కిట్టీ పార్టీ అంటేనే స్నేహితురాళ్ళతో కలిసి నవ్వులు, కబుర్లు, ఆటపాటలతో సందడి చేసే ఒక ప్రత్యేకమైన వేదిక!ఇలాంటప్పుడు బోరింగ్ గేమ్స్ ఆడితే ఏం బాగుంటుంది. ట్రెండీగా, ఫన్నీగా, కొత్తగా ఏవైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని ఫీలవుతున్నారా? మీ కిట్టీ మీటింగ్‌ను మరింత ఉత్సాహంగా, వినోదభరితంగా మార్చడానికి ఏం గేమ్స్ ఆడిస్తే బాగుంటుంది అని వెతుకుతున్నారా? ఇది కదా అసలైన పార్టీ! అని అంతా అనుకోవాలని కోరుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.
మీ కిట్టీ గ్యాంగ్‌ను కొత్తదనంతో కట్టిపడేసే, కడుపుబ్బ నవ్వించే టాప్ ఇండోర్ గేమ్ ఐడియాలను మీ కోసం మేము ప్రత్యేకంగా అందిస్తున్నాము. క్లాసిక్ ఫేవరెట్‌లకు సరికొత్త ట్విస్ట్‌లను జోడంచండం నుండి, లేటెస్ట్ ట్రెండింగ్ ఛాలెంజ్‌ల వరకు, ప్రతి ఒక్కరిలో ఉత్సాహం నింపే ఆటలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఇవి కచ్చితంగా మీ కిట్టీ పార్టీని ఒక మర్చిపోలేనిఅనుభవంగా మార్చుతాయి. వీటితో మీ పార్టీ ఒక మెమొరబుల్ ఈవెంట్ గా మారుతుంది.
కిట్టీ పార్టీలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ తంబోలా గురించి తెలిసే ఉంటుంది. ఇది తంబోలా 2.0! అంటే సాధారణ నంబర్లకు బదులుగా, మీ గ్యాంగ్‌కు సంబంధించిన ఫన్నీ విషయాలు, మీమ్స్ లేదా ట్రెండింగ్ పదాలతో చీటీలు రాయండి. గెలుపు, ఓటముల నియమాలకు కూడా ఫన్నీ ట్విస్ట్‌లు ఇవ్వండి. (ఉదాహరణకు, మొదటి ఐదుగురు ఫన్నీ సౌండ్ చేయాలి!).
లేటెస్ట్ టిక్‌టాక్ ట్రెండ్‌లు లేదా వైరల్ ఛాలెంజ్‌ల ఆధారంగా సిల్లీ టాస్క్‌లు ఏర్పాటు చేయండి. ఉదాహరణకు, నుదిటిపై కుకీని ఉంది కదలకుండా దాన్ని నోటిలోకి తీసుకోవడం, ఒక కాలుపై నిలబడి వస్తువులను పేర్చడం. నోట్లో నీళ్లు పోసుకుని చేతులపై గట్టిగా కొట్టుకోవడం వంటివి ప్లాన్ చేయండ.
ఫన్నీ ప్రాప్‌లు, వింత టోపీలు, బ్యాక్‌డ్రాప్‌తో ఒక ఫోటో బూత్‌ను సెటప్ చేయండి. అతిథులను గ్రూపులుగా చేసి, ఒక నిర్దిష్ట థీమ్‌పై ఫొటోలు దిగమని చెప్పండి. (ఉదాహరణకు బాలీవుడ్ విలన్స్, ఫేమస్ మీమ్స్) వంటివి. ఫన్నీగా ఉండే గ్రూప్ లకు ఇది చాలా బాగా నచ్చుతుంది.
"పిక్చనరీ, షరాడ్స్ రీలోడెడ్!అంటే కాగితం, పెన్నుకు బదులుగా, టాబ్లెట్ లేదా ఫోన్‌ను ఉపయోగించి గీయండి లేదా యాక్ట్ చేయండి. షరాడ్స్‌లో మీమ్స్, వైరల్ సౌండ్ బైట్స్ లేదా మీ గ్యాంగ్‌లోని వ్యక్తుల ఫన్నీ అలవాట్లను చేర్చండి.ఇది చాలా సరదాగా ఉంటుంది.
మా గ్యాంగ్ లోని వారి గురించి ఎంత తెలుసు?"అనే క్విజ్ చేయండి. మీ స్నేహితుల వ్యక్తిగత జీవితాలు, ఫన్నీ సంఘటనలు లేదా వారి ఇష్టాయిష్టాలపై ఒక ప్రత్యేకమైన క్విజ్ గేమ్ ఆడండి.
లేటెస్ట్ టాలీవుడ్, బాలీవుడ్ రీమిక్స్‌లు లేదా వైరల్ పాటలను ప్లే చేయండి. అతిథులను డ్యాన్స్ చేయమని లేదా పాటను గుర్తించమని అడగండి. ఫన్నీ డ్యాన్స్ స్టెప్స్‌కు ప్రత్యేక బహుమతిలన ప్లాన్ చేయండి.
ఇంట్లో కొన్ని ఫన్నీ వస్తువులను దాచిపెట్టి, వాటిని కనుగొనడానికి మీ గ్యాంగ్‌కు మాత్రమే తెలిసిన జోక్స్‌తో కూడిన క్లూలు ఇవ్వండి.
ఒక ఫన్నీ ప్రారంభ వాక్యంతో కథను మొదలు పెట్టండి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వాక్యం చొప్పున కథను కొనసాగించండి. ఊహించని మలుపులకు సిద్ధంగా ఉండండి!
మీ గ్యాంగ్‌ను టీమ్‌లుగా విభజించండి. ప్రతి టీమ్‌కు ఒక వైరల్ పాటను, కొన్ని ఫన్నీ ప్రాప్‌లను ఇవ్వండి. వారు ఆ పాటకు లిప్ సింక్ చేస్తూ ఫన్నీగా నటించాలి. అత్యుత్తమ ప్రదర్శనకు ఓటు వేసి విజేతను ఎన్నుకోండి.
ఒకరు కళ్లకు గంతలు కట్టుకుంటారు. మిగిలిన వారు ఒక్కొక్కరు ఫన్నీ సౌండ్ చేస్తారు. కళ్లకు గంతలు కట్టుకున్న వ్యక్తి ఎవరు ఏ శబ్దం చేశారో గుర్తించాలి.
కేవలం సినిమా పేర్లు కాకుండా, ఫేమస్ డైలాగులు లేదా ట్రెండింగ్ రీల్ ఆడియోలను యాక్ట్ చేయమని చెప్పండి. దీన్ని అవతలి వారు ఊహించి కనిపెట్టాలి. ఊహించడం మరింత సరదాగా ఉంటుంది.
గత కొన్ని నెలల్లో వైరల్ అయిన వీడియోలు, మీమ్స్ లేదా ఇంటర్నెట్ ట్రెండ్‌లపై ఒక క్విజ్ నిర్వహించండి. ఎవరు ఎక్కువ సమాధానాలు చెప్తారో వారు విజేతలు.
సంబంధిత కథనం
టాపిక్