Shloka Mehta: టిష్యూ చీర కట్టిన అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా, ఈ చీర ఖరీదు ఎంతంటే…-shloka mehta ambanis elder daughter in law who tied a tissue saree how much does this saree cost ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Shloka Mehta: టిష్యూ చీర కట్టిన అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా, ఈ చీర ఖరీదు ఎంతంటే…

Shloka Mehta: టిష్యూ చీర కట్టిన అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా, ఈ చీర ఖరీదు ఎంతంటే…

Haritha Chappa HT Telugu
Jul 11, 2024 05:30 PM IST

Shloka Mehta: అనంత్, రాధిక మెహందీలో శ్లోకా మెహతా లేతాకుపచ్చ టిష్యూ చీరలో మెరిసిపోయింది. ఆ చీరలో తన నాన్నమ్మ బంగారు ఆభరణాలను ధరించి మహారాణిలా కనిపిస్తోంది అంబానీ పెద్ద కోడలు.

అనంత్ రాధికా పెళ్లిలో శ్లోకా మెహతా
అనంత్ రాధికా పెళ్లిలో శ్లోకా మెహతా (Instagram/@dmjatia)

అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మాటలా. నిజంగానే భూదేవంతా అరుగు, ఆకాశమంత పందిరి సిద్ధమైపోతాయి. ఆ పెళ్లి వేడుకలు కొన్ని నెలలుగా జరుగుతూనే ఉన్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం జూలై 12, 2024 న జరగనుంది. అంబానీ కుటుంబంలో ఈ పెళ్లికి దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద సెలెబ్రిటీలను ఆహ్వానించింది. పెళ్లికి ముందు అంబానీల ఇంట్లో శివ శక్తి పూజ, మెహందీ వేడుక, హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బాలీవుడ్ తారల మధ్యలో అంబానీల పెద్దకోడలు శ్లోకా మెహతా అందరి దృష్టిని ఆకర్షించింది. అంబానీ వంశానికి చెందిన శ్లోకా తన కట్టూ బొట్టూతో అందరిని తనవైపు తిప్పుకుంది. ఆమె మెహందీ లుక్ చూపుతిప్పలేనంత అందంగా కనిపిస్తోంది. శ్లోకా లేటెస్ట్ గ్లామర్ లుక్ ను డీకోడ్ చేస్తే అమ్మాయిలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

yearly horoscope entry point

శ్లోకా మెహతా ఎథ్నిక్ లుక్‌లో మహారాణిలా కనిపిస్తోంది. ఆమె వస్త్రధారణ, సొగసు రాజరికాన్ని గుర్తుకు తెస్తోంది. ఆమె కట్టిన విలాసవంతమైన టిష్యూ సిల్క్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన ఆకుపచ్చ రంగు చీర… ఆమె అందాన్ని మరింత పెంచింది. ఆ చీర అంచుల్లో సున్నితమైన పితా వర్క్ లో 'పాన్-పట్టి' బొమ్మలను అలంకరించారు. ఈ చీర రాజరికతకు చిహ్నంలా కనిపిస్తోంది. ఆమె సాంప్రదాయక పద్ధతిలో చీరను ధరించింది. ఆమె భుజాల నుండి దుపట్టా కిందవరకు జలతారులా జారుతున్నట్టు ధరించింది. గోటా సిలాయ్ జాకెట్‌తో చీర అందం మరింత పెరిగిపోయింది. సంప్రదాయ శైలిని, సమకాలీన శైలితో మేళవించి ఈ చీరను తయారుచేశారు.

శ్లోకా చీర మీకు కూడా నచ్చితే అలాంటి చీరను మీరూ కొనుక్కోవచ్చు. ఇది ఈ కామర్స్ సైట్లో అందుబాటులో ఉంది. ఆమె కట్టిన ఆరు గజాల చీరను ప్రఖ్యాత డిజైనర్ మసాబా గుప్తా రూపొందించింది. దీని ధరను రూ .60,000 గా నిర్ణయించారు.

శ్లోకా కట్టిన చీర ధర
శ్లోకా కట్టిన చీర ధర (www.houseofmasaba.com/)

శ్లోకా మెహతా తన చీరకు తగట్టు ఆభరణాలను ధరించింది. ఆమె స్టేట్మెంట్ జువెలరీ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆమె తన నాన్నమ్మ బంగారు ఆభరణాలను ధరించింది. వీటిలో నెక్ పీస్, చెవిపోగులు, మాంగ్ టిక్కా ఉన్నాయి. ఇవన్నీ ఆమె లుక్ ను మరింత అందంగా మార్చింది. ఆమె స్టైలిస్ట్, సోదరి దియా మెహతా జతియా మాట్లాడుతూ "నాన్నమ్మ నగలు అక్క లుక్‌ను మరింత సంప్రదాయంగా మార్చాయి’ అని అభిప్రాయపడింది.

మేకప్ విషయానికి వస్తే శ్లోకా న్యూడ్ ఐషాడో, ఐలైనర్, కనురెప్పలపై మస్కారా పూత క్లాసిక్ లుక్ లో కనిపిస్తోంది. ఇది ఆమె కళ్ళ అందాన్ని మరింత పెంచింది. ప్రకాశవంతమైన హైలైటర్ ఆమె ముఖానికి మరింత మెరుపును తెచ్చింది. ఈ లుక్ ను పూర్తి చేయడానికి ఆమె న్యూడ్ లిప్ స్టిక్ ను ఎంచుకుంది. ఆమె నుదుటిపై చిన్న నల్ల బొట్టు మరింత సాంప్రదాయకంగా మార్చింది. ఆమె హెయిర్ స్టైల్ కూడా చాలా సింపుల్ గా ఉంది.

Whats_app_banner