Beard Men: కొందరు పురుషులు గడ్డం ఎందుకు పెంచుకోవాలనుకుంటారో ఆశ్చర్యమైన కారణాలు చెప్పిన శాస్త్రవేత్తలు-scientists have revealed surprising reasons why some men want to grow a beard ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beard Men: కొందరు పురుషులు గడ్డం ఎందుకు పెంచుకోవాలనుకుంటారో ఆశ్చర్యమైన కారణాలు చెప్పిన శాస్త్రవేత్తలు

Beard Men: కొందరు పురుషులు గడ్డం ఎందుకు పెంచుకోవాలనుకుంటారో ఆశ్చర్యమైన కారణాలు చెప్పిన శాస్త్రవేత్తలు

Haritha Chappa HT Telugu
Aug 07, 2024 12:30 PM IST

Beard Men: కొందరు మగవారు క్లీన్ షేవ్ చేసుకుంటారు. కొందరు మాత్రం గడ్డాలు, మీసాలు పెంచుకుంటారు. ఇలా కొందరు మగవారు గడ్డాలు ఎందుకు పెంచుకోవాలనుకుంటున్నారో శాస్త్రవేత్తలు కొన్ని కారణాలను వెల్లడించారు.

పురుషులు గడ్డం ఎందుకు పెంచుకుంటారు?
పురుషులు గడ్డం ఎందుకు పెంచుకుంటారు? (Pixabay)

Beard Men: ఒక అధ్యయనంలో అమెరికాలో దాదాపు 33 శాతం మంది పురుషులు గడ్డాలు పెంచుకోవడానికి ఇష్టపడతారని సర్వే తేల్చింది. కేవలం అమెరికాలోనే కాదు చాలా దేశాల్లో కొందరు మగవారు గడ్డాలను పెంచుకునేందుకు ఇష్టత చూపిస్తారు. మరికొందరు మాత్రం క్లీన్ షేవ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇలా గడ్డాలు పెంచుకోవడం అనేది కొంతమందికి చిరాకు వ్యవహారంగా ఉంటుంది. చూడడానికి కూడా ముఖంపై వెంట్రుకలు అంత మంచిగా అనిపించదు. శాస్త్రవేత్తలు గడ్డాలు పెంచుకునే పురుషులు దాన్ని ఫ్యాషన్ ట్రెండ్ గా భావించి పెంచుకుంటున్నారా? లేక ఇంకేదైనా కారణం ఉందా? తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో ఒక ఆశ్చర్యమైన కారణాన్ని వారు కనుగొన్నారు.

గడ్డాలు ఉండే మగవారు స్పెషల్

పోలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సిలేసియా, అలాగే ఇటలీలోని విశ్వవిద్యాలయ పరిశోధకులు కలిసి ఈ పురుషులు గడ్డం పెంచుకోవడంపై పరిశోధన నిర్వహించారు. 18 ఏళ్ల నుంచి 40 లోపు ఉన్న 414 మంది పురుషులపై ఈ పరిశోధనలు చేశారు. వారిని అనేక రకాల ప్రశ్నలు అడిగారు. అందులో ఎక్కువ మంది పురుషులు గడ్డాలు ఉండడం వల్ల తాము మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుటివారికి కనిపిస్తామని అభిప్రాయపడ్డారు. అలాగే తాము ఆరోగ్యంగా ఉన్నట్టు కూడా గడ్డాల వల్ల అనిపిస్తుందని వారు చెప్పారు. అలాగే గడ్డాలు ఉన్న పురుషులు మంచి తండ్రులుగా గుర్తింపు పొందుతారని కూడా వారు అన్నారు. ఈ కారణాలు పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచాయి.

అలాగే ఎవరైతే గడ్డాలను పెంచుకుంటారో వారు కుటుంబ సంబంధాలు కూడా విలువ ఇస్తారని, ఫ్యామిలీ మెన్ గా ఉంటారని కూడా ఈ పరిశోధన కనిపెట్టింది. గడ్డం ఉన్న పురుషులు పిల్లలను పెంచే నైపుణ్యాలను అధికంగా కలిగి ఉన్నట్టు గుర్తించారు పరిశోధకులు.

అలాగే గడ్డం పెంచే పురుషులు లైంగిక ప్రక్రియలో చురుగ్గా ఉంటారని, వారు ఒకే భాగస్వామితో దీర్ఘకాలిక లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటారని అధ్యయనం తెలిసింది. అలాగే కుటుంబం పై వారికి దృష్టి ఎక్కువ అని కూడా తేలింది.

పురుషులకు పూర్తిగా గడ్డం పెరగడానికి రెండు నుంచి 6 నెలల సమయం పడుతుంది. అంత సమయం ఓపికగా వారు వేచి ఉండాలి. కొన్ని పరిశోధనల ప్రకారం 73 శాతం మంది పురుషులు గడ్డం లేనప్పుటికంటే గడ్డం ఉన్నప్పుడే ఆకర్షణీయంగా ఉంటామని ఫీల్ అవుతూ ఉంటారట. ప్రస్తుతం గడ్డం గ్రూమింగ్ మార్కెట్ చాలా జోరు మీద ఉంది. 2026నాటికి ఈ మార్కెట్ 43.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఆడవారికి హెయిర్ స్టైల్‌లాగే మగవారికి గడ్డం గ్రూమింగ్ కూడా ఒక ఫ్యాషన్ ట్రెండ్ గా మారింది.

ప్రస్తుతం ప్రపంచంలో 44 శాతం మంది గడ్డాలు పెంచుకుంటున్నట్టు ఒక అంచనా. అయితే మహిళలకు మాత్రం క్లీన్ షేవ్ చేసిన పురుషులే ఎక్కువగా నచ్చుతారట. ముఖ్యంగా ఉద్యోగ ఇంటర్వ్యూలో 90 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు క్లీన్ షేవ్ చేసిన వారిని ఎంపిక చేసుకుని అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు గడ్డం పెంచుకోవాలనుకున్నా... అది ఎదుటివారికి అందంగా కనిపించేలా జాగ్రత్త పడండి.

టాపిక్