Republic day Wishes: రిపబ్లిక్ డేకు ప్రతి భారతీయ పౌరుడికి ఈ దేశభక్తి సందేశాలు పంపండి
Republic day Wishes: జనవరి 26 భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించిన రోజు. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఈసారి మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ రోజున బంధుమిత్రులకు గణతంత్ర దినోత్సవ విషెష్ పంపండి.
భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం జనవరి 26న వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మన దేశం గొప్ప చరిత్రకు, ప్రజాస్వామ్య సూత్రాల నిబద్ధతకు నిదర్శనం. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము. జనవరి 26 వచ్చిందంటే ప్రతిచోటా దేశభక్తి వెల్లివిరుస్తుంది. 1950లో భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన రోజును స్మరించుకోవడానికి ఈ రోజును నిర్వహించుకుంటాము. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి, భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం ముందు నిలిచిన రోజు.

భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించి 75 ఏళ్ళు పూర్తయింది. ఈ సంవత్సరం మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మీరు మీ ప్రియమైన వారికి వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో రిపబ్లిక డే విషెస్ పంపాలనుకుంటే ఇక్కడ చూడండి. వీటిలో అందమైన శుభాకాంక్షలను ఎంపిక చేసుకుని పంపండి.
రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
1. గణతంత్ర దినోత్సవం సందర్భంగా
దేశాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేద్దాం.
భారతీయులుగా గర్వపడదాం.
మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
2. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను
స్మరించుకుంటూ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుందాం.
దేశ పురోభివృద్ధికి కృషి చేద్దాం.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
3. దేశ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి
కృషి చేసిన నాయకులందరి కోసం కష్టపడదాం.
వారిలాగే దేశ పురోగతి కోసం రాత్రింబవళ్లు పనిచేద్దాం
జైహింద్.
4. గణతంత్ర దినోత్సవం నాడు
జాతీయ పతాకాన్ని ఎగురవేసినప్పుడు
మన వీర స్వాతంత్ర్య సమరయోధుల
త్యాగాలను స్మరించుకుందాం,
వారికి నివాళులర్పిద్దాం.
మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
5. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ
దేశ ప్రగతికి పాటుపడదాం
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
6. మన దేశ గొప్ప వారసత్వాన్ని మరచిపోకుండా
ఈ దేశంలో భాగమైనందుకు గర్విద్దాం.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
7. భారతదేశానికి అంత సులభంగా
స్వాతంత్ర్యం రాలేదనే విషయాన్ని మరచిపోకూడదు.
గతంలో లక్షలాది మంది యోధుల త్యాగాల కథ ఇది.
దేశభక్తిని పెంపొందించడానికి కృషి చేద్దాం.
హ్యాపీ రిపబ్లిక్ డే.
8. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని
మనమందరం గర్వంగా నిలబడి దేశాన్ని గౌరవిద్దాం.
హ్యాపీ రిపబ్లిక్ డే
9. ఈ నేలపై మనం ప్రశాంతంగా
ఊపిరి పీల్చుకుంటున్నామంటే
దానికి కారణం స్వాతంత్ర్యం, రాజ్యాంగం.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
హ్యాపీ రిపబ్లిక్ డే.
10. గణతంత్ర దినోత్సవం రోజున,
రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని,
దేశానికి, రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.
హ్యాపీ రిపబ్లిక్ డే
11. మాతృభూమిపై మన వారసత్వాన్ని పరిరక్షిస్తామని,
దేశాభివృద్ధికి, పురోగతికి తోడ్పడతామని ప్రతిజ్ఞ చేద్దాం.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
12. ఈ గణతంత్ర దినోత్సవం నాడు,
మన రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలకు
కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేద్దాం
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కాపాడుదాం.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
సంబంధిత కథనం
టాపిక్