Promise Day Wishes: మీ ప్రేమలో ఉన్న నిజాయితీని ఇలా మీ ప్రామిస్‌తో చెప్పండి, ప్రామిస్ డే శుభాకాంక్షలు ఇవిగో
వాలెంటైన్స్ వీక్‌లో ప్రామిస్ డే వచ్చేసింది. మీ సంబంధాన్ని, ప్రేమను మీ ప్రియతములకు తెలియజేసేందుకు మంచి సందర్భం ఇది. ఈ రోజున శుభాకాంక్షల రూపంలో ప్రత్యేకమైన వాగ్దానాలను వారికి ఇవ్వండి. ఇవి వారి హృదయాన్ని తాకుతాయి.

హ్యాపీ ప్రామిస్ డే (shutterstock)
వాలెంటైన్ వీక్ లోని ఐదవ రోజు ప్రామిస్ డే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ఈ ప్రత్యేక దినోత్సవం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు అత్యంత ఉత్సాహంతో నిర్వహించుకుంటారు. ఈ రోజున జంటలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం పాటూ శుభాకాంక్షల రూపంలో ఎన్నో వాగ్దానాలను అందిస్తారు. ఏ ప్రేమలోనైనా భాగస్వామికి ఎన్నో వాగ్దానాలు చేయాల్సిందే. ఈ రోజును ప్రత్యేకంగా చేయడానికి, భాగస్వామితో జీవితకాలం పాటు ప్రేమను కోరుకునేందుకు ప్రేమికులు ఒకరికొకరు అందమైన వాగ్దానాలను చేస్తారు. మీరు కూడా వాలెంటైన్ వీక్ లోని ఈ ఐదవ రోజున మీ ప్రియతమైన వారికి మీ ప్రేమపై నమ్మకాన్ని చూపించడానికి రొమాంటిక్ హ్యాపీ ప్రామిస్ డే సందేశాలు, కోట్స్, కవితలను పంపాలనుకుంటే, ఈ హ్యాపీ ప్రామిస్ డే శుభాకాంక్షలు ఉన్నాయి.
ప్రామిస్ డే శుభాకాంక్షలు
- జీవితంలోని ప్రతి మలుపులోనూ నేను నీతో ఉంటాను,
ప్రతి ఆనందంలోనూ నీ చేతిని పట్టుకుంటాను.
హ్యాపీ ప్రామిస్ డే మై లవ్
2. ఇది నా వాగ్దానం,
నేను ఎప్పటికీ నిన్ను వీడను,
నీకోసం నేను వెతుకుతూనే ఉంటాను,
నీ చేతిని వదల్లేను
హ్యాపీ ప్రామిస్ డే ప్రియతమా!
3. నా ప్రేమ నీకే సొంతం,
ఈ వాగ్దానం, ఈ ప్రమాణాలు ఎప్పటికీ నిలబెట్టుకుంటాను.
హ్యాపీ ప్రామిస్ డే మై లవ్!
4. మాటలతోనే నా గుండెను దోచుకుంటావు,
అలా చూస్తూ నా ప్రాణాలను తీసుకుంటావు,
నీ అందాలతో నా గుండెను కదిలిస్తావు,
నీతో ఉంటే ఈ లోకాన్నే మరచిపోతాను.
హ్యాపీ ప్రామిస్ డే...
5. ఎవరి ప్రేమలోనూ షరతులు ఉండకూడదు,
అనుభూతి, ఆలోచనలు పూర్తి కావు,
వాగ్దానాలు, ప్రమాణాలు నిండిన ప్రేమ ఇది.
హ్యాపీ ప్రామిస్ డే...
6. మనం ఎప్పుడూ కలిసి ఉంటే,
రెండు శరీరాలు ఒక ఆత్మ అవుతాయి
నేను నీకు ఈ వాగ్దానాన్ని చేస్తున్నాము
మనం ఎప్పటికీ విడిపోమని
హ్యాపీ ప్రామిస్ డే మై లవ్
7 నేను పర్ఫెక్ట్ కాకపోవచ్చు,
నేను తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు
నేను గొడవలు పడవచ్చు
కానీ నేను నిన్ను నిజాయితీగా ప్రేమిస్తానని వాగ్దానం చేస్తున్నాను.
హ్యాపీ ప్రామిస్ డే నా ప్రియతమా!
8. నేను మీ ప్రతి సమస్యను పరిష్కరిస్తానని వాగ్దానం చేయలేను
కానీ మీరు ఒంటరిగా ఆ సమస్యలను ఎదుర్కోనవసరం లేదు
కష్టాల్లో, సమస్యల్లో నేను మీతోనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను.
హ్యాపీ ప్రామిస్ డే!
9. నేను ఎల్లప్పుడూ మీతో ఉంటానని నేను వాగ్దానం చేస్తున్నాను.
హ్యాపీ ప్రామిస్ డే!
10. నీ నీడలా నీతో ఉంటాను
నీవు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను
నీ నీడ నిన్ను చీకటిలో వదిలేస్తుంది,
కానీ నేను చీకటిలో నీకు వెలుగు అవుతాను!
హ్యాపీ ప్రామిస్ డే
11. నీతో కలిసి గడిపే ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటాను
నీ ప్రేమతో నన్నెప్పుడు బంధించబడి ఉంటాను
ఈ ప్రామిస్ డేకు ఇదే నా ప్రతిజ్ఞ.
12.నీకు సంతోషకరమైన ప్రామిస్ డే శుభాకాంక్షలు.
ఈ ప్రామిస్ డే ఆశ, కలలతో నిండి ఉండాలని
నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.
13. హ్యాపీ ప్రామిస్ డే!
ఈ రోజు నువ్వు చేసే ప్రతి ప్రేమ వాగ్దానం
మన జీవిత ప్రయాణంలో
ముందుకు సాగే మైలురాయి అవుతుంది.
14. ప్రతిరోజూ నేను నిన్ను షరతుల్లేని ప్రేమతో ప్రేమిస్తున్నాను.
అనంతంగా గౌరవిస్తున్నాను.
నా చివరి రోజు వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.
15. నీతో కలిసి నవ్వతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను
కలిసి ఏడుస్తానని వాగ్ధానం చేస్తున్నాను
కలిసి జీవిస్తానని ఈ ప్రామిస్ డే రోజున ప్రతిజ్ఞ చేస్తున్నాను.
సంబంధిత కథనం