హనుమాన్ జయంతి 2025కి మీ బంధుమిత్రులకు ఇలా భక్తితో నిండిన విషెస్‌‌ను తెలుగులో పంపండి-send these devotional wishes in telugu to your relatives and friends on hanuman jayanti 2025 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  హనుమాన్ జయంతి 2025కి మీ బంధుమిత్రులకు ఇలా భక్తితో నిండిన విషెస్‌‌ను తెలుగులో పంపండి

హనుమాన్ జయంతి 2025కి మీ బంధుమిత్రులకు ఇలా భక్తితో నిండిన విషెస్‌‌ను తెలుగులో పంపండి

Haritha Chappa HT Telugu

హనుమాన్ జయంతికి మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ మేము తెలుగులో శుభాకాంక్షలు ఇచ్చాము. ఇవి అన్నీ భక్తితో నిండినవి.

హానుమాన్ జయంతి విషెస్ తెలుగులో (Pexels)

హనుమాన్ జయంతి పండుగ ప్రతి ఏడాది చైత్రమాసం పౌర్ణమి రోజున నిర్వహించుకుంటాం ఈసారి హనుమాన్ జయంతి ఏప్రిల్ 12న వచ్చింది భగవాన్ శ్రీ రాముని భక్తుడైన హనుమాన్ పుట్టిన దినం ఇది ఈరోజున హనుమంతుని ఆశీస్సులు అందరికీ దక్కాలని కోరుకుందాం మీ కుటుంబం స్నేహితులు ప్రియమైన వారికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు పంపండి

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుగులో

1. హనుమంతుడు

మీకు ఆనందం, శాంతి, శ్రేయస్సు ఇవ్వాలని

ఆయన ఆశీస్సులతో

మీరు ప్రతిరోజూ శుభప్రదంగా ఉండాలని

కోరుకుంటూ

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

2. హనుమంతుని ఆశీస్సులతో

మీ జీవితంలో సంపద రావాలని

సంతోషం నిండాలని

ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటూ

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

3. హనుమాన్ నామాన్ని జపిస్తే బాధలు తొలగిపోతాయి,

దెయ్యాలు, భూతాలు దరికే రావు

మీకు మీ కుటుంబ సభ్యులకు

హానుమాన్ జయంతి శుభాకాంక్షలు

4. జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి

హనుమంతుడు మీకు బలాన్ని

విశ్వాసాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా

హనుమాన్ జయంతి సందర్భంగా

మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

5. ఓ అంజనీ కుమారుడా అన్ని కష్టాలను నాశనం చేస్తావు

రాముని నామము జపిస్తే చాలు అన్ని పాపాలు క్షమిస్తావు

నిన్ను భక్తితో పూజించిన వారు ఎప్పటికీ ఓడిపోరు

మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

6. బజరంగబలి అందరికీ మంచి చేస్తాడు,

అన్ని కష్టాలను తొలగిస్తాడు,

ఎవరైతే తన పాదాల వద్దకు వచ్చి ఆశ్రయం పొందుతారో,

వారికి ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

7. హనుమాన్ అందరికీ మంచి చేస్తాడు,

అన్ని కష్టాలను తొలగిస్తాడు,

ఎవరైతే తన పాదాల వద్దకు వచ్చి ఆశ్రయం పొందుతారో,

వారికి ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

8. రాముని భక్తుడు,

అంజనీ కుమారుడు,

పవన కుమారుడు

హనుమంతుడి పుట్టినరోజు వచ్చేసింది.

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

9. ఎవరైతే హనుమంతుని నామాన్ని స్మరిస్తారో,

వారి జీవితంలో దుఃఖం ఉండదు.

ఈ పవిత్ర పండుగ సందర్భంగా

హనుమంతుడి ప్రత్యేక ఆశీస్సులు మీకు లభిస్తాయి.

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

10. హనుమంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండుగాక,

మీ కష్టాలన్నీ పరిష్కారమై,

మీ జీవితంలో ఆనందం వెల్లివిరియాలి.

జై హనుమాన్!

11. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం

దనుజవన క్రుశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్

సకల గుణనిధానం వానరాణా మదీశం

రఘుపతి ప్రియభక్తం వాతజాతం నామామి

మీకు మీ కుటుంబ సభ్యులకు

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

12. శ్రీరామ దూత మహా ధీర

రుద్ర వీర్య సముద్భవ

అంజనా గర్భసంభూతే

వాయుపుత్రా నమోస్తుతే

మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

13. మనోజనం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్

వాతాత్మజం వానరయూధ ముఖ్యం

శ్రీరామదూతం శిరసా నమామి

మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

14. ప్రతి ఒక్కరికీ ఆంజనేయుడు

ఆరోగ్యం, సంపద, సంతోషంతో

నిండిన జీవితాన్ని అందించాలని

కోరుకుంటూ

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

15. హనుమంతుడు శక్తి

అసమాన భక్తి

నిస్వార్థ సేవకు ప్రతీక

అతను శ్రీ రామునికి అత్యంత గొప్ప భక్తుడు

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం