Happy Valentines day: ఈ వాలెంటైన్స్ డేకి మీ ప్రేమికులకు హృదయాన్ని హత్తుకునేలా ఈ శుభాకాంక్షలు పంపండి-send these heart touching wishes to your lovers this valentines day in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Valentines Day: ఈ వాలెంటైన్స్ డేకి మీ ప్రేమికులకు హృదయాన్ని హత్తుకునేలా ఈ శుభాకాంక్షలు పంపండి

Happy Valentines day: ఈ వాలెంటైన్స్ డేకి మీ ప్రేమికులకు హృదయాన్ని హత్తుకునేలా ఈ శుభాకాంక్షలు పంపండి

Haritha Chappa HT Telugu
Published Feb 14, 2025 05:30 AM IST

Happy Valentines day: వాలెంటైన్స్ డే వచ్చిందంటే ప్రేయసి ప్రియులకు పండగే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులంతా ఈరోజు కోసం ఎదురు చూస్తారు. అలాంటివారి కోసమే ఇక్కడ మేము అందమైన శుభాకాంక్షలు ఇచ్చాము.

వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు
వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు (Pixabay)

ప్రేమికుల రోజున ప్రేయసి ప్రియులు తమ ప్రేమ, ఆప్యాయతను వ్యక్తపరచడానికి ఆశగా ఎదురు చూస్తారు. వాలెంటైన్స్ డే రోజు తన ప్రేమనంతా మాటల రూపంలోకి మార్చి సందేశాలుగా పంపిస్తారు. మీ భాగస్వామికి కూడా మీరు హృదయాన్ని హత్తుకునేలా వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే... ఇక్కడ మేము మీకు ఎంతో నచ్చే కోట్స్ ను అందించాము. ఈ ప్రేమ కవితలు, శుభాకాంక్షలు మీ ప్రేయసికి లేదా ప్రియునికి పంపండి. వారు కచ్చితంగా మీకు దాసోహం అయిపోతారు. మీ ప్రేమకు బందీలుగా మారుతారు.

వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు

1. క్షమించినంత సులభం కాదు మరిచిపోవడం

నా ప్రాణమే నువ్వైతే ఎలా మరిచిపోతాను

ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు

2. నువ్వు లేని ప్రతిరోజూ

నేను నా జీవితాన్ని వదిలేసుకున్న రోజే అవుతుంది

ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు మై లవ్

3. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు

మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ

ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు

4. నిద్రపోవడానికి ముందు నా చివరి ఆలోచన నువ్వే

నిద్ర లేచాక నా మొదటి ఆలోచన నువ్వే

హ్యాపీ వాలెంటైన్స్ డే

5. మారుతున్నది సంవత్సరమే మన ప్రేమ కాదు

ప్రతి కొత్త ఏడాదిలో కొత్త రంగులతో కొత్త ఆశలతో

సరికొత్త ఆనందాలని మనకు మన ప్రేమ పంచుతూనే ఉంది

హ్యాపీ వాలెంటైన్స్ డే

6. ఎదలో ప్రేమ ఉంటే నిన్ను మరువగలను

నీ ప్రేమ నా హృదయమైతే ఎలా మర్చిపోను

హ్యాపీ వాలెంటైన్స్ డే

7. నీ హృదయం లోతుల్లో

నా ప్రేమ ఎల్లప్పుడూ నిండే ఉంటుంది

ప్రతిక్షణం నన్ను నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది

హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్

8. ప్రేమ మీద నమ్మకం లేని నాకు

అసలైన ప్రేమంటే ఏమిటో రుచి చూపించావు

హ్యాపీ వాలెంటైన్స్ డే

9. అప్పుడెప్పుడో అల్లుకున్న బంధం మనది

ఎప్పటికీ చెదరదు చెరగదు

మురెపంగా పంచుకున్న ప్రేమ మనది

ఎన్నటికీ కరగదు తరగదు

హ్యాపీ వాలెంటైన్స్ డే

10. నా ప్రేమను చెప్పడానికి

ఒక్క నిమిషం చాలు కానీ

ఆ ప్రేమను చూపడానికి ఒక జీవితం సరిపోదు

ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు

11. నీవు లేని నిన్న నాకు శూన్యం

నీవు రాని రేపు నాకు ఒక నరకం

నీవు లేని నిన్నను ఊహించలేను

నీవు రాని రేపును కోరుకోలేను

నీతో ఉన్న ఈ క్షణాలే నాకు స్వర్గం

హ్యాపీ వాలెంటైన్స్ డే

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం