పంజాబీ స్టైల్ మ్యాంగో లస్సీ ఎలా చేయాలో చూడండి, రుచి సూపర్-see how to make punjabi style mango lassi the taste is super ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పంజాబీ స్టైల్ మ్యాంగో లస్సీ ఎలా చేయాలో చూడండి, రుచి సూపర్

పంజాబీ స్టైల్ మ్యాంగో లస్సీ ఎలా చేయాలో చూడండి, రుచి సూపర్

Haritha Chappa HT Telugu

పంజాబీ స్టైల్ లో మ్యాంగో లస్సీ తాగి చూడండి. ఎండల్లో బయట నుంచి వచ్చిన వారికి ఇది ఎంతో శక్తిని ఇస్తుంది. వేసవిలోనే మామిడి పండ్లు అధికంగా దొరుకుతాయి. అధికంగా రసాలు వచ్చే పండ్లను ఎంపిక చేసుకుని ఇలా లస్పీ చేసి చూడండి టేస్టీగా ఉంటుంది.

మ్యాంగో లస్సీ రెసిపీ

లస్సీ అనేది మందపాటి పెరుగుతో చేసిన వంటకం. ఈ వేసవిలో మీరు చల్లబరచాల్సిన పానీయాలలో ఒకటి. లస్సీలో ఒక ప్రత్యేకమైన లస్సీ ఉంటే అది పంజాబీ లస్సీ. ఇది మామిడి పండ్లతో తయారు చేసినప్పుడు మరింత రుచిగా ఉంటుంది మరియు మీ నాలుకకు కూడా ట్రీట్ గా ఉంటుంది. ఈ అధిక రుచిగల మామిడి లస్సీని ఎలా తయారు చేయాలో చూడండి. ఇక్కడ ఇచ్చిన పద్ధతుల్లో చేస్తే ఇది మరింత రుచికరంగా ఉంటుంది. ఈ లస్సీని మీరు రుచి చూసిన తర్వాత, ఇది చాలా రుచికరంగా ఉంది, మీరు దీనిని మళ్లీ కోరుకుంటారు. ఆ రెసిపీ ఇదిగో..

మ్యాంగో లస్సీ రెసిపీకి కావల్సిన పదార్థాలు

మామిడి పండు - రెండు

పెరుగు - ఒక కప్పు

పాలు - అర కప్పు

పంచదార - నాలుగు స్పూన్లు

యాలకుల పొడి - అర స్పూను

ఐస్ క్యూబ్స్ - మూడు

డ్రై ఫ్రూట్స్ - గుప్పెడు

కుంకుమపువ్వు రేకలు - రెండు

మ్యాంగో లస్సీ రెసిపీ

  1. మామిడి పండ్లు తొక్క తీసి ముక్కలుగా కోసి మిక్సీ జార్ లో వేసి పెరుగు, పంచదార వేసి యాలకుల పొడి కూడా వేసి రుబ్బుకోవాలి.

2. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి. దీనివల్ల లస్సీ చల్లగా అవుతుంది. ఎంత ఎక్కువగా గ్రైండ్ చేస్తే అది అంత క్రీమీ ఆకృతిని ఇస్తుంది.

3. కావాలనుకుంటే ఎక్కువ పంచదార, పాలు వేసుకోవచ్చు. పెరుగు వేస్తే లస్సీ చిక్కగా వస్తుంది. పాలు వేస్తే పలుచగా వస్తుంది.

4. తర్వాత గ్లాసులో మిక్సీ జార్లోని మిశ్రమాన్ని పోసి పైన జీడిపప్పు, బాదం, పిస్తాలను తురిమి వేయాలి. అలాగే కుంకుమపువ్వు చల్లుకోవచ్చు.

5. అంటే టేస్టీ పంజాబీ స్టైల్ మ్యాంగో లస్సీ సిద్ధమైనట్టే. దీన్ని తాగితే శరీరానికి శక్తి అందుతుంది.

ఈ సూపర్ టేస్టీ పంజాబీ స్టైల్ లస్సీని మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ మామిడి సీజన్ లో తయారుచేస్తే మీ ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి రుచి చూసిన తర్వాత మళ్లీ కావాలంటారు. ఈ మామిడి లస్సీని తయారు చేసి ఈ సమ్మర్ లో ఎంజాయ్ చేయండి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.