Tea and Coffee: ఉపవాసం చేసినప్పుడు టీ, కాఫీ తాగకూడదా? ఫాస్టింగ్ సమయంలో ఏం తినాలి? ఏం తాగకూడదు?-shouldnt drink tea and coffee while fasting what to eat during fasting what not to drink ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tea And Coffee: ఉపవాసం చేసినప్పుడు టీ, కాఫీ తాగకూడదా? ఫాస్టింగ్ సమయంలో ఏం తినాలి? ఏం తాగకూడదు?

Tea and Coffee: ఉపవాసం చేసినప్పుడు టీ, కాఫీ తాగకూడదా? ఫాస్టింగ్ సమయంలో ఏం తినాలి? ఏం తాగకూడదు?

Haritha Chappa HT Telugu

Tea and Coffee: ఉపవాస సమయంలో టీ లేదా కాఫీ తాగాలా అని తికమక పడుతున్నారా? ఉపవాసం చేస్తూ ఏం తినాలా? అని ఆలోచిస్తున్నారా? మీ సందేహాలకు ఇక్కడ మేము సమాధానాలు ఇచ్చాము.

ఉపవాసంలో టీ, కాఫీ తాగవచ్చా? (Pixabay)

నవరాత్రులు వచ్చాయంటే ఉపవాసం చేసే వారి సంఖ్య అధికంగా పెరిగిపోతుంది. ఈ పండుగ సమయంలో కొంతమంది ప్రతిరోజూ ఉపవాసం ఉంటారు. మరికొందరు మొదటి రోజు, చివరి రోజున ఉపవాసం ఉంటారు. ఉపవాసం విషయంలో ఎంతో మంది మనసులో అనేక సందేహాలు ఉన్నాయి. ఉపవాస సమయంలో టీ, కాఫీలు తీసుకోవాలా వద్దా, ఉపవాస సమయంలో ఎలాంటి పదార్థాలు తినాలి, ఏవి తినకూడదు? ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఉపవాస ఆహారం, పానీయాల గురించి ఉన్న సందేహాలకు ప్రధాన కారణం వ్యక్తులకు ఉన్న విభిన్న ఆలోచనలు, నమ్మకాలు. ఇక్కడ మేము మీ సందేహాలను తీర్చే ప్రయత్నం చేశాము. ఉపవాస సమయంలో ఏం తినాలో, ఏం తినకూడదో తెలుసుకుందాం.

టీ లేదా కాఫీ తాగవచ్చా?

ఉపవాస ఆహారంలో టీ, కాఫీలు ఎక్కువగా ఉంటాయి. టీ, కాఫీలు తాగకూడదని కొందరు, ఉపవాస సమయంలో టీ, కాఫీలు తాగవచ్చని కొందరు నమ్ముతారు. నిజానికి ఉపవాస సమయంలో టీ తాగడానికి ఎలాంటి నిషేధం లేదు. చాలా మంది ఉపవాస సమయంలో టీ కూడా తాగుతారు. కానీ కాఫీ తాగడం గురించి ప్రతి ఒక్కరికీ భిన్నమైన నమ్మకాలు ఉంటాయి. ఉపవాస సమయంలో కాఫీ తాగకూడదని కొందరు, ఉపవాస సమయంలో టీ తాగితే కాఫీ కూడా తాగొచ్చని కొందరు చెబుతుంటారు. మొత్తమ్మీద ఉపవాస సమయంలో టీ, కాఫీ తాగడానికి ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పవచ్చు. మీరు త్రాగాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.

ఉపవాసం ఏం తినాలి?

ఉపవాసంలో భాగంగా అనేక రకాల ఆహారాలను తినవచ్చు. పూల్ మఖానా, వేరుశెనగ పలుకులు, బాదం పప్పులు, జీడిపప్పు, బంగాళాదుంప చిప్స్ ను స్నాక్స్ గా తీసుకోవచ్చు. ఉపవాస సమయంలో రైస్ ఖీర్ లేదా కిచిడీ, సాబుదానా కిచిడీ తయారు చేసి తినవచ్చు. ఉపవాస సమయంలో అన్ని రకాల పండ్లు తినవచ్చు. దీనితో పాటు, మీరు ఉపవాసం ప్లేట్లో పాలు, పెరుగుతో చేసిన వస్తువులను కూడా చేర్చవచ్చు.

ఏమి తినకూడదు?

ఉపవాసం సమయంలో కొన్ని ఆహారాలను తినకూడదు. ఉపవాసం ఆరోజు విరమించాక వెల్లుల్లి, ముల్లంగి, ఉల్లిపాయ వంటివి తినకూడదు. వీటిని ఉపవాస సమయంలో నిషిద్ధంగా భావిస్తారు. ఉపవాసం సమయంలో గోధుమలు, బియ్యం, చిరుధాన్యాలు, మొక్కజొన్న వంటి ఏ రకమైన ధాన్యాలను తినకూడదు. సాధారణ ఉప్పును కూడా ఉపవాసంలో ఉపయోగించరు. ఆవనూనె, అనేక రకాల మసాలా దినుసులు కూడా ఉపవాస సమయంలో ఉండవు. వీటితో పాటు నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి.

నిజానికి ఉపవాసం రోజుల్లో చాలా సాత్విక ఆహారాన్ని తినాలి. ఎక్కువ సమయం పాటూ ఆహారం లేకుండా పొట్ట ఖాళీగా ఉంటుంది. అలాంటప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే మంచిది. ముఖ్యంగా పండ్లు అధికంగా తింటే మంచిది. మజ్జిగ తాగడం మాత్రం మరిచిపోవద్దు. అలాగే నిమ్మరసం తాగుతూ ఉండాలి.