Revange dressing: రివేంజ్ డ్రెస్సింగ్‌లో హార్దిక్ పాండ్యా మాజీ భార్య.. కారణం ఇదే
Revange dressing: హార్దిక్ పాండ్యా నుంచి విడిపోయిన కొద్ది రోజులకే నటాషా స్టాంకోవిచ్ తన ఆకుపచ్చ రంగు కార్సెట్ 'రివేంజ్ డ్రెస్'తో ట్రెండీ లుక్‌లో కనిపించింది. రివేంజ్ డ్రెస్సింగ్ అంటే ఏంటి? దాని వివరాలు తెల్సుకోండి.
క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడిపోయారనే సంగతి తెలిసిందే. బ్రేకప్ లేదా విడాకుల తర్వాత డిప్రెషన్‌తో బాధపడటం, ఆందోళనగా కనిపించడమే సాధారణం అనుకుంటాం. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఆనందంగా, ధైర్యంగా బయట వేడుకల్లో కనిపించినా అందరూ వాళ్లని జడ్జ్ చేస్తారు కూడా. నటాషా కూడా అందరిలాగా బాధలొ పడి కుమిలిపోకుండా రివేంజ్ డ్రెస్సింగ్‌తో ఇరగదీస్తోంది. హార్ధిక్ పాండ్యా నుంచి విడిపోయిన కొద్ది రోజులకే తన ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక స్టోరీలు పెడుతోంది. అదిరిపోయే మింట్ గ్రీన్ డ్రెస్సులో దిగిన ఫొటోలు కూడా అవే. తన బాధ మర్చిపోయి ముందుకు సాగడమే కాకుండా రెట్టింపు అందంతో మెరిసిపోతోంది కూడా. ఈ డ్రెస్ వివరాలు చూద్దాం.
నటాషా డ్రెస్ వివరాలు:
నటాషా మింట్ గ్రీన్ దుస్తులు రెనీ క్లాతింగ్ బ్రాండ్‌కు చెందినవి. వీటిని లగ్జరీ శాటిన్‌తో తయారు చేశారు. హాల్టర్ నెక్ ఈ డ్రెస్‌కు అధునాతన స్పర్శను ఇచ్చింది. బాడీకాన్ ఫిట్టింగ్ డ్రెస్ ఆమె శరీర సౌందర్యాన్ని పెంచుతోంది. బ్రాడ్ కార్సెట్ బెల్ట్, బ్యాక్ లెస్ డీటెలియింగ్ డ్రెస్ లుక్ మరింత పెంచేసింది.
గోల్డెన్ స్టేట్మెంట్ చెవిపోగులు, నలుపు సన్ గ్లాసెస్ ధరించి, గ్లామర్‌కు సరైన టచ్ జోడించి తన అందాల్ని ఆరబోసింది నటాషా. న్యూడ్ ఐషాడో, వింగ్డ్ ఐలైనర్, మస్కారా వేసిన కనురెప్పలు, బ్లష్‌తో ఎర్రబడిన బుగ్గలు, మెరిసే హైలైటర్, న్యూడ్ లిప్ స్టిక్ తో ఆమె మేకప్ లుక్ పూర్తయ్యింది.
రివెంజ్ డ్రెస్సింగ్ అంటే ఏమిటి?
రివెంజ్ డ్రెస్సింగ్ అనేది ఒక ఫ్యాషన్ విప్లవం అని చెప్పొచ్చు. ఎవరైనా, సాధారణంగా బ్రేకప్ లేదా విడాకుల తర్వాత స్టైలిష్, ఆకర్షణీయమైన దుస్తుల్లో బయట ధైర్యంగా అడుగుపెడితే దాన్ని రివేంజ్ డ్రెస్సింగ్ అంటారు. ప్రిన్స్ చార్లెస్ నుండి విడిపోయిన కొద్దికాలానికే ప్రిన్సెస్ డయానా ఒక బహిరంగ కార్యక్రమానికి అద్భుతమైన నలుపు రంగు దుస్తులు ధరించడంతో ఈ రివేంజ్ డ్రెస్సింగ్ ట్రెండ్ ప్రజాదరణ పొందింది. ఇది అప్పటి పరిస్థితికి ఆ వ్యక్తి ఇస్తున్న శక్తివంతమైన స్పందనగా కనిపిస్తుంది.
విడాకుల గురించి:
నటాసా స్టాంకోవిచ్, హార్దిక్ పాండ్యా 2020 మే నెలలో ఒక ప్రైవేట్ వేడుకగా వివాహం చేసుకున్నారు. తరువాత ఫిబ్రవరి 2023 లో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరిగాయి. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో తాను విడిపోయిన విషయాన్ని నటాషా గత నెలలో ధృవీకరించింది. నాలుగేళ్ల పాటు కలిసి జీవించిన తర్వాత తాను, నటాసా విడిపోయామని హార్దిక్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తెలిపాడు.