనేది వెలుతురు లేదా గాలి సోకడం వల్ల కూడా చెడిపోతుంది. అందుకే దీన్ని జాగ్రత్తగా నిల్వ చేయడం ముఖ్యం.
తీవ్రత: కొన్ని రకాల సున్నితమైన చర్మాలకు దీని స్వభావం కారణంగా దుష్ఫలితాలు కలుగుతాయి.
మీ చర్మానికి రెటినాల్ సీరమ్ Vs విటమిన్ C సీరమ్‌లలో ఏది ఉత్తమం?
- రెటినాల్ యాంటీ-ఏజింగ్ లక్షణాలను రాకుండా ఉండాలని ప్రయత్నించే వారికి, మొటిమలు లేదా హైపర్‌పిగ్మెంటేషన్ సమస్యల పరిష్కారం కోసం వెదికే వారికి అనుకూలం.
- విటమిన్ C సీరమ్ చర్మాన్ని రక్షించడానికి, మృదువుగా మార్చుకోవాలనుకునే వారికి, చర్మపు రంగు అన్ని భాగాలలో సమానం చేసుకోవడానికి అనుకూలం.
- కొన్ని సందర్భాల్లో రెండు సీరమ్ లు ఉపయోగించిన వారిలో ఉత్తమ ఫలితాలు కనిపించాయట. విటమిన్ C సీరమ్ పగటి సంరక్షణ కోసం ఉపయోగిస్తే, రెటినాల్ సీరమ్ ను రాత్రి వేళలో వాడుకోవాలి. ఇవి వాడే ముందు ఒకసారి వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.
సంబంధిత కథనం