Heart Attack: మీ గుండె ఇచ్చే నిశబ్ధ సంకేతాల్ని గమనిస్తే, హార్ట్ ఎటాక్ నుంచి తప్పించుకోవచ్చు-silent signs of a heart problem is a wake up call ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Attack: మీ గుండె ఇచ్చే నిశబ్ధ సంకేతాల్ని గమనిస్తే, హార్ట్ ఎటాక్ నుంచి తప్పించుకోవచ్చు

Heart Attack: మీ గుండె ఇచ్చే నిశబ్ధ సంకేతాల్ని గమనిస్తే, హార్ట్ ఎటాక్ నుంచి తప్పించుకోవచ్చు

Galeti Rajendra HT Telugu
Oct 12, 2024 09:30 AM IST

Signs Of Heart Attack: మనం ఎలాంటి పని చేయకుండా సైలెంట్‌గా ఉన్నప్పుడు కూడా చెమటలు పడితే అనుమానించాల్సిందే. హార్ట్ ఎటాక్‌కి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వాటిని గమనించి జాగ్రత్తపడితే సరి.

గుండె పోటు సంకేతాలు
గుండె పోటు సంకేతాలు (Shutterstock)

గుండె అనేది మన శరీరాలను నడిపించే అలసిపోని ఇంజిన్ లాంటిది. నిరంతరం మన శరీరానికి రక్తాన్ని పంపింగ్ చేస్తూ, ప్రతి కణానికి ఆక్సిజన్, పోషకాలను గుండె పంపిణీ చేస్తుంటుంది. ఒకవేళ గుండె ధమనులు ఇరుకైనప్పుడు లేదా బ్లాక్ అయినప్పుడు అది గుండెపోటుకు దారితీస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది గుండెపోటుతో చనిపోతున్నారు. ఇందులో కొంత మందికి హార్ట్ ఎటాక్ హిస్టరీ లేకపోయినా, ఫస్ట్ టైమ్ గుండెపోటు వచ్చినా ప్రాణాలు కోల్పోయిన వారు ఉంటున్నారు. అయితే.. హార్ట్ ఎటాక్‌కి ముందు గుండె కొన్ని సంకేతాలు ఇస్తుంది. దాన్ని గమనించి మనం జాగ్రత్తపడితే గుండె పోటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

హార్ట్ ఎటాక్ సంకేతాలు

సాంప్రదాయ గుండెపోటు తరహాలో కాకుండా తరచుగా ఛాతీ నొప్పి ఉంటుంది. అలానే ఛాతీలో తేలికపాటి బిగుతు, ఒత్తిడి లేదా అసౌకర్యంగా అనిపిస్తుంది. తేలికపాటి పని చేసినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అది గుండె సంబంధిత సమస్యగా మనం పరిగణించి వైద్యుడిని సంప్రదించాలి.

కొంత మందికి తలతిరగడం లేదా తలతిరిగే అనుభూతి ఉండవచ్చు. మాటల్లో వివరించలేని వికారం లేదా గుండెల్లో మంట కూడా కొన్నిసార్లు గుండెపోటు లక్షణం కావచ్చు. అలానే మీరు ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా ఊహించని విధంగా చెమటలు శరీరంపై కనిపిస్తే దాన్ని హార్ట్ ఎటాక్ సంకేతంగా పరిగణించాలి. డయాబెటిస్ ఉన్న వ్యక్తులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

గుండెని పదిలం చేసుకోవడానికి చిట్కాలు

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. అయితే.. వయసు, ఫ్యామిలీ హార్ట్ ఎటాక్ హిస్టరీ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.పేలవమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, అధిక ఒత్తిడి, మధుమేహం, అధిక రక్తపోటు గుండెపోటుకి దారి తీయవచ్చు.

గుండెపోటు ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలానే ప్రతి రోజూ పండ్లు, కూరగాయలతో పాటు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు తీసుకుంటూ ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. అది నడక కూడా కావొచ్చు.

ధూమపానం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. కాబట్టి ఒకవేళ అలవాటు ఉంటే నెమ్మదిగా మానేయడానికి ప్రయత్నించండి. అలానే ప్రతి రోజూ కాసేపు ధ్యానం లేదా యోగా చేస్తూ ఒత్తిడిని నియంత్రించుకోవడం అలవాటు చేసుకోండి. ఛాతి దగ్గర మీకు ఏవైనా తేడాగా సంకేతాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి అవసరమైన చెకప్‌లు చేయించుకోవడం ఉత్తమం.

Whats_app_banner