Kitchen Hacks: పాడైపోయిన టమోటాలు, నిమ్మకాయలతో ఇలా ఇంటిని మెరిపించేయండి, ఏ మరకలైనా పోతాయి
Kitchen Hacks: వంటగదిలో ఉంచే కూరగాయల్లో టమోటాలు, నిమ్మకాయలు చాలా త్వరగా కుళ్లిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని విసిరేయడం తప్ప మరో మార్గం లేదు. ఈ రోజు మేము మీకు అద్భుతమైన క్లీనింగ్ చిట్కాలను అందిస్తున్నాము, వాటి సహాయంతో మీరు మీ ఇంటిని ప్రకాశవంతం చేయవచ్చు.
టమోటాలు, నిమ్మకాయలు అధికంగా తెచ్చుకుంటే అవి ఇంట్లో ఒక్కసారి మిగిలిపోతాయి. ఫ్రిజ్‌లో ఉంచిన ఈ కూరగాయలు కొన్ని రోజులు బాగానే ఉండి ఆ తర్వాత కుళ్లిపోవడం మొదలుపెడతాయి. ముఖ్యంగా టమోటాలు లేదా నిమ్మకాయలు మరింత త్వరగా చెడిపోవడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో, వాటిని పారవేయడం తప్ప వేరే మార్గం లేదు. అయితే ఈ కుళ్లిన టమోటాలు, నిమ్మకాయలను కూడా తిరిగి వాడవచ్చు. పాడైపోయిన టమోటాలు, నిమ్మకాయల సహాయంతో ఇంటిని శుభ్రపరిచవచ్చు. ఇంట్లోని చాలా వస్తువులను వీటితో మురికిపోగొట్టి మెరిసేలా చేయచ్చు.
ఇంట్లో వాడే కిచెన్ బేసిన్ ను ఎంత శుభ్రం చేసినా దాని పసుపు రంగు అలాగే ఉంటుంది. ఈ సందర్భంలో, కుళ్లిన టమోటాలు, నిమ్మకాయలను ఉపయోగించడం ద్వారా, మీరు బేసిన్‌కున్న పసుపు రంగును తొలగించవచ్చు. నిమ్మ, టొమాటోలకు జిడ్డును తొలగించే శక్తి ఉంది. ఇది మరకలను బాగా తొలగిస్తుంది. బేసిన్‌ను శుభ్రం చేయాలంటే ముందుగా కుళ్లిన టమోటాల తొక్కను తీసి చేతులతో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం పిండుకుని బాగా కలపాలి. ఈ పేస్టును బేసిన్ పై అప్లై చేసి స్క్రబ్బర్ తో రుద్దాలి. బేసిన్ పై ఉన్న మరకలన్నీ బాగా తొలగిపోయి బేసిన్ సరికొత్తగా కనిపిస్తుంది. పాత్రలు, సింక్‌లపై ఉన్న జిడ్డును శుభ్రపరచడానికి కూడా మీరు ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.
పాత బకెట్లు మెరిసేలా చేసేందుకు
బకెట్లు, మగ్‌లు చాలా కాలం ఉపయోగించిన తరువాత, బకెట్లు, మగ్‌లపై మొండి నీటి మరకలు ఉంటాయి. వాటిని శుభ్రం చేయడం అంత సులువు కాదు. కానీ కుళ్లిన టమోటాలు, నిమ్మకాయల సాయంతో బకెట్, మగ్ ను కొత్తగా మెరిసేలా చేసుకోవచ్చు. ఇందుకోసం టమోటాను రెండు ముక్కలుగా కట్ చేసి దానిపై నిమ్మరసం పిండాలి. ఇప్పుడు టొమాటో ముక్కను తీసుకుని మగ్ లేదా బకెట్ పై రుద్దడం ద్వారా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బకెట్, మగ్ పై ఉన్న మొండి మరకలు తొలగిపోతాయి. కావాలనుకుంటే కేవలం నిమ్మకాయ ముక్కలతో బకెట్, మగ్ కూడా శుభ్రం చేసుకోవచ్చు.
గ్యాస్ బర్నర్ పై తుప్పు పడుతూ ఉంటుంది. దీనిని శుభ్రం చేయడం చాలా కష్టం. కుళ్లిన టమోటాలు, నిమ్మకాయలతో ఈ తుప్పును తొలగించవచ్చు. దీని కోసం ముందుగా ఒక పాత్రలో నీటిని వేసి వేడి చేయాలి. నీరు కొద్దిగా వేడి అయ్యాక తరిగిన టమోటాలు వేసి మరిగనివ్వాలి. దీని తరువాత, ఈ టమోటాను నీటిలోనే ముద్దలా చేత్తోనే నలుపుకోవాలి. ఇప్పుడు అందులో నిమ్మరసం వేసి కలపాలి. దానిని వడకట్టి తుప్పు పట్టిన బర్నర్, కుళాయిలను రుద్దాలి. ఇప్పుడు నిమ్మకాయ ముక్కతో రుద్దడం ద్వారా తుప్పును శుభ్రం చేసుకోవాలి. తుప్పు బాగా శుభ్రపడుతుంది.
పైన చెప్పిన చాలా సింపుల్ హ్యాక్స్. పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా సహజంగానే మురికి పొగొట్టుకోవచ్చు.