Radhika's dupatta: ఆహా.. రాధిక మర్చంట్ వేసుకున్న తాజా మల్లెపూల దుపట్టా చూశారా? హల్దీ లుక్ అదిరింది-see radhika marchants real flower dupatta and haldi looks of bollywood celebs ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Radhika's Dupatta: ఆహా.. రాధిక మర్చంట్ వేసుకున్న తాజా మల్లెపూల దుపట్టా చూశారా? హల్దీ లుక్ అదిరింది

Radhika's dupatta: ఆహా.. రాధిక మర్చంట్ వేసుకున్న తాజా మల్లెపూల దుపట్టా చూశారా? హల్దీ లుక్ అదిరింది

Koutik Pranaya Sree HT Telugu
Jul 09, 2024 07:30 PM IST

Radhika's dupatta: రాధికా మర్చంట్ హల్దీ వేడుక లుక్ రియా కపూర్ డిజైన్ చేశారు. ఈ వేడుకలో రాధిక వేసుకున్న మల్లెపూల దుపట్టా అందరినీ ఆకర్షించింది.

పూల దుపట్టాలో రాధిక మర్చంట్
పూల దుపట్టాలో రాధిక మర్చంట్

సోమవారం జరిగిన అంబానీల హల్దీ వేడుకకు రాధికా మర్చంట్ పూర్తిగా పుసుపు రంగు దుస్తుల్లో కనిపించారు. ఈ లుక్ కు సంబంధించిన ఫోటోలను స్టైలిస్ట్ రియా కపూర్ షేర్ చేశారు. అనామిక ఖన్నా డిజైన్ చేసిన షరారాపై రాధిక మర్చంట్ అసలైన మల్లెపూలతో చేసిన దుపట్టా వేసుకున్నారు. బంతిపూల వరస మధ్యలో మల్లెపూలతో అల్లిన నెట్ లాగా ఉంది ఆ దుపట్టా. హల్దీ వేడుకకు ఆర్టిఫిషియల్ పూల జ్యువెలరీ వేసుకోవడం సాధారణంగా చూసే ఉంటాం కానీ, అసలైన పూల దుపట్టా వేసుకుని ట్రెండ్ సెట్ చేశారు రాధిక. పూలతో చేసిన అల్లికలనే ఆభరణాలుగా వేసుకున్నారామె. మెడలో చోకర్, హారం, చేతులకు ఆభరణాలు అన్నీ పూలను తలపించేవే.

కరీనా కపూర్ ఈ లుక్ ను ది బెస్ట్ అన్నారు. ఇతర సెలెబ్రిటీలు కూడా ఈ లుక్ గురించి కామెంట్లు చేశారు. ఆ లుక్ సంబంధించిన ఫోటోలు చూడండి.

హల్దీ వేడుక:

అంబానీ కుటుంబం తమ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లకు సోమవారం సాయంత్రం ముంబైలోని తమ ఇల్లు ఆంటిలియాలో హల్దీ వేడుకను నిర్వహించింది. సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్, మానుషి చిల్లర్, జాన్వీ కపూర్, అనన్య పాండే, సారా అలీఖాన్ తో పాటూ చాలా మంది సెలెబ్రిటీలు, ప్రముఖులు హాజరయ్యారు.

ఎవరు ఏ లుక్ లో ఉన్నారు?

హల్దీ వేడుక కోసం సారా అలీఖాన్ రంగురంగుల లెహంగా సెట్ ను ఎంచుకున్నారు. భుజం మీద దుపట్టా ధరించి ఆమె తన లుక్ ను పూర్తి చేసింది. ఎంబ్రాయిడరీ చేసిన పొట్లి బ్యాగ్, చోకర్ నెక్లెస్, ఉంగరాలతో సారా లుక్ పూర్తి చేసింది. ఆ ఫొటోను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.

ఈ వేడుక కోసం అనన్య పాండే పింక్ కలర్ అనార్కలి సూట్ ను ఎంచుకుంది. తన అద్భుతమైన వస్త్రధారణతో పాటు అలంకరించిన జూతీలు, బంగారు బ్రాస్ లెట్ లు, స్టేట్ మెంట్ రింగ్ లు, మాంగ్ టికా, జుమ్కాలను ధరించింది. ఈ వేడుకలో ఓరీ, షానయా కపూర్, ఖుషీ కపూర్ లతో కలిసి దిగిన ఫోటోలను అనన్య షేర్ చేసింది.

హల్దీ ఫంక్షన్ లో జాన్వీ సంప్రదాయ పసుపు రంగు చీరను ధరించింది. పసుపు రంగు కుర్తా, నలుపు పైజామా ధరించిన సల్మాన్ ఖాన్ కూడా తమదైన శైలిలో వచ్చి త్వరలో పెళ్లి చేసుకోబోయే జంటకు ఆశీస్సులు అందించారు.

అంతకు ముందు అనంత్, రాధిక గృహ శాంతి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందమైన ఆభరణాలతో అలంకరించుకుని, తెలుపు బంగారు అంచు మేళవింపు ఉన్న చీరలో రాధిక, గోల్డెన్ జాకెట్ జత చేసిన ఎరుపు కుర్తాలో అనంత్ అదరగొట్టారు.

Whats_app_banner