Ratha Saptami Wishes: రథ సప్తమికి సూర్య భగవానుడి ఆశీస్సులు అందాలని మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు పంపండి
Ratha Sapthami Wishes: రథ సప్తమినాడు సూర్య భగవానుడి ఆశీస్సులు పొందేందుకు ప్రతి ఒక్కరూ పూజ చేస్తారు. రథసప్తమి నాడు మీ బంధుమిత్రులకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి.
రథసప్తమి హిందువులకు ముఖ్యమైన పండుగ. ప్రత్యక్ష దైవం సూర్యుడిని ప్రతిరోజూ పూజిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మాఘమాసం శుక్షపక్షంోల వచ్చే సప్తమి తిథిని రథ సప్తమి అంటారు. ఈరోజే సూర్య భగవానుడి జన్మదినం. చలికాలం వదిలి వేసవి కాలం ఆరంభానికి రథ సప్తమి మొదటి దినంగా మారుతుంది. వేదకాలం నుంచే సూర్యారాధన చేసే ఆచారం ఉండేది. ముల్లోక దేవతల్లో కనిపించే దేవుడు సూర్యుడే. నవగ్రహాల్లో ప్రథముడు కూడా సూర్యుడే. ఆయన జీవకోటికి శుభాలను అందించే దేవుడు. సూర్యుడు జన్మతిధి సందర్భంగా అరసవిల్లి, కోణార్క్ దేవాలయాల్లో వైభవంగా పూజలు జరుగుతాయి. రథసప్తమినాడు ఇంటి ముందు రథం ముగ్గు వేయాలని చెబుతారు. ముగ్గుపైన మట్టి పొయ్యిపై గిన్నె పెట్టి పాలు పొంగిస్తారు. సూర్యుడిని గోధుమలతో చేసిన తీసి పాయసాన్ని వండి నైవేద్యంగా అర్పిస్తారు. ఈ పండుగకు రథ సప్తమి శుభకాంక్షలు బంధువులు, స్నేహితులకు చెప్పండి. ఇక్కడ మేము తెలుగులో రథ సప్తమి శుభాకాంక్షలు ఇచ్చాము. వీటిని మెసేజులు, వాట్సాప్, ఫేస్ బుక్ లలో షేర్ చేయండి.

రథసప్తమి శుభకాంక్షలు తెలుగులో
1. నమ: సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే
ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహిదేవ: జగత్పతే
మీకు మీకుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు
2. సప్తాశ్వరథమారూఢం
ప్రపంచం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరం దేవం తం
సూర్యం ప్రణమామ్యహమ్
రథసప్తమి శుభాకాంక్షలు
3. శ్రీ సూర్య భగవానుడు మీకు, మీ కుటుంబసభ్యులకు
ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ
మీకు రథసప్తమి శుభాకాంక్షలు
4. సూర్యుని కాంతి వలే మీ జీవితంలో కొత్త వెలుగులు
నిండాలని మనసారా ఆకాంక్షిస్తూ
మీకు మీ కుటుంబసభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు
5. ప్రకాశించే సూర్యుడు మీ జీవితాన్ని ఆనందం
శ్రేయస్సు, సంతోషంతో నింపాలని కోరుకుంటూ
రథసప్తమి శుభాకాంక్షలు
6. సూర్యుని మకర సంక్రమణంతో కొత్త వెలుగులు
లోగిళ్లలో ముగ్గులు... పచ్చని పాడి పంటలు
పండుగ వేళ ప్రతి కుటుంబానికి కలగాలి సుఖశాంతులు
రథ సప్తమి శుభాకాంక్షలు
7. జగత్తుకు వెలుగునిచ్చే సూర్య భగవానుడు
మీ జీవితాలలో కూడా వెలుగులు నింపి
ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు
8. సూర్యభగవానుడి దయతో మీ ఇల్లు, జీవితం
ఆనందంతో, శాంతితో నిండాలని కోరుకుంటూ
రథసప్తమి శుభాకాంక్షలు
9. రథ సప్తమి ఆవ, కొత్త ప్రారంభాలు, విజయాన్ని ఇచ్చే రోజు
సూర్య భగవానుడు తన దయను మీపై చూపించాలని కోరుకుంటూ
రథసప్తమి శుభాకాంక్షలు
10. అన్ని అడ్డంకులను అధిగమించి మీ లక్ష్యాలను
చేరుకునే శక్తిని సూర్యభగవానుడు ఇవ్వాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలు