Bhagavad Gita Sayings: ఎదుటివారి ప్రవర్తన బాగుండకపోయినా, మనం మంచిగానే ప్రవర్తించాలా? భగవద్గీత ఏం చెప్తుంది?-should you be good to everyone even those who never were the bhagavad gita knows ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bhagavad Gita Sayings: ఎదుటివారి ప్రవర్తన బాగుండకపోయినా, మనం మంచిగానే ప్రవర్తించాలా? భగవద్గీత ఏం చెప్తుంది?

Bhagavad Gita Sayings: ఎదుటివారి ప్రవర్తన బాగుండకపోయినా, మనం మంచిగానే ప్రవర్తించాలా? భగవద్గీత ఏం చెప్తుంది?

Ramya Sri Marka HT Telugu
Published Feb 16, 2025 05:00 PM IST

Bhagavad Gita Sayings: మీ పని మీరు చేసుకుంటూ పోతూ, ఇతరులకు సహాయం చేయాలని అనుకున్నారా? మీ మంచితనం అలుసుగా చేసుకుని వెన్నుపోటు పొడిచే ఫ్రెండ్స్, కుట్రలు చేసే కొలీగ్స్ అవకాశంగా వాడుకుంటున్నారా? అలాంటప్పుడు వీళ్లతో ఇంకా మంచిగా ప్రవర్తించడం అవసరమా అనిపిస్తుంటే, ఇది మీ కోసమే..

 ఎదుటివారి ప్రవర్తన బాగుండకపోయినా, మనం మంచిగానే ప్రవర్తించాలా? భగవద్గీత ఏం చెప్తుంది?
ఎదుటివారి ప్రవర్తన బాగుండకపోయినా, మనం మంచిగానే ప్రవర్తించాలా? భగవద్గీత ఏం చెప్తుంది?

చిన్నతనంలోనో, వయస్సులో కాస్త పెద్దయ్యాకనో మనం ఎదుర్కొనే సంఘటనల నుంచి చేదు నిజాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మనతో ఒకేలా ప్రవర్తించడం లేదని, మనలో ఉన్న మంచితనాన్ని బలహీనతగా తీసుకొంటున్నారని తెలుస్తుంది. చాలా సులువుగా వాళ్లు చేయగలరనే ఫీలింగ్ తో మనల్ని హర్ట్ చేసేస్తుంటారు. అయినప్పటికీ వారితో మంచిగానే ప్రవర్తించాలా? మన మొఖం మీదనే తిట్టిపోసిన వారికి మన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచాలా? మన మీద జాలి చూపించని వారిపట్ల దయ చూపించాలా? ఈ ప్రశ్నలన్నింటికీ భగవద్గీత ఏం సమాధానం చెప్తుందంటే..

మంచితనం అనేది మీరెవరనే దానిపై ఆధారపడి ఉంటుంది, ఇతరులపై కాదు

కదనరంగంలో అర్జునుడు నిలబడినప్పుడు సందిగ్ధంలో ఉండిపోయాడు. ఆ సందర్భంలో కృష్ణుడు ఇతరులు నీతో ప్రవర్తించినట్లు నువ్వు వ్యవహరించకు. నీ సొంత ధర్మాన్ని నువ్వు పాటించమని ఉపదేశించాడు. దీనిని బట్టి మంచితనం అనేది ప్రపంచానికి నువ్వు చూపించే రియాక్షన్ కాకూడదు. నువ్వు దయగల వ్యక్తివి అయితే నీకు అదే తిరిగొస్తుంది. నువ్వు నిజాయతీపరుడివి అయితే అదే తిరిగొస్తుంది. ఎదుటివారి పట్ల నియంతగా వ్యవహరిస్తే, మిమ్మల్ని కూడా మరొకరు నియంత్రిస్తారు. అసలైన మంచితనమేంటంటే, పరిస్థితులకు అతీతంగా నీతిని పాటించడం. విలువలతో కూడిన ప్రవర్తన కలిగి ఉండటం.

కర్మ అనేది అద్దం లాంటిది, అది ఆయుధం కాదు

గీత స్పష్టంగా చెబుతున్నదేంటంటే, ప్రతి యాక్షన్ కి దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కానీ, అవి మన చేతిలో ఉండవు. అవన్నీ విశ్వపు నియమాలకు కట్టుబడి ఉంటాయి. ఎవరైనా మనకు చెడు చేస్తే వెంటనే, ప్రతీకారంగా చెడు చేయాలని భావించకండి. అలా చేయాలనే మీ ధోరణి వల్ల మిగిలేది, మీరు కూడా మరొకరు విషయంలో చెడు వ్యక్తిగా మారిపోవడమే. కానీ, చిన్న చిన్న ప్రతీకార కుట్రల కోసం మీ శక్తిని వృథా చేసుకోకుండా, కర్మను నమ్మి ఆ విషయాన్ని అక్కడితో వదిలేయండి. క‌ృష్ణుడు చెప్పినట్లు ప్రతి చర్యకు తగ్గ ప్రతిఫలం ఉంటుందని నమ్మండి.

అత్యంత కష్టతరమైన నిర్లిప్తత

నిర్లిప్తత (Detachment)గురించి శ్రీకృష్ణుడు చెబుతూ ఇది క్షమాపణ కంటే కఠినమైనదని బోధిస్తున్నాడు. ఎవరితోనైనా మంచిగా వ్యవహరించండి. కానీ, ఆ వ్యక్తి దానికి బదులుగా ఏదైనా చేయాలని ఆశించకండి. అలా చేయడం అనేది లావాదేవీ జరిపినట్లు అవుతుంది. కానీ, మంచి చేసినట్లు కాదు. పైగా, అవతలి వ్యక్తి దానికి తగ్గట్లు ఏమీ చేయకపోతే, అది మిమ్మల్ని మరింత ఫీలయ్యేలా చేస్తుంది. సాయం లేదా మంచి చేసేటప్పుడు సున్నా అంచనాలతో మీ హస్తం అందించాలి. అప్పుడే మీరు భావోద్వేగ బ్లాక్‌మెయిల్ నుంచి బయటపడతారు.

దయకి హద్దులుంటాయ్

మంచిగా ఉండటం అంటే అమాయకంగా వ్యవహరించడం కాదు. గీత మిమ్మల్ని త్యాగం చేయమని అడగదు. గీత స్పష్టంగా చెప్తున్నదేంటంటే, సమతుల్యత గురించి మాత్రమే. అమరవీరుల గురించి కాదు. దయగా ఉండండి. కానీ, అమాయకంగా ఉండకండి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం