New year wishes: కొత్త ఏడాదికి మీ ప్రియమైన అక్కా చెల్లెళ్లకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి-say happy new year 2025 to your beloved sisters in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Year Wishes: కొత్త ఏడాదికి మీ ప్రియమైన అక్కా చెల్లెళ్లకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి

New year wishes: కొత్త ఏడాదికి మీ ప్రియమైన అక్కా చెల్లెళ్లకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి

Haritha Chappa HT Telugu
Dec 27, 2024 11:00 AM IST

New year wishes: శుభ సందర్భం అయినా, సంతోషకరమైన వేడుక అయినా అక్కడ మీ ప్రియమైన అక్కాచెల్లెళ్లు ఉండాల్సిందే. కొత్త సంవత్సరం రాబోతోంది. మీ సోదరీసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడ కొన్ని అందమైన మెసేజులు తెలుగులో ఉన్నాయి.

కొత్త ఏడాది శుభాకాంక్షలు
కొత్త ఏడాది శుభాకాంక్షలు

కొత్త ఏడాది వచ్చేస్తంది. 2024కు ముగింపు పలికే రోజు వచ్చేస్తోంది. సంవత్సరాలు రోజుల్లా చకచకా గడిచిపోతున్నాయి. 2025కు స్వాగతం పలకడానికి కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. హిందువులకు, కొత్త సంవత్సరం ఉగాది, అయితే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, జనవరి 1న కొత్త సంవత్సరంగా నిర్వహించుకుంటారు.

yearly horoscope entry point

కొత్త సంవత్సరం సమీపిస్తుండటంతో పార్టీలు, ప్రయాణాలు, తీర్మానాలు వంటి వివిధ విషయాలకు ప్రణాళికలు రూపొందించడంలో ఎంతో మంది బిజీగా ఉంటారు. హోటళ్లు, రిసార్టుల్లో నూతన సంవత్సరాన్ని నిర్వహించుకోవడానికి ఇప్పటికే సన్నాహాలు జరిగి పోతున్నాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 దాటగానే ప్రజలు టపాసులు పేల్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొత్త కలలు, లక్ష్యాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. మీ ప్రియమైనవారితో ఆనందంగా జీవించాలని కోరుకుంటారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరానికి ముందు మీరు ఎవరికి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారు? కచ్చితంగా మీ ప్రియమై సోదరులకు లేదా సోదరీమణులకే కదా. ఇక్కడ మేము మీకు ఇష్టమైన అక్కా చెల్లెళ్లకు నూతన ఏడాది శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలుసుకోండి.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • హ్యాపీ న్యూ ఇయర్ డియర్ సిస్టర్, మీ జీవితం తీపిదనం నిండి ఉండాలని, కొత్త సంవత్సరం మీ జీవితంలో సంతోషాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.
  • ప్రపంచంలోనే నా ఉత్తమ సోదరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, నీ ప్రేమ, మద్దతు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను
  • ప్రియమైన సోదరి, ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో మంచిని తీసుకురావాలని, మీరు జీవితాంతం ఇలాగే నవ్వుతూ సంతోషంగా జీవించాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్.
  • నువ్వు నాకు అక్కగా ఉండటం నా అదృష్టం, నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలని ఆశిస్తున్నాను, ప్రతి క్షణం మీ ప్రేమ, నమ్మకం, సంరక్షణ నాకు లభిస్తుందని కోరుకుంటూ హ్యాపీ న్యూఇయర్
  • హ్యాపీ న్యూ ఇయర్, నా ప్రియమైన సోదరి. ఈ సంవత్సరం మీ లక్ష్యాలను సాధించడానికి, మీ కలలను సాకారం చేసుకోవడానికి ప్రేరణ , సంకల్పంతో మీకు దక్కాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్
  • డియర్ అక్కా/చెల్లి నీతో గడిపిన చిన్ననాటి తీపి జ్ఞాపకాలు ఎంతో విలువైనవి. ఇలాంటి కొత్త సంవత్సరాలు మీ జీవితంలోకి ఎన్నో రావాలని కోరుకుంటున్నాను, హ్యాపీ న్యూ ఇయర్ అక్కా.
  • నీలాంటి సోదరి దొరకడం నా అదృష్టం. నీ సంరక్షణ, నీ ప్రేమకు ఎప్పటికీ విలువైనవే. తల్లి ప్రేమను అందిస్తున్న నా సోదరికి ఈ నూతన సంవత్సరం సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్.
  • నీ ప్రేమ, మద్దతు, సంరక్షణకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నువ్వు మన తల్లిదండ్రుల స్థానంలో నిలబడి నన్ను జాగ్రత్తగా చూసుకున్నావు. తల్లి లాంటి నా సోదరికి, ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో కొత్త ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను.
  • ఈ కొత్త సంవత్సరాన్ని నీతో సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను, నీకు కొత్త ఏడాది శుభాకాంక్షలు అక్కా

Whats_app_banner