Reliance jewels: రిలయన్స్ జ్యువెల్స్ నుంచి ప్రత్యేక ‘వరలక్ష్మి కలెక్షన్’ నగలు.. భారీ ఆఫర్లు, తగ్గింపులతో మీ ముందుకు-see reliance jewels latest vara lakshmi collection with huge offers and discounts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Reliance Jewels: రిలయన్స్ జ్యువెల్స్ నుంచి ప్రత్యేక ‘వరలక్ష్మి కలెక్షన్’ నగలు.. భారీ ఆఫర్లు, తగ్గింపులతో మీ ముందుకు

Reliance jewels: రిలయన్స్ జ్యువెల్స్ నుంచి ప్రత్యేక ‘వరలక్ష్మి కలెక్షన్’ నగలు.. భారీ ఆఫర్లు, తగ్గింపులతో మీ ముందుకు

Koutik Pranaya Sree HT Telugu
Aug 10, 2024 07:02 PM IST

Reliance jewels: రిలయన్స్ జ్యువెల్స్ నుంచి ప్రత్యేక ‘వరలక్ష్మి కలెక్షన్’ కస్టమర్ల కోసం తీసుకొచ్చారు. వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం సందర్భంగా మహిళలందరి మనసు దోచుకోడానికి ఆశ్చర్యపరిచే డిజైన్లు, ఆఫర్లతో రిలయన్స్ జ్యువెల్స్ మీ ముందుకొచ్చింది.

రిలయన్స్ జ్యువెల్స్
రిలయన్స్ జ్యువెల్స్

భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన జ్యువెలరీ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తుకు వచ్చేది రిలయన్స్ జ్యువెల్స్. నమ్మకానికి ప్రతీకగా నిలిచే రిలయన్స్ జ్యువెల్స్... శ్రావణమాస శుభ సందర్భాన వరలక్ష్మి కలెక్షన్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

దక్షిణాదిలో వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. లక్ష్మీ దేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ శుభ శ్రావణంలో... ఈ పండుగ సమయం ప్రతీ ఒక్కరికీ శుభాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటోంది రిలయన్స్ జ్యువెల్స్.

ఆభరణాల విషయంలో సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తుంది రిలయన్స్ జ్యువెల్స్. అందుకే ఆభరణాలకు సంప్రదాయ సొబగులద్దేలా సరికొత్త కలెక్షన్ ను రూపొందించింది. దీనిద్వారా ప్రతీ ప్రాంతంలో జరిగే శుభకార్యాలను రిలయన్స్ జ్యువెల్స్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని మరోసారి నిరూపితం అయ్యింది. ఈ ఏడాది ప్రారంభించిన వరలక్ష్మి కలెక్షన్ యొక్క ట్యాగ్ లైన్ కూడా అదే సారాంశాన్ని అందిస్తుంది.

'మీలోని దేవత యొక్క ఆశీర్వాదాన్ని అందుకోండి అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ వరలక్ష్మి కలెక్షన్... సంక్లిష్టమైన డిజైన్‌ లతో వస్తాయి. అంతేకాకుండా శక్తివంతమైన రంగులకు ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ భారతీయ కళారూపమైన కలంకారి యొక్క గొప్ప వారసత్వం నుండి ప్రేరణ పొందింది. ఈ కలెక్షన్ ద్వారా మహిళలు తమ ఆత్మాభిమానాన్ని మరియు బలాన్ని మరింత పెంపొందించుకోవాలని కోరుకుంటోంది. అంతేకాకుండా వరలక్ష్మి కలెక్షన్ తో ప్రతీ ఒక్కరూ ఈ పండుగకు లక్ష్మీ దేవిలా అలంకరించుకుని లక్ష్మీ దేవి యొక్క కరుణాకటాక్షాలు పొందాలని కోరుకుంటోంది.

వరలక్ష్మి కలెక్షన్ కు సంబంధించి మచిలీపట్నం, శ్రీకాళహస్తి మరియు దక్షిణ భారతదేశ కళాత్మక వారసత్వం యొక్క సారాంశానికి సంప్రదాయాన్ని జోడించి అనే రకాలు శైలులతో ఆభరణాలను రూపొందించారు. వినియోగదారులు బంగారు మరియు వజ్రాల ఆభరణాలు రెండింటిలోనూ అద్భుతమైన కలెక్షన్ ను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇక్కడ ఆభరణంలో ప్రతీ భాగాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దారు. కలెక్షన్ లో అద్భుతమైన సెట్లు, బ్యాంగిల్స్, నెక్‌ వేర్ ఉన్నాయి. కలెక్షన్ లో ని ప్రతి ఆభరణం రాళ్లు, పురాతన ఫినిషింగ్, ప్రకాశవంతమైన కెంపులు, పచ్చలు మరియు మెరిసే ముత్యాల మంత్రముగ్ధమైన మిశ్రమంతో అలంకరించబడి ఉన్నాయి. అన్నీ అధునాతనమైన డ్యూయల్ టోన్‌లలో ప్రదర్శించబడ్డాయి.

ఈ సందర్భంగా రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ గారు మాట్లాడారు. "మా వరలక్ష్మి కలెక్షన్ దక్షిణ భారతదేశంలోని సాంస్కృతిక గొప్పతనానికి మరియు కళాత్మక వారసత్వానికి ప్రతీక. ఈ కలెక్షన్ వరలక్ష్మి పండుగ యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ఇది మా కస్టమర్‌లకు వారి పండుగ వేడుకలకు మరింత ఆనందాన్ని అందిస్తుందని మేము నమ్ముతున్నాము” అని అన్నారు ఆయన.

తగ్గింపులు, ఆఫర్లు:

మహిళల యొక్క ఆకాంక్షలు మరియు కలలను సంపూర్ణంగా అర్థం చేసుకుంటుంది రిలయన్స్ జ్యువెల్స్. అందుకే దేశవ్యాప్తంగా రిలయన్స్ జ్యువెల్స్ ద్వారా అద్భుతమైన కలెక్షన్ ని వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉండేలా చూస్తుంది. ఈ విస్తృతమైన రీచ్ ద్వారా ప్రతీ ఒక్కరూ తమనకు నచ్చిన ఆభరణాలను షాపింగ్ చేయడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు ఈ పండుగ ఆనందాన్ని మరింత జోడించడానికి, బంగారం తయారీ ఛార్జీలు మరియు డైమండ్ విలువపై ఫ్లాట్ 17% తగ్గింపుని అందిస్తుంది. అంతేకాకుండా సెప్టెంబరు 2, 2024 లోపు రూ. 5 లక్షలు కంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి అదనంగా 5% తగ్గింపు లభిస్తుంది.

Whats_app_banner