Optical Illusion: ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో ఏ ముఖం ఆనందంగా కనిపిస్తుందో చెప్పండి, మీరు ఎలాంటి వారో అంచనా వేయొచ్చు-say which face looks happy in the optical illusion given here you can guess what kind of person they ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో ఏ ముఖం ఆనందంగా కనిపిస్తుందో చెప్పండి, మీరు ఎలాంటి వారో అంచనా వేయొచ్చు

Optical Illusion: ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో ఏ ముఖం ఆనందంగా కనిపిస్తుందో చెప్పండి, మీరు ఎలాంటి వారో అంచనా వేయొచ్చు

Haritha Chappa HT Telugu
Apr 26, 2024 09:00 AM IST

Optical Illusion: ఆప్టికల్ ఎల్యూషన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఇది ఒకటి. ఇదొక వ్యక్తిత్వ పరీక్ష. మీరు ఎలాంటి వారో దీని ద్వారా తెలుసుకోవచ్చు.

ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

Optical Illusion: ఆప్టికల్ ఇల్యుషన్లు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లలో ఇదీ ఒకటి. ఇది మీరు ఎలాంటి వారో చాలా సులువుగా చెప్పేస్తుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ లో రెండు ముఖాలు ఉన్నాయి. రెండు ముఖాలు దాదాపు ఒకేలాగా ఉన్నాయి. అయితే కొంతమందికి మాత్రమే రెండు ముఖాలలో ఒక ముఖం సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలా మీకు ఏ ముఖం సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుందో చెప్పండి... దాన్ని బట్టి మీరు ఎలాంటి వ్యక్తిత్వం కలవారో సులువుగా అంచనా వేయొచ్చు.

ఒకటో నంబరు ముఖం మీకు సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తే మీరు తార్కికంగా ఆలోచించే వ్యక్తిత్వం కలవారు. మీకు జీవితంలో అన్నీ క్రమబద్ధంగా ఉండాలి. ఒక పద్ధతిలో ప్రతిదీ సాగాలి. మనసు కన్నా మెదడు చెప్పిన విషయాలనే మీరు నమ్ముతారు. మనసు కన్నా మెదడు చేసే ఆలోచనలకే మీరు ప్రాధాన్యత ఇస్తారు. ఏ విషయాన్ని అయినా మనసుతో కాకుండా మెదడుతో చూస్తారు.

మీకు రెండో నెంబరు ముఖం సంతోషంగా అనిపిస్తే... మీరు కాస్త నెమ్మది వ్యక్తులని అర్థం. అంటే గ్రహణ శక్తి తక్కువగా ఉంటుంది. అయితే స్పష్టమైన ఊహా శక్తిని కలిగి ఉంటారు. ఏ విషయాన్నైనా సృజనాత్మకంగా చెప్పేందుకు ఇష్టపడతారు. మీరు కలలను ఆరాధించే వ్యక్తులు. సహజంగానే ప్రశాంతంగా ఉంటారు.

మెదడులోని ఎడమ భాగం, కుడిభాగం ఈ రెండు పనిచేస్తూ ఉంటాయి. మెదడులోని ఒక భాగం... రెండో భాగంపై ఆదిపత్యం చెలాయిస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అంటే మెదడులోని ఎడమవైపు భాగం తార్కికంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తే అది కుడివైపు మెదడు ఆలోచన శక్తిని తగ్గించేస్తుంది. ఎడమ వైపు మెదడు ఆధిపత్యం చెలాయిస్తే ఆ వ్యక్తి ఆలోచన విధానాలు చాలా వేగంగా ఉంటాయి. ఒక స్థిరమైన లక్ష్యంతో ఉంటాడు. దాన్ని సాధించేందుకు ముందుకు వెళతాడు. అదే మెదడులోని కుడి భాగం ఆధిపత్యం చెలాయిస్తే అతను స్పష్టమైన ఆలోచనలను కలిగి ఉంటాడు. ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. ఎప్పుడు ఆలోచనలలో మునిగి తేలుతారు. ముఖ్యంగా మనసు చెప్పేది వినడానికి ఇష్టపడతారు.

ఆప్టికల్ ఇల్యుషన్ లో మీకు సంతోషంగా ఉన్న ముఖం ఒకటవ నెంబరుది అయితే మీ మెదడులో ఎడమవైపు భాగం ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు లెక్క. అదే రెండో ముఖం సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తే మీ మెదడులో కుడివైపు భాగం ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి.

Whats_app_banner