వేసవిలో చలువ చేసే ఆహారాలను తినాలనుకుంటున్నారా? కీరదోస-టమాటో సాండ్‌విచ్ ట్రై చేయండి!
వేసవి కాలంలో వేడి వేడి టిఫిన్లు తినడం నచ్చకపోతే చల్లటి, రుచికరమైన కీరదోస-టమాటో సాండ్‌విచ్ ట్రై చేయండి! ఇది శరీరానికి చలువు చేస్తుంది కూడా. దీన్ని తయారు చేయడం కూడా సులవు. కీరదోస-టమాటో సాండ్‌విచ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి.
వేసవి కాలంలో పొట్టను చల్లగా ఉంచుతూ, ఆకలిని తీర్చే ఆహార పదార్థాలు బాగా తినాలని అనిపిస్తుంది. సాధారణ రోజుల్లో ఉదయాన్నే తినడానికి చాలా రకాల టిఫిన్లు ఉంటాయి. కానీ వేసవిలో వేడి కారణంగా వేడి వేడి ఆహారాలు తినాలనిపించవు. చల్లాగా ఏదైనా తినాలనే కోరిక రోజంతా ఉంటుంది. మీకు అలాగే అనిపిస్తుంది. ఈ కూల్ సాండ్ విచ్ రెసిపీ మీ కోసమే.
ఉదయాన్నే కీరదోస టామాటోలతో సాండ్ విచ్ తయారు చేసుకుని తిన్నారంటే చల్లటి, రుచకిరమైన ఆహారాన్ని ఆస్వాదించిన వారు అవుతారు. ఇది మీ శరీరానికి చలువ చేస్తుంది కూడా. అంటే డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది. వేసవి కాలంలో కనీసం మూడు రోజులకు ఒకసారైనా దీన్ని తిన్నారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్య మీ సొంతమవుతుంది. చల్లటివి తినాలనే మీ కోరిక కూడా తీరుతుంది. ఇలా అనేక రకాలుగా బెస్ట్ అనిపించుకునే కీరదోస టమాటో సాండ్ విచ్ ఎలా తయారు చేయాలో తులుసుకుందాం రండి.
కీరదోస- టమాటో సాండ్‌విచ్ తయారీకి కావలసిన పదార్థాలు:
- దోసకాయ ముక్కలు - ఒక దోసకాయ
- టమాటో ముక్కలు- రెండు టమాటోలు
- పచ్చి మిరపకాయ పేస్ట్- పావు టీస్పూన్
- వెన్న- ఒక స్పూన్
- నల్ల ఉప్పు - రుచికి తగినంత
- చాట్ మసాలా- - పావు టీస్పూన్
- వేయించిన జీలకర్ర- పావు టీస్పూన్
- బ్రెడ్ ముక్కలు- నాలుగు నుంచి ఆరు
కీరదోస- టమాటో సాండ్‌విచ్ తయారీ విధానం:
- కీరదోస- టమాటో సాండ్‌విచ్‌ను తయారు చేయడానికి ముందుగా తాజా బ్రెడ్ ముక్కలను తీసుకుని వాటిపై వెన్న రాసుకోండి.
- తరువాత రెండు బ్రెడ్ ముక్కలపై పచ్చి మిరపకాయ పేస్ట్ అప్లై చేయండి.
- ఆ తరువాత దీని మీద మీ రుచికి తగినంత నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడిని చల్లుకోండి.
- ఇప్పుడు బ్రెడ్ ముక్కలలో ఒకదానిపై సన్నగా, గుండ్రంగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ, టమాటో ముక్కలను అందంగా అమర్చండి.
- తరువాత చాట్ మసాలా చల్లి వాటిని మరొక బ్రెడ్ ముక్కతో కవర్ చేయండి.
- సాండ్ విచ్ రుచిగా ఉండాలంటే రెండవ బ్రెడ్ ముక్కపై కూడా వెన్నను ఖచ్చితంగా రాసుకోండి.
- తరువాత వీటిని త్రిభుజాకారంలో కట్ చేసుకుని సర్వ్ చేయండి.
- అంతే చల్లటి, రుచికరమైన కీరదోస- టమాటో సాండ్‌విచ్ రెడీ అయినట్టే. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ తినచ్చు.
వేసవిలో కీరదోస-టమాటో సాండ్‌విచ్ తినడం వల్ల కలిగే లాభాలు:
1. శరీరం చల్లగా ఉంటుంది
కీరదోసలో నీరు ఎక్కువగా ఉంటుంది. వేసవిలో వాతావరణ వేడిగా ఉన్నప్పుడు ఇది చల్లటి అనుభూతిని కలిగిస్తుంది.
2. డీహైడ్రేషన్ నివారణ
నీటి శాతం ఎక్కువగా ఉండే కీరదోస, టమాటాలను తినడం వల్ల శరీరానికి కావల్సిన నీరు అందుతుంది. డీహైడ్రైషన్ సమస్య తగ్గుతుంది.
3. లైట్ & హెల్తీ
వేడికాలంలో చాలా ఎంత తేలికైన ఆహారం తింటే అంత ఉత్సాహంగా అనిపిస్తుంది. కీరదోస-టమాటో సాండ్‌విచ్ తేలికగా, హెల్తీగా ఉంటుంది.
4. విటమిన్లు & మినరల్స్
టమాటోలో విటమిన్ C, కీరదోసలో విటమిన్ K, పొటాషియం వంటివి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.
5. జీర్ణం బాగా అవుతుంది
కీరదోస-టమాటో కాంబినేషన్ చాలా తేలికగా జీర్ణం అవుతుంది. వేసవిలో హీటింగ్ ఫుడ్ అయిన ఫ్రై ఐటెంల కంటే ఇది చాలా బెటర్.
సంబంధిత కథనం