గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న రోజులివి. కొన్నిచోట్ల స్వచ్ఛమైన గాలిని కాసేపు ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా పీల్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అందుకే శాస్త్రవేత్తలు ఈ ప్రపంచంలో ఎక్కడ స్వచ్ఛమైన గాలి ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో కెనుక్ అనే చోట ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన గాలి ఉందని కనుగొన్నారు. ఇక్కడ గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు తమ వాతావరణ అధ్యయనాలకు ఇదే ప్రదేశాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ప్రదేశం ప్రపంచంలోనే మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఎందుకు భిన్నంగా ఉంటుందో, అత్యంత పరిశుభ్రమైన గాలిని ఎందుకు కలిగి ఉందో తెలుసుకుందాం.
టాస్మానియాలోని కెనుక్ ప్రాంతంలోని గాలి పరిశుభ్రంగా ఉంటుంది. దీన్నే కేప్ గ్రిమ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడికి చేరే గాలులు నైరుతి దిశలో ప్రయాణిస్తూ వస్తాయి. ఈ గాలులు దక్షిణ మహాసముద్రం మీదుగా వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఆ వైపుగా పారిశ్రామిక కార్యకలాపాలు ఏవి జరగడం లేదు కాబట్టే అటు నుంచి నేరుగా ఈ కెనుక్ ప్రాంతానికి వచ్చే గాలిలో ఎలాంటి కలుషితాలు ఉండవు. కాలుష్యాలు కనపడదు. అందుకే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
ఈ కెనుక్ ప్రాంతంలోని గాలి గురించి ముందే శాస్త్రవేత్తలకు తెలుసు. అందుకే ఇక్కడ వాయు కాలుష్య కేంద్రాన్ని 1976లోనే స్థాపించారు. ఈ స్టేషన్ ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ, కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఈ కాలుష్య కేంద్రం ప్రధాన పని గ్రీన్ హౌస్ వాయువులు, ఏరోసోల్స్, ఇతర వ్యర్ధాలతో కలిగిన వాతావరణాన్ని విశ్లేషించేందుకు ఏర్పాటు చేసింది.
ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలా ఉంటుంది. పర్యాటకులకు ఆకర్షణీయ కేంద్రంగా మారింది. ఇక్కడున్న పర్యావరణ వ్యవస్థ ప్రకృతికి జీవాన్ని అందించింది. ఇది తీరప్రాంతాన్ని కలిగి ఉంటుంది. అడవి సముద్రం కలిసే దృశ్యాలు ఎంతో అందంగా ఉంటాయి. సహజ సౌందర్యానికి ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. స్వచ్ఛమైన గాలిని పీల్చాలనుకుంటే ఈ కెనుక్ ప్రాంతానికి వెళ్లి చూడండి. అయితే వాయు కాలుష్య కేంద్రంలోకి అందరికీ ప్రవేశం ఉండదు. కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం పర్యాటకులు తిరగవచ్చు. అక్కడున్న సహజ సౌందర్యాన్ని ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఎప్పుడైనా ఆస్ట్రేలియా వెళితే కచ్చితంగా మీరు ఈ ప్రాంతాన్ని చూడాల్సిందే.
ఈ కెనుక్ సమీపంలోనే టార్కిన్ అనే అడవి ఉంది. ఇది సాహస ప్రియులకు ఎంతో నచ్చుతుంది. విభిన్న జంతుజాలాలు ఇక్కడ ఉంటాయి. ఈ ప్రాంతం చాలా ఉంటుంది. అక్కడి గాలులు మనకి తాజాదనాన్ని అందిస్తాయి. ఇవి పురాతనమైన అడుగులు ఈ ప్రాంతానికి వెళితే తిరిగి రావాలనిపించదు. శరీరంలో ఒక్కసారిగా కొత్త ఉత్తేజం చేరినట్టు అనిపిస్తుంది.
సంబంధిత కథనం