New Year Wishes 2025: హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలుగులోనే మీ ప్రియమైన స్నేహితులకు, బంధువులకు పంపించండి-send happy new year wishes in telugu to your dear friends and relatives ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Year Wishes 2025: హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలుగులోనే మీ ప్రియమైన స్నేహితులకు, బంధువులకు పంపించండి

New Year Wishes 2025: హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ తెలుగులోనే మీ ప్రియమైన స్నేహితులకు, బంధువులకు పంపించండి

Haritha Chappa HT Telugu
Jan 01, 2025 05:30 AM IST

New Year Wishes 2025: కొత్త ఏడాదికి మీ బంధువులకు, స్నేహితులకు విషెస్ పంపాలనుకుంటున్నారా? అయితే మీకు ఇక్కడ ఇచ్చిన కొన్ని మెసేజుల్లో నచ్చిన దాన్ని ఎంపిక చేసుకుని ప్రియమైనవారికి పంపించండి.

కొత్త ఏడాది శుభాకాంక్షలు
కొత్త ఏడాది శుభాకాంక్షలు (Pixabay)

కొత్త ఏడాది 2025 వచ్చేసింది, పాత ఏడాది 2024కి వీడ్కోలు చెప్పేశాం. కొత్త ఏడాది ఆనందంగా సాగాలంటే మీకు నచ్చిన వారి నుంచి మీరు హ్యాపీ న్యూ ఇయర్ సందేశాలను అందుకునే ఉంటారు. అలాగే మీరు కూడా మీ బంధువులకు, స్నేహితులకు హ్యాపీ న్యూ ఇయర్ సందేశాలను తెలుగులోనే పంపాలి. ఇక్కడ మేము కొన్ని అందమైన సందేశాలను ఇచ్చాము. మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకుని వాటిని వాట్సాప్, మెసేజులు, సోషల్ మీడియాలో పంపండి.

yearly horoscope entry point

హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుగులో

1. కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో

ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ

కొత్త ఏడాదిలో మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ

హ్యాపీ న్యూ ఇయర్

2. కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో

అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుతూ

కొత్త ఏడాది శుభాకాంక్షలు

3. ఎన్నో ఆశలను మోసుకువస్తున్న

కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ

మీకు మీ కుటుంభసభ్యులకు

హ్యాపీ న్యూ ఇయర్

4. సంబరాలు మిన్నంటే వేళ

నింగి నేల కాంతుల హేళ

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

5. కష్టాలెన్నైనా సరే రానీ

సవాళ్లైన్నెనా సరే ఎదురవనీ

కలిసి నిలుద్దాం, గెలుద్దాం

ఈ ఏడాదికి విజయాలను అందించాలని

కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్

6. పువ్వులతో నిండిన తోట

ఎంత అందంగా ఉంటుందో

మీ అందరి మనసులు

మంచి ఆలోచనలతో నిండి

ఆనందంగా ఉండాలని కోరుకుతూ

హ్యాపీ న్యూ ఇయర్

7. మనం కొత్త సంవత్సరాన్ని

స్వాగతిస్తున్నప్పుడు, గత ఏడాదిలో

మనం పంచుకున్న క్షణాలను గుర్తు చేసుకుందాం

హ్యాపీ న్యూ ఇయర్

8. కొత్త ఏడాది మీకు

ప్రేమ, నవ్వు, మరపురాని క్షణాలను

ఇవ్వాలని కోరుకుంటూ

హ్యాపీ న్యూ ఇయర్

9. స్నేహానికి, నవ్వుకు, జ్ఞాపకాలు పోగేసుకోవడానికి

మరో ఏడాది వచ్చేసింది

అందరం కలిసి 2025ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దుదాం.

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

10. మీ స్నేహం నాకు వరం,

మీరు నా పక్కన ఉన్నందుకు నేను అదృష్టవంతుడిని

అందరం కలిసి 2025ను జయిద్దాం.

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

11. నువ్వు నా ప్రపంచాన్ని ప్రకాశవంతం చేశావు,

నువ్వు నా పక్కన ఉండటం నా అదృష్టం

2025లో మన ప్రేమ, అంతులేని ఆనందం రెట్టింపు అవ్వాలని

కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

12. 2025లో కొత్త ఆరంభాలు, కొత్త అవకాశాలు..

మనం కలిసికట్టుగా పనిచేసి గొప్ప విజయాలు సాధిద్దాం.

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

13. కొత్త సంవత్సరం మీ జీవితంలో సంతోషం, శాంతి

శ్రేయస్సును తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ

2025ను గుర్తుంచుకునే ఏడాదిగా మార్చుకుందాం

14. మనం 2025లోకి అడుగుపెడుతున్నప్పుడు,

నిరాశను వదిలివేసి,

ఆశ, ధైర్యంతో కొత్త ఏడాదిని మొదలుపెడదాం

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

15. పెద్ద కలలు కనండి, సానుకూలంగా ఉండండి

మిమ్మల్ని మీరు నమ్మండి

మీకు 2025 అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను.

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

16. 2025లో 365 రోజుల కొత్త సంవత్సరపు పేజీ తెరుచుకుంది

ఈ పేజీలలో మంచిని రాసే, సంతోషంగా జీవించే,

మంచిని కోరుకునే సుఖదుఃఖాలను

పంచుకునే ప్రియమైన మిత్రులకు

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

17. 2025 మీకు అన్ని సంతోషాలు,

విజయాలను తీసుకురావాలని,

విజయం మీ సొంతం కావాలని,

ఆనందం మీ జీవితంలో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను.

హ్యాపీ న్యూ ఇయర్

Whats_app_banner