వేసవి కాలం వచ్చిందంటే చాలు, మండే ఎండలకు శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇలాంటి సమయంలో చల్లని, రుచికరమైన పానీయం కోసం మనసు, నాలుక తహతహలాడుతుంటాయి. అటువంటి సమయంలో మీ నాలుకకు చల్లటి, కమ్మటి విందులా అనిపించే అద్భుతమైన పానీయాల్లో ఒకటి మ్యాంగో లస్సీ! పండిన మామిడి పండ్ల తియ్యదనం, చిక్కటి పెరుగు చల్లదనం కలగలిపి చేసిన ఈ లస్సీ కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి మ్యాంగో లస్సీ ఒక చక్కని ఎంపిక. మరి ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన మ్యాంగో లస్సీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.
శరీరాన్ని చల్లబరుస్తుంది: పెరుగు సహజమైన శీతలీకరణ లక్షణాలు కలిగి ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి చల్లగా హాయిగా అనిపిస్తుంది.
డీహైడ్రేషన్ నివారిస్తుంది: పెరుగు, పాలు శరీరానికి అవసరమైన నీటిని, శక్తిని అందిస్తాయి. వేసవిలో ఎక్కువ మంది ఎదుర్కొనే డీహైడ్రేషన్ సమస్యను తగ్గించేందుకు మ్యాంగో లస్సీ చక్కటి ఆప్షన్.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
శక్తినిస్తుంది: మామిడిలోని సహజ చక్కెరలు తక్షణ శక్తిని అందిస్తాయి.
పోషకాలను అందిస్తుంది: లస్సీ తయారీలో ఉపయోగించిన అన్ని పదార్థాల్లోనూ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
తియ్యగా, చల్లగా నాలుకకు విందులా అనిపించే ఈ డ్రింక్ ను పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తాగుతారు. కాబట్టి, ఈ వేసవిలో ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన మ్యాంగో లస్సీని తప్పక ఆస్వాదించండి!
సంబంధిత కథనం