Saturday Quote : కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా.. వదిలేయడమే బెటర్
లైఫ్లో చాలామంది తమ వల్ల కానీ పనుల గురించి ఎక్కువ ఆలోచించి బ్రైన్ పాడు చేసుకుంటారు. ఏదైనా సాధించగలం అనుకోవడం తప్పులేదు. కానీ ఎంత చేసినా దానిలో ఫలితం ఉండదు అని తెలిసినప్పుడు దానిని వదిలేయడమే మంచిది. లేదు దానితోనే పోరాడతాం అంటారా? దాని కన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదని గుర్తించుకోండి.
Saturday Motivation: మీరు ఏదైనా పని చేస్తున్నట్లయితే.. దానిని మీ అభిరుచికి తగ్గట్లు, అంకితభావంతో చేయండి. అంతేకానీ మీరు మార్చలేని వాటిపై సమయాన్ని వెచ్చించి.. మీ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోకండి. చాలా సందర్భాలలో.. కొందరు గతంలో చేసిన పనుల గురించి పశ్చాత్తాపపడడం లేదా దానిని మార్చాలని అనుకోవడం చేస్తారు. కానీ ఎంత ట్రై చేసినా మీరు వాటిని మార్చలేరు. ఈ విషయాన్ని గుర్తించుకుని.. మీరు వాటి గురించి ఆలోచించడం మానేస్తేనే బెటర్.
గతంలో మీరు తెలిసో, తెలియకో తప్పులు చేసి ఉంటారు. మన తప్పులను వేలు పెట్టి చూపించేవాళ్లు చాలా మందే ఉంటారు. వారిని మీరు మార్చలేరు కాబట్టి.. వారిని సంతోషపరచాలని చూడకండి. మీరు ఎంత మంచిగా ఉన్నా.. వారు మిమ్మల్ని నిందిస్తూనే ఉంటారు.
గతంలో జరిగినది గతంగా మారింది. మారిపోయింది కూడా. దాన్ని మార్చాలని ప్రయత్నిస్తూ కూర్చుంటే.. మీరు ముందుకు వెళ్లలేరు. టైమ్-మెషీన్‌లోకి జరిగిన దానిని మార్చే అవకాశం లేదు కాబట్టి.. గతంలోని తప్పులను సరిదిద్దుకోవాలనే ఆలోచనను వదిలివేయండి. వాటి గురించి ఆలోచించి విచారించాల్సిన పని లేదు. ఎందుకంటే మీరంటే ఇష్టపడేవారు మీ గతాన్ని మీ తప్పుగా చూడరు. మీ పరిస్థితిని అర్థం చేసుకుని మీకు తోడుగా నిలబడతారు. అలాంటి వారి కోసం మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లండి. వారితో కలిసి జీవితంలో సంతోషాన్ని పంచుకోండి. సంతోషకరమైన జ్ఞాపకాలు ఎన్ని వీలైతే అన్ని క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే అవే మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతాయి. తప్పులనుంచి గుణపాఠాలు నేర్చుకోండి. కానీ తప్పులను రిపీట్ చేయవద్దు. ముఖ్యంగా మీరు ఎప్పటికీ మార్చలేని వాటి గురించి ఆలోచించిం.. మీ సమయాన్ని వృథా చేసుకోకండి.
సంబంధిత కథనం