Valentines Day Wishes: మీరు ప్రేమించే వ్యక్తికి ఈ అందమైన ప్రేమ శుభాకాంక్షలు పంపించండి, వారి గుండె ఉప్పొంగిపోతుంది-send these beautiful love wishes to the person you love on valentines day in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Valentines Day Wishes: మీరు ప్రేమించే వ్యక్తికి ఈ అందమైన ప్రేమ శుభాకాంక్షలు పంపించండి, వారి గుండె ఉప్పొంగిపోతుంది

Valentines Day Wishes: మీరు ప్రేమించే వ్యక్తికి ఈ అందమైన ప్రేమ శుభాకాంక్షలు పంపించండి, వారి గుండె ఉప్పొంగిపోతుంది

Haritha Chappa HT Telugu
Published Feb 13, 2025 03:00 PM IST

Valentines Day Wishes: వాలెంటైన్స్ డే రోజు మీరు ప్రేమించిన వ్యక్తికి విషెస్ పంపేందుకు సిద్ధమవుతున్నారా? ఇక్కడ మేము కొన్ని అందమైన గుండెను టచ్ చేసే ప్రేమ కవితలను, శుభాకాంక్షలు అందించాము. వీటిని మెసేజ్‌ల రూపంలో పంపించేందుకు ప్రయత్నించండి.

వాలెంటైన్స్ డే విషెస్
వాలెంటైన్స్ డే విషెస్

సృష్టికి మూలం ప్రేమే. అందుకే ప్రేమికుల దినోత్సవం ఎంతో ప్రాధాన్యత ఉంది. మీ కాబోయే జీవిత భాగస్వామికి, ప్రేమికురాలికి, భార్యకు, భర్తకు, ప్రేమికుడికి... ఈ వాలెంటైన్స్ డే రోజు అందంగా ప్రేమతో విషెస్ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు పంపే హృదయపూర్వక శుభాకాంక్షలు వారిలో భావోద్వేగాలను పెంచుతాయి. అందమైన పదాలతో ఇక్కడ మేము కొన్ని ప్రేమ కవితలను, శుభాకాంక్షలు అందించాము. చాక్లెట్లు, గులాబీలు ఏదైనా అందమైన గిఫ్ట్ తో పాటు ఈ ప్రేమ కవితలు, శుభాకాంక్షలు కూడా మీ ప్రేమికులకు పంపించండి. వారు ఫిదా అయిపోవడం ఖాయం.

వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుగులో

1. నువ్వే నా ఈరోజు

నా రేపు, నా భవిష్యత్తు

ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు మై లవ్

2. నీతో గడిపిన ప్రతిక్షణం

ఒక అందమైన కల నిజమైనట్లే అనిపిస్తుంది

ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు

3. నువ్వు నా భాగస్వామివి మాత్రమే కాదు

నా జీవితానికే నిండుదనాన్ని ఇచ్చిన వ్యక్తివి

నువ్వు నాకు ఎంతో ప్రత్యేకం

జీవితాంతం నువ్వు నా వెంటే ఉండాలని కోరుకుంటున్నాను

హ్యాపీ వాలెంటైన్స్ డే

4. నువ్వు నా పక్కన ఉంటే

ప్రతిరోజూ ప్రేమికుల రోజులాగే అనిపిస్తుంది

నేను నిన్ను అనంతంగా ప్రేమిస్తున్నాను

హ్యాపీ వాలెంటైన్స్ డే

5. నా హృదయానికి రూపమైన నీకు

ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు

నువ్వే నా జీవితాన్ని పరిపూర్ణం చేశావు

6. నీతో ఉన్న ప్రతిరోజూ ఒక వరం

నీతో ఉన్న ప్రతిరోజూ వాలెంటైన్స్ డే

నువ్వు నాకు ఎంత ముఖ్యమో చెప్పేందుకే

ప్రేమికుల దినోత్సవం వచ్చింది

హ్యాపీ వాలెంటైన్స్ డే ప్రియతమా

7. నువ్వే నా హృదయం

నా సర్వసం

నా జీవితంలోని విజయం

హ్యాపీ వాలెంటైన్స్ డే

8. నిన్ను కలిసిన క్షణం నుండే

నా జీవితం అద్భుతంగా మారిపోయింది

నా సర్వస్వం నువ్వే అయినందుకు ధన్యవాదాలు

హ్యాపీ వాలెంటైన్స్ డే

9. నా ఆత్మ సహచరుడికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు

నా జీవిత ప్రయాణాన్ని నువ్వు

మరింత అందంగా మారుస్తావని ఆశిస్తున్నాను

హ్యాపీ వాలెంటైన్స్ డే

10. నువ్వు నా ప్రపంచాన్ని ప్రకాశవంతం చేశావు

నా హృదయాన్ని ఒప్పించేలా చేశావు

నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తివి

ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రియతమా

11. నా జీవితంలో నువ్వు ఉండడం ఒక అదృష్టం

ప్రేమ నవ్వులతో నిండిన జీవితాన్ని

ఇచ్చినందుకు నేను ఎప్పుడు నీకు కృతజ్ఞతుడినే

ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు

12. నిన్ను చూసిన ప్రతిసారీ

నా గుండె వేగంగా కొట్టుకుంటుంది

నువ్వే నా ప్రపంచంగా మారిపోయావు

ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు

13.నువ్వు నా జీవితాన్ని ప్రేమతో ఆనందంతో నింపావు

నువ్వు లేని రోజును ఊహించుకోలేను

ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు

14. నా జీవిత కథలో నువ్వే నాకు అత్యంత ఇష్టమైన అధ్యాయం

ప్రేమ, ఆనందంతో నా జీవితాన్ని నింపిన నీకు

వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు

15. ప్రేమ అనేది ప్రయాణం అయితే

నేను నీతో ప్రయాణిస్తూ ఉన్నంతకాలం గమ్యాన్ని చేరుకోకూడదని కోరుకుంటాను

అలా అయితే నీతో పాటే జీవితాంతం ఉండిపోవచ్చు

ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం