Sankranti: సంక్రాంతిరోజు నువ్వులు బెల్లం కలిపి పంచడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి, ఆ రోజు ఇలా చేయండి
Sankranti: మకర సంక్రాంతిని భారతదేశంలో అతిపెద్ద పండుగలాగా నిర్వహించుకుంటారు. సంక్రాంతి పండుగను భారతదేశం అంతటా వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ పండుగ ప్రత్యేకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
మకర సంక్రాంతి భారతదేశంలో జరుపుకునే అతి పెద్ద పండుగలలో ఒకటి. ఈ పండుగను భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో జరుపుకుంటారు. హిందూ మతంలో సంక్రాంతిని పవిత్రమైన రోజుగా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజున సూర్యుడు తన మార్గాన్ని మార్చుకుంటాడు. ఇది శీతాకాలం ముగింపును సూచిస్తుంది. ఈ రోజునే మరణించిన తమ పూర్వీకులకు తర్పణం సమర్పిస్తారు. సంక్రాంతిని దేశవ్యాప్తంగా రైతులు పండుగ చేసుకుంటారు. పంటల కోసం సూర్యదేవుడిని, ఇంద్రుడిని రైతులు ఆరాధిస్తారు.

సంక్రాంతి రోజ ఏం చేయాలి?
సంక్రాంతి పండుగ రోజు సూర్య నమస్కారాలు చేయడం ఆనవాయితీ. స్నానం చేసిన తరువాత, సూర్యుడిని, ఇంటి దేవతలు, కులదేవతలను పూజించి ధాన్యం సమర్పిస్తారు. ఈ రోజున భక్తులు పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సంక్రాంతికి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీన్ని మకర సంక్రాతి అని పిలుస్తారు. ఈ సమయంలో, సూర్యభగవానుడు ప్రతి రాశిపై ప్రత్యేక ఫలాలను ఇస్తాడు. ఈ కాలం నుంచి నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది.
నువ్వులు బెల్లం పంచడం
కర్నాటకలో అమ్మాయిలకు ప్రత్యేకంగా ఈ వేడుకను నిర్వహించుకుంటారు. ఈ రోజున ప్రధానంగా తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరికాయ, బెల్లం మిశ్రమాన్ని కలిపి స్వీటులా తయారు చేస్తారు. దాన్ని స్నేహితులకు, బంధువులకు, చుట్టుపక్కల ఉన్నవారికి ఇస్తారు. దీనివల్ల వారి మధ్య స్నేహ సంబంధాలు శాశ్వతంగా బలపడతాయని విశ్వసిస్తారు. శని నువ్వుల పాలకుడు. నల్ల నువ్వులను శ్రాద్ధం రోజున పెద్దలు, పెద్దలు కలిసి తర్పణం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే సంక్రాంతి రోజున తెల్ల నువ్వులు తినడం శుభసూచకం. సంక్రాంతికి గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం ఉంది. ఆవులు, ఎద్దులను అలంకరించి భోగి మంటలు వెలిగించి జరుపుకుంటారు.
తమిళనాడులో ఈ రోజును పొంగల్ అని పిలుస్తారు. ఈ పండుగను మొత్తం నాలుగు రోజుల పాటు నిర్వహించుకుంటారు. భోగి రోజున కొత్త బట్టలు, ఆభరణాలు ధరించడం శుభప్రదమని విశ్వసిస్తారు. పొంగల్ రోజున పాలలో బెల్లం కలిపి తింటారు. ఇలా తింటే జీవితంలో ఆశించిన కోరికలు, ఆకాంక్షలన్నీ నెరవేరుతాయని విశ్వసిస్తారు.
కేరళలో ఈ రోజున మకరజ్యోతిని చూస్తారు. నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించిన భక్తులు శబరిమలకు వెళతారు. దీనిని మకరవిలక్కు అంటారు. మకరజ్యోతి మూడు సార్లు కొండ పైభాగంలో ప్రత్యేక దిశలో దర్శనమిస్తుందన్న విషయం తెలిసిందే. ఆధ్యాత్మికంగా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది.
మహారాష్ట్రలో సంక్రాంతి సంబరం కర్ణాటకను పోలి ఉంటుంది.ముఖ్యంగా నువ్వులతో చేసిన లడ్డూలను తమ ఆత్మీయులకు పంచుతారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి ఎంత పెద్ద పండుగలాగా నిర్వహించుకుంటారో ప్రతి ఒక్కరికీ తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో అరిసెలు, సకినాలు, జంతికలు, బూరెలు, సున్నుండలు, నువ్వుల లడ్డూలు వంటివి ప్రత్యేకంగా వండుతారు. అలాగే కనుక రోజు కచ్చితంగా మాంసాహారం ఉండాల్సిందే. నాటుకోడి కూరలు, గారెలు, మటన్ కూరలు ఘుమఘుమలాడుతూ ఉంటాయి.
టాపిక్