Top 10 Krishna temples: జన్మాష్టమి వేడుకలు అంబరాన్నంటే 10 ప్రముఖ కృష్ణాలయాలు, ఒక్కసారైనా దర్శించండి
Top 10 Krishna temples: గోకులాష్టమి లేదా కృష్ణాష్టమి వేడుకలు ఈ 10 ప్రముఖ కృష్ణ ఆలయాలు ప్రసిద్ది చెందాయి. వాటిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సందే. అవి మన దేశంలో ఎక్కడెక్కడున్నాయో, వాటి విశిష్టతలేంటో చూడండి.
గోకులాష్టమి, కృష్ణాష్టమి అని కూడా పిలువబడే జన్మాష్టమి పండుగను భక్తులు ఈ సంవత్సరం ఆగస్టు 26 సోమవారం న జరుపుకుంటారు. తర్వాతి రోజు అంటే ఆగస్టు 27 మంగళవారం కొన్ని ప్రాంతాల్లో దహీ హండీ జరుపుకుంటారు. మన దేశంలో కొన్ని ప్రముఖ కృష్ణాలయాలున్నాయి. వాటిని జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే.
1. శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం, మథుర, ఉత్తర ప్రదేశ్:
కృష్ణుని జన్మస్థలంగా పిలువబడే మథురలోని ఈ ఆలయం తప్పక సందర్శించవలసినది. ముఖ్యంగా జన్మాష్టమి సమయంలో, ఈ నగరం మొత్తం వేడుకలతో అలరాడుతూ ఉంటుంది.
2. గుజరాత్ లోని ద్వారకాధీష్ ఆలయం, ద్వారక:
కృష్ణుడి ప్రముఖ క్షేత్రాలలో ఒకటిగా పిలవబడే ఈ ఆలయం పవిత్ర చార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి.
3. బంకే బిహారీ ఆలయం, బృందావన్, ఉత్తరప్రదేశ్
ఈ ఆలయం బృందావనంలోని ఒక ప్రసిద్ధ ఆలయం. ఇక్కడ కృష్ణుడిని "బంకే బిహారీ" గా ఆరాధిస్తారు. ఈ ఆలయం దాని ప్రత్యేక దర్శన విధానాలకు ప్రసిద్ది చెందింది.
4. ఇస్కాన్ టెంపుల్, బెంగళూరు, కర్ణాటక:
ప్రపంచంలోని అతిపెద్ద ఇస్కాన్ దేవాలయాలలో ఒకటైన బెంగళూరు ఆలయం కీర్తనలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రాండ్ జన్మాష్టమి వేడుకలకు కేంద్రంగా ఉంది.
5. గురువాయూర్ ఆలయం, కేరళ:
"దక్షిణాది ద్వారక"గా పిలువబడే ఈ ఆలయం కృష్ణుడిని గురువాయూరప్పన్ గా ఆరాధించే ఒక ప్రధాన పుణ్యక్షేత్రం. ఇక్కడ శ్రీ కృష్ణుని పుట్టిన రోజు ప్రత్యేక వేడుకలు జరుగుతాయి.
6. ప్రేమ్ మందిర్, బృందావన్, ఉత్తర్ ప్రదేశ్:
బృందావనంలో కొత్తగా నిర్మించిన అద్భుతమైన ఆలయం ఇది. ప్రేమ్ మందిర్ దైవిక ప్రేమకు చిహ్నం. జన్మాష్టమి సమయంలో అందంగా అలంకరిస్తారు. అనేక వేడుకలు చేస్తారిక్కడ.
7. పూరీ జగన్నాథ ఆలయం, ఒడిశా:
ప్రధానంగా జగన్నాథుడికి అంకితం చేసిన ఆలయం. అయినప్పటికీ ఈ ఆలయంలో కృష్ణ భక్తులకు, ముఖ్యంగా జన్మాష్టమి వంటి పండుగల సమయంలో కూడా ప్రత్యేక వేడుకలు, సాంప్రాదాలయను జరుపుతారు.
8. ఉడిపి శ్రీ కృష్ణ మఠం, కర్ణాటక
ఉడిపిలోని ఈ ఆలయం కృష్ణ విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఇది ఆభరణాలతో అలంకరించి ఉంటుంది. గొప్ప సాధువు మాధవాచార్య చేత ఇది స్థాపించబడిందని నమ్ముతారు.
9. గోవింద్ దేవ్ జీ టెంపుల్, జైపూర్, రాజస్థాన్
సిటీ ప్యాలెస్ సముదాయంలో ఉన్న ఈ ఆలయం జైపూర్ లో ఒక ప్రధాన ఆకర్షణ. జన్మాష్టమి నాడు పెద్ద సంఖ్యలో జనసందోహం ఉంటుందిక్కడ.
10. నాథ్ద్వారాలోని శ్రీ నాథ్జీ ఆలయం, రాజస్థాన్:
ఈ ఆలయం శ్రీ నాథ్ జీకి అంకితం చేయబడింది. ఆయన కృష్ణుని అవతారమని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం విస్తృతమైన జన్మాష్టమి ఉత్సవాలకు ప్రసిద్ది చెందింది.
కృష్ణ జన్మాష్టమిని భారతదేశం అంతటా భక్తి, ఉత్సాహంతో జరుపుకుంటారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం, ఈ పండుగను భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలో ఎనిమిదవ రోజున జరుపుకుంటారు. ఇక్కడ ఈ దేవాలయాలు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించడమే కాకుండా భారతదేశం అంతటా జన్మాష్టమి వేడుకతో సంబంధం ఉన్న గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలను కూడా తెలియజేస్తాయి. అనేక దేవాలయాలు కృష్ణుడు పుట్టినప్పటి నుండి అతని జీవితాన్ని వర్ణించే ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాయి. భక్తులకు కృష్ణుడి జీవిత కథను అర్థం చేసుకోవడానికి, అతని పాఠాలు, బోధనల నుండి నేర్చుకోవడానికి సహాయపడతాయి.