Mehendi Designs: శ్రావణమాసంలో చేతికి సింపుల్ మెహెందీ డిజైన్లు, వీటిని వేయడం చాలా సులువు
Mehendi Designs: శ్రావణమాసంలో పూజలు, వ్రతాలు ఎక్కువ. మహిళలు మెహెందీ పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ కొన్ని మెహెందీ డిజైన్లు ఇచ్చాము. ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి. ఎవరైనా వేసుకోవచ్చు.

శ్రావణ మాసంలో పండుగలు, వ్రతాలు ఎక్కువ. మహిళలు అందమైన మెహందీ డిజైన్లతో చేతులను అందంగా మార్చుకుంటారు. పండగల సీజన్లో మహిళలు అలంకరణ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గరు. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతానికి కచ్చితంగా మహిళలంతా మెహెందీ పెట్టుకుంటారు. చేతులకు గోరింటాకు రుబ్బి పెట్టుకునే ఓపిక ఇప్పుడు లేదు. ఇది చాలా సమయం తీసుకుంటే కాబట్టి మార్కెట్లో దొరికే మెహెందీ కోన్ ను కొనుక్కుంటారు. ఇక్కడ మెహందీ కొత్త డిజైన్లను ఇచ్చాము. కొన్ని ట్రెండీ బ్యాక్ హ్యాండ్ మెహందీ డిజైన్లను ఇక్కడ ఇచ్చాము. ఈ డిజైన్లు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. మీరు ఈ డిజైన్లను రాఖీ పండుగకు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మేము ఇచ్చిన మెహెందీ డిజైన్లన్నీ చాలా సింపుల్, ఎలిగెంట్. ఇక్కడ మేము చేతి వెనుక వేసుకుంటే డిజైన్లు ఎన్నో ఉన్నాయి ఇక్కడ.
లేటెస్ట్ అండ్ ట్రెండీ మెహందీ డిజైన్ పొందాలనుకుంటే ఇలాంటి డిజైన్ ను పొందవచ్చు. ఈ డిజైన్ ను మీరే అప్లై చేసుకోవచ్చు. సమయం తక్కువగా ఉన్నప్పుడు మహిళలు కూడా ఇలాంటి డిజైన్ ను వేసుకోవచ్చు.
మీరు మీ చేతుల్లో చిన్న డిజైన్లను కూడా వర్తించవచ్చు. ఈ డిజైన్ చేతివేళ్లపై కాస్త డిజైన్ లుక్ ను కలిగి ఉంటుంది. అమ్మాయిలు కూడా ఈ తరహా డిజైన్ ను అప్లై చేసుకోవచ్చు.
చేతులకు పై నుంచి మెహందీ అప్లై చేయాలనుకుంటే ఇలాంటి డిజైన్ అప్లై చేసుకోవచ్చు. ఇది గాజుల డిజైన్ నమూనా. దీన్ని వేశాక చాలా బావుంటుందని అందరూ మెచ్చుకుంటారు.
ఈ రోజుల్లో చేతి వేళ్లకు హెవీ మెహందీ డిజైన్లను అప్లై చేయడానికి ఇష్టపడుతున్నారు. చేతుల వెనుక భాగంలో ఈ తరహా డిజైన్ కాస్త డిఫరెంట్ లుక్ ఇస్తుంది. ఈ తరహా మెహందీ డిజైన్ చేతుల వెనుక భాగంలో చాలా బాగుంటుంది.
ఆడవారికి పూల డిజైన్లు అంటే చాలా ఇష్టం. ఈ డిజైన్లు చాలా సింపుల్ గా ఉంటుంది. చాలా సులువుగా వేయవచ్చు. ఈ పూల నమూనా వెనుక భాగంలో చాలా బాగుంటుంది.
టాపిక్