తన హెయిర్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్ శ్రుతి హాసన్.. మెరిసే జుట్టుకు కారణం ఇంట్లో దొరికే ఈ ఆయిలేనట!-shruti haasan reveals her hair secret in ranveer allahbadia show says her hair protection is sesame oil ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  తన హెయిర్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్ శ్రుతి హాసన్.. మెరిసే జుట్టుకు కారణం ఇంట్లో దొరికే ఈ ఆయిలేనట!

తన హెయిర్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్ శ్రుతి హాసన్.. మెరిసే జుట్టుకు కారణం ఇంట్లో దొరికే ఈ ఆయిలేనట!

Sanjiv Kumar HT Telugu

హీరోయిన్ శ్రుతి హాసన్ తన హెయిర్ సీక్రెట్ చెప్పేసింది. యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా షోలో పాల్గొన్న శ్రుతి హాసన్ తన మెరిసే జుట్టుకు ఇంట్లో దొరికే, అందరికి తెలిసిన ఆయిలేనని వివరించింది. ఆ ఆయిల్‌కు మూడ్‌ను బట్టి కొబ్బరి నూనే, బాదం నూనే మిక్స్ చేసి రాసుకుంటానని ఆ షోలో చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్

తన హెయిర్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్ శ్రుతి హాసన్.. మెరిసే జుట్టుకు కారణం ఇంట్లో దొరికే ఈ ఆయిలేనట!

తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్. సింగర్‌గా, హీరోయిన్‌గా అలరించిన శ్రుతి హాసన్ ఇటీవల జూలై 11న యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా షోలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన పొడవాటి, అందమైన నల్లటి జుట్టు వెనుక ఉన్న రహస్యం గురించి శ్రుతి హాసన్ వెల్లడించింది.

అందమైన జుట్టు వెనుక ఉన్న రహస్యం

'శ్రుతి హాసన్ అందమైన జుట్టు వెనుక రహస్యం ఏంటీ?', 'ఇంత ఆరోగ్యకరమైన జుట్టును ఎలా మెయింటైన్ చేస్తారు?' అని హోస్ట్ రణ్‌వీర్ అల్లాబాడియా అడిగాడు. దానికి ఇదంతా ఒక సాధారణ పురాతన ఆయిల్. అది నువ్వుల నూనే అని తన హెయిర్ సీక్రెట్ చెప్పింది శ్రుతి హాసన్.

మూడ్‌ను బట్టి అలా

"ఇది నా నేచురల్ హెయిర్ కలర్. నేను ఆయిల్ వాడుతాను. కానీ, కేవలం నువ్వుల నూనె మాత్రమే వాడతాను. నా మూడ్‌ని బట్టి కొబ్బరికాయ నూనేతో లేదా బాదం నూనేతో కలిపి నువ్వుల ఆయిల్‌ను రాసుకుంటాను. సాధారణంగా నువ్వులు నా జుట్టుకు అద్భుతాలు చేశాయి" అని శ్రుతి హాసన్ తెలిపింది.

అలా చేయకండి

జుట్టుకు నువ్వుల నూనేను ఎలా వాడుతుందో కూడా శ్రుతి హాసన్ చెప్పింది. "నేను ప్రతిరోజూ జుట్టు కడుక్కోను. మీరు కూడా ప్రతిరోజూ మీ జుట్టును వాష్ చేయకండి. నేను షూటింగ్‌లో ఉంటే ముందు రోజు రాత్రి నువ్వుల నూనే రాసుకుని నిద్రపోతాను. మరునాడు నిద్రలేచి వాష్ చేసుకుని షూటింగ్‌కు వెళ్తాను" అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.

నా రక్షణ ఇది

శ్రుతి హాసన్‌కు ఆయిల్ పెట్టుకోవడం కేవలం బ్యూటీ హ్యాక్ మాత్రమే కాదట. ఇది స్వీయ సంరక్షణ ఆచారం అని కూడా తెలిపింది. "ఈ నూనె నా రక్షణ" అని నవ్వుతూ చెప్పింది శ్రుతి హాసన్. "నేను మీకు చెబుతున్నాను. ఖరీదైన సీరమ్స్, హీట్ ట్రీట్‌మెంట్స్, సెలూన్ వంటి బ్రాండ్స్ మాయలో పడిపోకండి. మన అమ్మమ్మలు ఎప్పుడు సహజమైన పద్ధతినే వాడారు. వాళ్లే కరెక్ట్" అని శ్రుతి హాసన్ తెలిపింది.

శ్రుతి హాసన్ సినిమాలు

ఇదిలా ఉంటే, శ్రుతి హాసన్ చివరి సారిగా వీర సింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్య, ది ఐ, హాయ్ నాన్నా, సలార్ సినిమాల్లో వరుసగా నటించింది. ప్రస్తుతం శ్రుతి హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ, దళపతి విజయ్ జన నాయకన్, మిస్కిన్ డైరెక్షన్‌లో ట్రైన్ సినిమాలు చేస్తోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం